Suryaa.co.in

Andhra Pradesh Telangana

చంద్రబాబును విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను

-తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్టుపై తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌పై ఈసారి ఆయన కాస్త ఘాటుగానే స్పందించారు. ఈ అరెస్ట్ కక్షపూరితమైన చర్య అన్నారు. చంద్రబాబు 49 రోజులుగా జైల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధినేత ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందన్నారు. చంద్రబాబును త్వరగా విడుదల చేయాలని తాను ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని స్పీకర్ పోచారం తీవ్రంగా స్పందించారు.

LEAVE A RESPONSE