•చంద్రబాబే నిజమైన దళితబాంధవుడు.. జగన్ పచ్చి దళితద్రోహి అని ఆధారాలతోసహా నిరూపించడానికి నేను సిద్ధం
•చంద్రబాబు దళితులకు చేసిన మంచి, మేలుని జీవోలతో నిరూపిస్తాను. నాతో బహిరంగచర్చకు వచ్చే దమ్ము, ధైర్యం, విషయపరిజ్ఞానం దళితమంత్రులకు, వైసీపీ దళితనేతలకు ఉన్నాయా?
• దళితులు తనకు బంధువులు, దళితబిడ్డలకు తానుమేనమామను అని చెప్పే జగన్ మస్తిష్కం నిండా దళితుల్ని తనపాదాల కింద తొక్కేయాలనే ఆలోచనలే ఉంటాయి
• 4ఏళ్ల జగన్ పాలనలో దళితులపై జరిగిన దారుణాలు, హత్యలు, వేధింపులు, వారికి దక్కాల్సిన నిధుల దారిమళ్లింపులు, వారి పథకాల రద్దులు, వారిపై పెట్టిన తప్పుడుకేసులే అందుకు నిదర్శనం
టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య
దళితులు తనకు బంధువులు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి పెద్ద దళితవ్యతిరేకి అని, ఈ విషయం ఆయన ప్రభుత్వంలోని 5గురు దళితమంత్రులు, 28మంది దళిత శాసనసభ్యులు, వైసీపీ దళితవిభాగాలనేతలు అర్థం చేసుకోవాలని, దళితుల్ని తనపాదాల కిందవేసి తొక్కే యాలన్నఆలోచనలు మస్తిష్కంలోనింపుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పష్టంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే మీకోసం…!
“జగన్ తాను దళితబిడ్డలకు తాను మేనమామను అనడం, దళితులకు బంధువుని అనడం అంతా పచ్చిఅబద్ధమే. అసలు దళితబాంధవుడు చంద్రబాబునాయుడు గారే. ఎలానో నేను చెబుతాను. ధైర్యముంటే ప్రభుత్వంలోని దళితమంత్రులు తాను చెప్పినదానిపై బహిరంగ చర్చకు రావాలి. అంతేగాని రౌడీవేషాలు వేయడం, ఉచ్ఛనీచాలులేకుండా బజారు మనుషు ల్లా మాట్లాడటం కాదు.
మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబుగారు రాష్ట్రంలోని అంటరానితనాన్ని రూపుమాపడానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశారు. కమిషన్ సూచించిన 42 రికమండే షన్లను చంద్రబాబుకేబినెట్ ఆమోదించింది. ఈవిషయం జగన్ కు, ఇప్పుడున్న దళిత మంత్రులకు తెలుసా?
చంద్రబాబునాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఉమ్మడిరాష్ట్రం లో అంటరానితనం ఉందని గ్రహించారు. సమాజంలో దళితులకు జరుగుతున్న అవమానా లపై సమీక్షించి, వారికి న్యాయం చేయడంకోసం జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసిన దళిత బాంధవుడు చంద్రబాబునాయుడు. పున్నయ్యకమిషన్ సూచించిన 42 రికమండేషన్లని చంద్రబాబు కేబినెట్ ఆమోదించింది. ఆనాడు చంద్రబాబు చేసిన గొప్పపని గురించి జగన్మో హన్ రెడ్డికి తెలుసా? దళితులకోసం చంద్రబాబు ప్రత్యేకంగా 28 సంక్షేమపథకాల్ని అమలుచే స్తే, వాటిని జగన్ రద్దుచేశాడు. దళితులపథకాల్ని రద్దుచేసిన జగన్ దళితబాంధవుడా..లేక వారికోసం ప్రత్యేకంగా గొప్పపథకాలు అమలుచేసిన చంద్రబాబు దళితబాంధవుడా? దీనిపై మంత్రి నాగార్జున ఏం సమాధానం చెబుతాడు? ఎస్సీఎస్టీ కమిషన్ మొదటిసారి రాష్ట్రస్థాయి లో వేసింది చంద్రబాబునాయుడుగారు. ఎస్పీని, కలెక్టర్ ను దళితులుప్రశ్నించే హక్కుని కల్పించింది చంద్రబాబుగారు. ప్రతిశుక్రవారం స్థానిక సబ్ ఇన్స్ స్పెక్టర్, స్థానిక ఎమ్మార్వో దళితులపల్లెలకు వెళ్లి, వారికిఏమైనా సమస్యలు ఉన్నాయోమో అడిగి, ప్రభుత్వానికి నివేదిక పంపేలా చేసింది చంద్రబాబుగారు. కాదని చెప్పగలరా? దీనిపై విషయపరిజ్ఞానం ఉన్నవైసీపీ నాయకులు ఎవరైనా బహిరంగచర్చకు రావచ్చు. చట్టాలు, జీవోలతో సహా చర్చ కు టీడీపీ సిద్ధంగా ఉంది.
ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెదక్ జిల్లాలో అతిపెద్ద దళితమేళా నిర్వహించిన ఘనుడు చంద్రబాబు
ఉమ్మడిరాష్ట్రంలో ఆరోజుల్లోనే భారీఎత్తున మెదక్ జిల్లాలోని పెద్దారెడ్డిపల్లెలో దళితమేళా నిర్వ హించిన ఘనుడు చంద్రబాబుగారు. దళితవర్గాలకు ఏంచేయాలో..ఏంచేస్తే వారు అభివృద్ధిలో కి వస్తారో చెప్పిన నాయకుడు చంద్రబాబుగారు. ఇలాంటి పని జగన్ ఒక్కటైనా చేశాడా? తన తో ఫోటో దిగడానికివచ్చిన మంత్రి ఆదిమూలపు సురేశ్ బంధువుల్ని కూడా జగన్ దగ్గరకు రానీయలేదు. అదీ జగన్ కు దళితులపై ఉన్న చిన్నచూపు. తాను దళితజాతికి చేసిన మం చిని చంద్రబాబుగారు సరిగా చెప్పుకోలేకపోయారు. డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చేలా చేసింది స్వర్గీయ ఎన్టీఆర్ గారు. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీకాదు. ఎన్టీఆర్ గారు నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా ఉన్నప్పుడు రాజ్యాంగ నిర్మాతకు భారతరత్న ఇవ్వాల్సిందేనని పట్టు బట్టారు..సాధించారు. భారతదేశంలో మొట్ట మొదటిసారి బాబూ జగజ్జీవన్ రామ్ అదిపెద్ద కాంస్యవిగ్రహం ఏర్పాటుచేసింది తెలుగుదే శంపార్టీ. నేను చెప్పేది తప్పు అని తాగుబోతులతో మాట్లాడించడం కాదు. చంద్రబాబుగారిని సైతాన్ అనేంత ధైర్యం వచ్చిందా జూపూడి. అదే చంద్రబాబు ఊ అని ఉంటే జూపూడి ఎప్పుడో జైల్లోఉండేవాడు.
జగన్మోహన్ రెడ్డి దళితద్రోహి అని నేనునిరూపిస్తాను.. రౌడీవేషాలు వేయకుండా, దళితమంత్రులు ఎవరైనా సరే బహిరంగచర్చకు వస్తారా?
ఒకరితర్వాత ఒకరు వంతులువేసుకొని చంద్రబాబుని అంటున్న దళిత మంత్రులుగానీ, జగన్ కానీ ఈ నాలుగేళ్లలో ఒక్క దళితబిడ్డను అయినా విదేశాలకు పంపారా? విదేశీవిద్య పథకం తీసుకొచ్చి రాష్ట్రంలోని దళితుల్ని ఉన్నతచదువులకోసం విదేశాలకు పంపిన గొప్ప వ్యక్తి చంద్రబాబు. దళితులపట్ల మీకుప్రేమ ఉంటే వైసీపీలోని దళితమంత్రులు ఒక్కరిని కూ డా ఎందుకు విదేశాలకు పంపలేదు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వెళ్లే ధైర్యంలేని దళితమంత్రు లు కూడా మాట్లాడతారా? మేం ఏదికావాలంటే అది చంద్రబాబుగారికి చెప్పి సాధించుకోగలం . దళితద్రోహి జగన్మోహన్ రెడ్డి అని నేను నిరూపిస్తాను. ఇద్దరురిటైర్డ్ ఐఏఎస్ లను కూర్చోబె ట్టి చర్చిద్దాం. దళితబాంధవుడు చంద్రబాబు, దళితద్రోహి జగన్ అని నేను నిరూపిస్తాను. మీ రు నిరూపించగలరా? మీరు మంత్రులా? చదువుసంధ్యలు లేని రోడ్ సైడ్ వ్యక్తుల్లా మాట్లాడ తారా? చంద్రబాబు డాక్టర్.బీ. ఆర్ అంబేద్కర్ విదేశీవిద్య అని పేరుపెడితే, అదితీసేసి జగన న్న విదేశీవిద్య అనిపెడితే, సిగ్గులేని మంత్రులు మాట్లాడారా? ఇది తప్పు అని జగన్ కు చె ప్పగలిగారా? మా చంద్రబాబుగారు ఆపనిచేస్తే మేం వద్దనేవాళ్లం. అంబేద్కర్ గొప్పా.. దళిత ద్రోహి జగన్ గొప్పా?
అవగాహనారాహిత్యుడైన జగన్ కంటే, డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ వెయ్యిరెట్లు గొప్ప అని నేను గర్వంగా చెప్పగలను. అదేమాట మిస్టర్ సురేశ్.. మిస్టర్ మేరు గ, మతిస్థిమితంలేని డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వనితలు అనగలరా? మీరు బానిస త్వం చేస్తున్నారు..చేసుకోండి. అంతేగానీ చంద్రబాబుని అంటే మీకు దళితులే బుద్ధిచెబుతా రు. వైసీపీఎమ్మెల్సీ అనంతబాబు దళితడ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి, శవాన్ని డోర్ డెలివ రీ చేస్తే ప్రభుత్వంలోని దళితమంత్రులు ఏంచేశారు? వైసీపీలోని దళితనేతలు ఏంపీకారు? నీ మొగుణ్ణి కొట్టాను..తన్నాను.. చస్తే శ్మశానానికి తీసుకెళ్లు, బతికుంటే ఆసుపత్రికి తీసుకెళ్లు అని అనంతబాబు, సుబ్రహ్మణ్యం భార్యతో అంటే, వాడికి ఘనస్వాగతాలు పలుకుతారా? అం తదారుణంచేసిన అనంతబాబు మనిషా..పశువా? మిస్టర్ సురేశ్ నిన్న గంజాయితాగిన వాడిలా చొక్కాలు విప్పదీసి ఎగిరావు.. మా వాడిని చంపిన వాడిని పార్టీలోనుంచి తీసేయండి అని అనలేకపోయావేం? సజ్జల చెప్పాడని కల్లుతాగి, నిప్పులుతొక్కినకోతిలా వ్యవహరించి నువ్వే అభాసుపాలయ్యావు, యూజ్ లెస్ మినిస్టర్. అంతచదువు చదివి.. పెద్దపెద్ద క్రైస్తవ సంస్థలు, విద్యాసంస్థలు నడిపే నీకుసంస్కారం అబ్బలేదు. దళితుల్ని వ్యతిరేకించేది జగన్ అని తెలుసుకో.
డాక్టర్ సుధాకర్ చనిపోయిన ఘటనలో ముఖ్యమంత్రే హంతకుడు
డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిని చేసి చంపిన మీ ముఖ్యమంత్రిని ఏంచేశారు దళిత మంత్రు లారా? మాస్క్ లు లేకపోతే మాకుకూడా కరోనాసోకే అవకాశముందని సుధాకర్ ప్రశ్నిస్తే, అతన్నిచంపేస్తారా? ఆకేసులో ముఖ్యమంత్రే హంతకుడు. దానిపై వైసీపీదళితనేతలు ఏనాడై నా ముఖ్యమంత్రిని ప్రశ్నించారా? జరిగినదారుణంపై మేం ప్రశ్నించాము. సుధాకర్ కుటుంబా నికి మేం అండగా నిలిచాము. జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లుతాగుతున్న మీరు చంద్రబాబు ని అంటారా? డాక్టర్ సుధాకర్ తాగిఉన్నాడు..అందుకే చొక్కా తీసేశాడని అప్పుట్లో పోలీసు లు అన్నారు. మరి నిన్నమంత్రి సురేశ్ చొక్కాలేకుండా మాట్లాడితే పోలీసులు ఎందుకు అతన్ని అరెస్ట్ చేయలేదు? రాష్ట్రంలో నో పోలీస్. అందుకే యర్రగొండపాలెంలో నిన్న మంత్రి ఆటలు సాగాయి.
దళితుల్ని అమానుషంగా చంపేసి, దళిత ఆడబిడ్డల మానప్రాణాలు బలితీసుకున్నప్పుడు జగన్ పై లేవని దళితమంత్రుల నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయేం?
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చంద్రబాబు వేలాదిమంది దళితయువకులకు ఇన్నోవా కార్లు ఇచ్చారు. జగన్, అతనిప్రభుత్వం ఎందరుదళితులకు కార్లుఇచ్చి, ఎందరిని లక్షాదికారుల్ని చేశాడో మంత్రి మేరుగనాగార్జున చెప్పాలి. ఎగిరెగిరిపడుతున్న జూపూడే అప్పుడు దళిత యువతకు కార్లుఇచ్చాడు. దీనిపై మాట్లాడే ధైర్యం వైసీపీదళితనేతలకు, దళితమంత్రులకు ఉందా? దళితులచేతుల్లో ఉన్న అసైన్డ్ భూముల్ని మీ ప్రభుత్వం లాక్కుంటే మీరు నోరెత్తలే దు.. కానీ మీనోళ్లు చంద్రబాబుపై లేస్తున్నాయేం. 12వేలఎకరాల దళితుల అసైన్డ్ భూము లు పెద్దలహస్తగతమైతే మీ నోళ్లు మూగబోయాయేం? 33 వేలకోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు జగన్ దారిమళ్లిస్తే మీరు పెగల్లేదేం.. ఇప్పుడుచంద్రబాబుపైకి వస్తున్నారు? జాగ్రత్తగా మాట్లాడండి. భూమికొనుగోలు పథకానికి సంబంధించిన రిపోర్టు మావద్ద ఉంది. దానికి సంబంధించి జూపూడిని వదిలేదిలేదు. భూమికొనుగోలుపథకం కింద భూములుకొని చంద్రబాబు దళి తులకు ఇచ్చారు. జగన్ ఒక్క ఎకరమైనా ఇచ్చాడా? చంద్రబాబు కేవలం ఎస్సీలకోసమే 48వేల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీచేశారు.
నాలుగేళ్లలో జగన్ ఒక్కపోస్ట్ కూడా భర్తీచేయలేదేం .. దానిపై ఏనాడైనా దళితమంత్రులు ముఖ్యమంత్రిని ప్రశ్నించలేదేం? రాష్ట్రంలో ఇప్పటికీ 50 వేల బ్యాక్ లాగ్ పోస్టులు అలానే ఉన్నాయి. దళితయువత ఉద్యోగాలకోసం ఎదురుచూస్తు న్నారు. దళితబిడ్డలు నాణ్యమైన విద్యను పొందాలని బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల విధానం తీసు కొచ్చింది చంద్రబాబు. ఆ పథకాన్ని రద్దుచేసిన జగన్ ను బుద్ధిలేని దళితమంత్రులు ఎప్పుడై నా ప్రశ్నించారా? మాస్క్ పెట్టుకోలేదని దళితయువకుడు కిరణ్ ను పోలీసులు కొట్టిచంపితే దళితమంత్రులు ఏంచేశారు? కనీసం సానుభూతికూడా చూపని మీరు దళిత మంత్రులా? దళిత ఎమ్మెల్యేలా? ఇసుకమాఫియాతో మా రోడ్లన్నీ పాడవుతున్నాయి అన్నందుకు దళిత బిడ్డను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి శిరోముండనం చేయిస్తే, మేరుగనాగార్జున నోరు మెదపలే దేం? శిరోముండనం చేసిన ఎస్ ఐని తాము అరెస్ట్ చేయించాం. ఆనాడు లేవని నోరు, ఇప్పుడు చంద్రబాబుపై లేస్తోందేం? ఓంప్రతాప్ అనే దళితయువకుడు మద్యం ధరలపెంపై ప్రశ్నిస్తే అతన్నిచంపేస్తారా? చనిపోయి న యువకుడి ఫోన్ ను అక్కడి సీఐ తీసుకున్నాడు. ఇప్పటికీ ఆ ఫోన్ ఎక్కడుందో తెలియ దు. దానిపై దళితమంత్రులు నోరెత్తలేదేం. కానీ దానిపై తాము ప్రభుత్వాన్ని,ముఖ్యమంత్రిని ప్రశ్నించాము. నెల్లూరులో నారాయణను పోలీసులు స్టేషన్లో కొట్టిచంపితే మీరు నోరెత్తలేదేం. పల్నాడులో దళితబిడ్డ విక్రమ్ కు తెలుగుదేశమంటే ప్రాణం. పోలీసులే వైసీపీవారికి చెప్పి, అతన్ని చంపించారు. దానిపై మీరు ఎప్పుడైనా మాట్లాడారా? దళితయువతి అనూషపై అత్యాచారం చేసి, చంపేస్తే మీరు ఎందుకుఅప్పుడు నోరెత్తలేదు దళితమంత్రులారా? జగన్ కు బాంచన్ దొరా అనడమేనా వైసీపీప్రభుత్వంలోని దళితమంత్రుల పని?
దళితుల అభ్యున్నతి, సంక్షేమానికి చంద్రబాబు ఎన్ని జీవోలు విడుదల చేశారో జగన్ కు అతని ప్రభుత్వంలోని దళిత మంత్రులకు తెలుసా?
దళితుల అభ్యున్నతి, సంక్షేమానికి చంద్రబాబు ఎన్నిజీవోలు విడుదలచేశారో జగన్ కు, వైసీ పీ ప్రభుత్వానికి, దళితమంత్రులకు తెలుసా? ప్రమోషన్లలో కూడా దళితులకు రిజర్వేషన్లు ఇస్తూ జీవోనెం-5 ఇచ్చింది చంద్రబాబుగారు. దళితుల సంక్షేమానికి జగన్ ఇన్నేళ్లలో చేసిన ఒక్కమంచి పని అయినా ఉందని దళితమంత్రులు చెప్పగలరా? బాలయోగి లాంటి వ్యక్తిని లోక్ సభ స్పీకర్ నుచేసింది చంద్రబాబుగారు. కే.ఆర్. నారాయణన్ ను రాష్ట్రపతిని చేయడంలో ప్రధానపాత్ర చంద్రబాబుగారిది. జగన్ ఇన్నేళ్లలో ఎన్నోసార్లు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లాడు. ఆ విమానంలో మేరుగనాగార్జున ఎప్పుడైనా ఎక్కాడా? జగన్ పక్కన కూర్చొని ప్రయాణించాడా? నేను, నక్కా ఆనంద్ బాబు చంద్రబాబుకి చెరోపక్కన కూర్చుంటా ము. అలాఎప్పుడైనా దళితమంత్రులు, వైసీపీలోని దళితఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చున్నారా? తానులేవనెత్తే అంశాలపై నిజంగా మీకు ధైర్యముంటే నిజంగా బహిరంగచర్చకు రండి. జగన్ తాను చేయబోయే పనులగురించి ఎప్పుడైనా దళిత మంత్రు లతో మాట్లాడాడా? మంత్రిపెద్దిరెడ్డి.. ఇంకొందరురెడ్లు వేదికపై కూర్చుంటే డిప్యూ టీ సీఎంనని చెప్పుకునే నారాయణస్వామి చేతులుకట్టుకొని నిలబడ్డాడు. అప్పుడే చెప్పాను.. నారాయణ స్వామికి, ఆ పదవివదిలేయమని. అలాంటి మీరు సిగ్గుఎగ్గు లేకుండా చంద్రబాబుని అంటారా? డిప్యూటీ సీఎం చేతులుకట్టుకొని నిలబడినప్పుడే దళితుల ఆత్మగౌరవం చచ్చి పోయింది.
మంత్రి ఆదిమూలపు అవినీతి కూడా తేలుస్తాం. సజ్జల చెప్పాడని సురేశ్ నిన్న బఫూన్ లా ప్రవర్తించాడు
మంత్రి ఆదిమూలపు పత్తిత్తులా మాట్లాడుతున్నాడు. అతనిపై ఉన్న సీబీఐ కేసులు గురించి తమకు తెలియదా? ఎన్నికల్లో క్రైస్తవసంస్థల సొమ్ము ఎంత ఖర్చుపెట్టాడో తెలియదా? సజ్జల చెప్పాడని ఆదిమూలపు బఫూన్ లా ప్రవర్తించాడు. ఐ.ఆర్.ఎస్ గాపనిచేసిన నువ్వు అలా చేయడానికి సిగ్గులేదా? యర్రగొండపాలెంలో జరగబోయే దానిపై ముందే డీజీపీకి మెసేజ్ ఇచ్చాను. చంద్రబాబు వచ్చినప్పుడు దాడిచేయడానికి సిద్ధంగా ఉన్నమంత్రిని కట్టడిచేయ మని మెసేజ్ ఇస్తే, మీరే ఏంచేశారు? ప్రకాశంజిల్లా ఎస్పీకి, స్థానికడీఎస్పీకి తాను మెసేజ్ ఇచ్చానా లేదా? దానిపై మీరేంచేశారు? మేం బయటకు వస్తే ముందస్తు అరెస్ట్ లని అడ్డుకు నే పోలీసులు, నిన్న యర్రగొండపాలెంలో మంత్రిని ఎందుకు ఆపలేదు? స్థానికఎస్పీకి ఒక్క క్షణం కూడా ఎస్పీగా కొనసాగే అర్హతలేదు. మినిస్టర్ ను తీసుకెళ్లి ఒంగోలులో పడేయాల్సిన పోలీసులు చోద్యంచూశారు. నిన్నజరిగిన ఘటనపై మేం గవర్నర్ ను కలవబోతున్నాం. పోలీసులుఎలా వ్యవహరించారో, వారి బతుకేంటో గవర్నర్ కు తెలియచేస్తాం. ఈ గవర్నర్ కు అన్నీతెలుసు. ఈ అరాచక ప్రభుత్వం, అవినీతిప్రభుత్వం, హంతకులకు మద్ధతుతెలిపే ప్రభుత్వం ఆట్టేకాలం నిలవదు. దళితులకు చంద్రబాబు, తెలుగుదేశంచేసిన మేలుకి సంబం ధించిన సమాచారం జీవోలతోసహా నావద్ద ఉంది. ప్రభుత్వంలోని దళితమంత్రులు, వైసీపీ దళితఎమ్మెల్యేలు, నేతలు ఎవరైనా చర్చకురావచ్చు.
దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు ఏం సందర్భంలో అన్నారో తెలుసుకోకుండా, దళిత మంత్రులు మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనం
దళితకులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చంద్రబాబు అన్నారని విషప్రచారం చేస్తున్నారు. ఆయన ఆ మాటన్నారు.. కానీ ఏసందర్భంలో అన్నారు. దళితులు ఇంకా ఊరికిదూరంగా ఉంటూ పేదరికంలో మగ్గుతున్నారని, వారిబిడ్డలను బాగా చదివించి, ఆర్థికం గా స్థిరపరచాలని, అలాకాకుండాఇలానే ఉంటే దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చంద్రబాబు అంటే దాన్ని మీకుఅనుకూలంగా మార్చిదుష్ప్రచారం చేస్తారా? అలా మాట్లాడుతున్నవారంతా అవివేకులే. మీబిడ్డల్ని ప్రయోజకుల్నిచేయండి.. బాగుపడండి అనేధోరణితో చంద్రబాబు అంటే దాన్ని సిగ్గులేకుండా కట్ చేసి మీకుఅనుకూలంగా మారుస్తా రా? లోకేశ్ బాబుఏమన్నాడు? తానుఏంఅన్నానో నిరూపించండి..రాజకీయాల నుంచి తప్పు కుంటాను అని సవాల్ చేస్తే తోకముడిచిన మీరు.. చీరలు కట్టేంత ఖ్యాతిగాంచారు. నాకు పదవులు ఇవ్వడం..ఇవ్వకపోవడం అనేది మాపార్టీ వ్యక్తిగతం. నాకు ఎప్పుడు ఏంఇ వ్వాలో చంద్రబాబుగారికి తెలుసు. పనికిమాలిన, అవగాహనలేని దళితమంత్రుల మాటల్ని పట్టించు కోవాల్సిన అవసరం చంద్రబాబుకిలేదు. చంద్రబాబు ప్రతిపేదవాడిని కోటీశ్వరుడిని చేయాలన డంతో వైసీపీలో, ప్రభుత్వంలో వణుకు మొదలైంది.
విలేకరులు అడిగినప్రశ్నలకు సమాధానంగా, రామయ్య స్పందన….
సాటిదళితుల్ని నేను అవమానించడంలేదు… మావారికి జ్ఞానబోధచేస్తున్నాను. దళిత మం త్రులకు, వైసీపీలోని దళితనేతలకు విషయపరి జ్ఞానం పెరగాలనే నేను కాస్త పరుషంగా మాట్లాడారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి నిలబడి, అతనికంటే తక్కువస్థాయిలోఉన్న మంత్రులు కాలుమీద కాలువేసుకొని కూర్చుంటే, నామనస్సు కలుక్కుమంది. అందుకే అప్పుడు నారాయణస్వామిని పదవిని వదిలేయమని చెప్పాను. విలేకరుల సమక్షంలో, ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ లసమక్షంలో జగన్ దళితులకు చేసిన మంచి, మేలు.. చంద్రబాబు చేసిన మేలు, మంచిపై బహిరంగచర్చకు తాముసిద్ధం. న్యాయనిపుణుడు కాబట్టి, గవర్నర్ కు రాష్ట్రంలో జరిగే పరిణామాలపై, ప్రభుత్వపనితీరుపై స్పందిస్తారు అనే నమ్మకం మాకుంది.” అని రామయ్య అభిప్రాయపడ్డారు.