– మంత్రి రామానాయుడు హామీ
పూలపల్లి: ఈ ప్రాంతంలో గతం టీడీపీ హయాంలో రూ.కోటిన్నరతో తలపెట్టిన గౌడ శెట్టిబలిజ కల్యాణ మండప నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ప్రకటించారు. పూలపల్లిలో రూ.3 కోట్లతో కల్యాణ మండప పునర్నిర్మాణ పనులకు మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణతో కలిసి నిమ్మల సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. అప్పట్లో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయిందని, మరో విడత 50 లక్షలు మంజూరైనా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రూపాయి పని కూడా నోచుకోలేదన్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ సంక్షేమ శాఖలో నాలుగు కోట్లు బడ్జెట్ ఉంటే మూడు కోట్లు నిధులు తీసుకువచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ సత్తిబాబు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, సామాజిక వర్గ ముఖ్య నాయకులు మేకా కోటేశ్వరరావు, గుబ్బల వేణు, పితాని వెంకట్, పెచ్చేటి బాబు, కోడి విజయభాస్కర్, తదితరులు పాల్గొన్నారు.