– సీఎం చంద్రబాబు
తిరుపతి: వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుపతిలో టోకెన్లు ఇస్తున్నట్లు తనకే తెలియదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించి 10 రోజులు దర్శనానికి అనుమతించడం సరికాదని.. ఒకరోజు, రెండు రోజులు మాత్రమే దర్శనానికి అనుమతించాలని ఒక సాధారణ భక్తుడిగా తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఆగమపండితులు ఏం చెప్తే.. అధికారులు ఆ విధంగా నిర్ణయం తీసుకోవాలని టీటీడీ అధికారులను ఆయన సూచించారు.