Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ కార్యకర్త ఆత్మహత్యతో నాకే సంబంధం లేదు

– సొంత పార్టీ వారి వేధింపులతోనే ఆ వ్యక్తి బలవన్మరణం
– ఆత్మహత్య వీడియోలోనూ పరోక్షంగా వారిపైనే ఆరోపణ
– టీడీపీకి చెందిన 15 మందికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది
– వైయస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌

తాడేపల్లి: గొల్లపూడిలో 15 రోజుల క్రితం ఒక టీడీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే దానికి నేను, వైయస్సార్‌సీపీ కారణమని ఆరోపిస్తూ పత్రికల్లో వార్తలు రాయిస్తు్తన్నారు. నిజానికి అతడి బలవన్మరణానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులే కారణం. ఆ వ్యక్తి చనిపోయే ముందు చేసిన వీడియోలో కూడా తన మరణానికి కారణం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులేనని పరోక్షంగా చెప్పడం జరిగింది.

ఆ వ్యక్తి తన పార్టీకే చెందిన వారికి రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంది. అప్పులు ఇచ్చిన వారంతా దశాబ్దాలుగా టీడీపీకి పని చేస్తున్న వారే. చనిపోయిన వ్యక్తితో వైయస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదు. అలాగే నాకు కూడా ఆవగింజంత సంబంధం లేదు. కావాలంటే ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చు.

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి , దాదాపు 15 మందికి డబ్బులు ఇవ్వాల్సి ఉందని తెలిసింది. ఆయన ఆస్తి ఎవరికి రాసిచ్చారో విచారణ చేస్తే అసలు నిజాలు బయటకొస్తాయి. అవన్నీ పక్కన పెట్టి రాజకీయ కోణంలో నాపై ఆరోపణలు చేయడం, కేసులు నమోదు చేయడం దుర్మార్గం. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నాపై కేసు పెట్టారు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టి, ఎలాంటి విచారణకైనా సిద్ధం అని తలశిల రఘురామ్‌ స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE