Suryaa.co.in

Andhra Pradesh

దుర్గమ్మ వారికి సేవ చేసే అవకాశం అదృష్టంగా భావిస్తున్నా

– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో.. దుర్గగుడి దివ్య క్షేత్రాన్ని మరింత మరింత అభివృద్ధి
– భక్తులకు విస్తృతమైన సదుపాయాలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు
– విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ జూన్ 16: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గమ్మ వారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు విస్తృతమైన సదుపాయాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి వెల్లడించారు.

ఆదివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కు విచ్చేసిన సుజనా చౌదరి నీ, ఇదే సందర్భంలో ఇక్కడ ఉన్న రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లి రవీందర్ నీ ఆలయ ఈవో కేఎస్ రామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ వేద పండితులు వేద ఆశీస్సులు సుజనా చౌదరి కి అందజేశారు.

అమ్మవారి భక్తుడి గా దుర్గమ్మ వారి ఆలయం మరింత అభివృద్ధి చేసి భక్తులకు విస్తృతమైన సౌకర్యాలు అందించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భారతదేశంలోని ప్రసిద్ధ దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించమన్నారు. మరింత సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి పనులు చేపట్టి భక్తులకు మరిన్ని మౌలిక సదుపాయాలు కలగ చేస్తామని , రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ తో రెడ్డి తో సమన్వయం చేసుకొని దుర్గమ్మ వారి దివ్య క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు

LEAVE A RESPONSE