-రూ.15 కోట్ల చొప్పున ఐదుసార్లు రూ.75 కోట్లు ఇచ్చా
-బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర పార్క్ చేసిన రేంజ్ రోవర్ కారులో ఉన్న ఓ వ్యక్తికి రూ.15కోట్లు ఇచ్చా
– సంచలనం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
మనీ లాండరింగ్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ మళ్లీ ఇంకో బాంబు పేల్చారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తనతో చేసిన వాట్సాప్ చాటింగ్ తన వద్ద ఉందని వ్యాఖ్యానించారు. ఆయనను కోర్టుకు తీసుకువెళుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ రాసిన లేఖ సంచలనం రేపుతోంది.
ఢిల్లీ సీఎం కేజ్రి వాల్ తో చేసిన వాట్సాప్ చాట్ తన దగ్గర ఉన్నట్లు సుఖేష్ తెలిపారు.కేజ్రీ వాల్ చెప్పినట్లు బీఆర్ఎస్ కి రూ.75కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రూ.15 కోట్ల చొప్పున ఐదుసార్లు రూ.75 కోట్లు ఇచ్చానని.. బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర పార్క్ చేసిన రేంజ్ రోవర్ కారులో ఉన్న ఓ వ్యక్తికి రూ.15కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.