– అమరావతి పేరును రామోజీరావు సూచించారు
– అప్పటి న్యాయమూర్తుల కృషి శ్లాఘనీయం
– జస్టిస్ నజీర్, జస్టిస్ ఎన్వీ రమణ సాయం, సలహాలు మర్చిపోం
– అరుణ్‌జైట్లీ, రాజ్‌నాధ్‌సింగ్ సహకారం చిరస్మరణీయం
– అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్‌కు ఇప్పుడు అవకాశాలు లేవు
– దానికి చాలా సమయం పట్టవచ్చు
– రైతులు పొలాలు అమ్ముకుని పోవద్దు
– అమరావతి రైతు ప్రతినిధుల ఆత్మీయభేటీలో కేంద్రమాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ: ప్రజాస్వామ్యంలో లో కుల, మతాలకు అతీతంగా సమస్య పరిష్కరించాలన్నారు. రాజధాని అమరావతి విషయంలో నేను సాయం చేశానని అనుకోలేదని తన బాధ్యత అనుకుని చేశానని కేంద్ర మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు.
అమరావతి విషయంలో కూడా నా వంతు బాధ్యత తో సహకారం అందించాను. ఈ సమయంలో రామోజీ రావు గారు కూడా మనకి చాలా సహకారం అందించారని గుర్తు చేశారు. అప్పటి వాస్తవాలు తెలిసేలా తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లోనూ పుస్తకాలు ముద్రించి రామోజీరావు గారు వాటిని పంచే ఏర్పాటు చేశారని తెలిపారు.
అమరావతి ఏర్పాటు సమయంలో ఆనాడు జగన్ తో సహా అన్ని పార్టీల వారి మద్దతు ఇచ్చారని తెలిపారు. ఎపి క్యాపిటల్ గా అమరావతి ని కేంద్రం రికార్డు ల్లో పెట్టడానికి అరుణ్ జైట్లీ, రాజ్ నాధ్ సింగ్ నాడు సహకారం అందించారని వివరించారు. ఆరోజు ఆంధ్రప్రదేశ్ తరపున రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాను. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఈ విషయంలో అనేక విధాలుగా సహకరించారు.
రాజధాని అనేది కేవలం పరిపాలనా కేంద్రం మాత్రమే కాదు, అది ఒక ‘గ్రోత్ ఇంజిన్ లాగా ఉండాలి అనేది తన అభిప్రాయమన్నారు. న్యూయార్క్ నగరం లాగా ఒక బలమైన వ్యవస్థను నిర్మిస్తే, ఎవరు వచ్చినా దాన్ని ఏమీ చేయలేరు. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు అమరావతికి పునాది వేశారని తెలిపారు. ఇండియా మ్యాప్ లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కిందే ఉంది. నేడు మన గవర్నర్ గా ఉన్న అబ్దుల్ నజీర్ గారు , మాజీ చీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు సలహాలు, సపోర్ట్ ఇచ్చారని వివరించారు.
అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కి ఇప్పుడు అయ్యే అవకాశాలు కూడా నాకు కనపడట్లేదు. అందుకు కొంత సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. మీరందరూ కూడా సహకరించి ఎవరికి వాళ్ళు అమ్ముకుని పోదాం అని అనుకోకుండా, అక్కడ నిలబడి దాన్ని మీరే గట్టిగా డెవలప్ చేసుకుంటే.. భావి తరాలకి న్యూయార్క్ సిటీనో, సింగపూర్ సిటీనో, అవుతుందని రైతులకు సలహా ఇచ్చారు.
అప్పట్లో అమరావతి పేరు కూడా రామోజీరావు గారే సజెస్ట్ చేశారని , ఉద్యమం సమయంలో రామోజీ రావు గారిని నేను రెగ్యులర్ గా కలుస్తూ ఉండేవాడిని తెలిపారు. ఆయన మంచి చెడ్డ చెప్పేవారు కాబట్టి, కచ్చితంగా. ఈరోజు చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి నేను ఆయన పేరు తీసుకున్నానన్నారు. .