Suryaa.co.in

Andhra Pradesh

ముఖ్యమంత్రి పదవి కోసం ఇక్కడికి రాలేదు..రాష్ట్రం కోసం వచ్చా

-జగన్ రెడ్డి ఒక అమూల్ బేబి
-పొన్నూరు నియోజకవర్గం నారాకోడూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో
-నియోజకవర్గంలో అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు

నిన్న మొన్నటి వరకు బాదుడే బాదుడు చేశాం.ఇప్పుడు ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని కార్యక్రమం మొదలు పెట్టాం. రాష్ట్ర ఉన్న పరిస్థితికి సరైన పేరు ఇదేం ఖర్మ. జగన్ కు నాలుగేళ్ల తరువాత బీసీలు గుర్తుtd2 వచ్చారు. నిన్న మీటింగ్ పెట్టాడునిన్నటి వైసీపీ సభకు జనం ఇష్టపూర్వకంగా రాలేదు. పథకాలు తీసేస్తామని భయపెట్టి తీసుకువచ్చారు.

టీడీపీ మీటింగ్ లకు స్వచ్ఛందంగా వస్తున్నారు…మన కోసం రాత్రి వరకు ఉంటున్నారు.వైసీపీ సభల నుంచి జనం పారిపోతున్నారు. నేను ముఖ్యమంత్రి పదవి కోసం ఇక్కడికి రాలేదు…నా తమ్ముళ్ళ కోసం, రైతుల కోసం, యువత కోసం వచ్చాను. రాష్ట్రం కోసం వచ్చాను.

సైకో పాలన వద్దు….సైకిల్ పాలన కావాలి.ధూళిపాళ్ళ కుటుంబం నాటి నుండి టీడీపీలో ఉంది. పొన్నూరు లో 9 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు గెలిచిన కుటుంబం ధూళిపాళ్ల కుటుంబం. వరుసగా 5 సార్లుtd గెలిచిన నరేంద్రను అక్రమ కేసులు పెట్టి వేధించారు. జగన్ రెడ్డి ఒక అమూల్ బేబి. అమూల్ ఆయనకు ముద్దు. మనం అప్రమత్తంగా లేకపోతే రాష్ట్రాన్ని కాపాడుకోలేము. రాష్ట్రం కోసం అంతా కలిసి రండి…నేను ముందు ఉండి పోరాడుతా.

LEAVE A RESPONSE