– అయినా రేవంత్ లాంటి అంతరాష్ట్ర దొంగ లోకేష్ కాదు
– కలిసినట్టు ఆ డైలాగులు ఎందుకు రా హౌలే?
– లోకేష్ ఏమైనా దావూద్ ఇబ్రహీమా? లేదంటే గూండానా? నీ పెద్ద బాస్ కొడుకే కదా?
– భట్టి , పొంగులేటి , ఉత్తమ్ ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడు
– పిరికి సన్నాసి కాకపోతే లైవ్ లో లై డిటెక్టర్ పరీక్ష కు వస్తావా?
– రేవంత్ రెడ్డికి గాసిప్స్ అడిక్షన్ అనే జబ్బు
– కెసిఆర్ జపం చేయడమే నికృష్టుడు రేవంత్ రెడ్డి బతుకు
– తన చేతిలోనే పోలీసులను ఉంచుకుని ఒక్క ఆరోపణను కూడా నిరూపించలేక పోయిన సన్నాసి రేవంత్
– రేవంత్ పెండ పురుగులాంటి వాడు
– రేవంత్ రెడ్డి ఏమైనా అమితాబచ్చన్ అంత హైట్ ఉన్నాడా?
– కిట్టి పార్టీ ఆంటీ లాగా మీడియాను మేనేజ్ చేసి ఎక్కువ రోజులు బతకలేవు
-తన గురువు బాబుకు తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టాడు
– ఫోన్లు టాప్ చేయడం లేదని తన మనవడి మీద ఒట్టు వేసి రేవంత్ రెడ్డి చెప్పగలుగుతాడా?
– మంత్రివర్గంలో 42 శాతం బీసీలు ఉన్నారా?
– బనకచర్ల పై చర్చ జరిగిందని ఏపీ మంత్రి అంటే లేదని రేవంత్ బుకాయించాడు
– ఖమ్మం ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఖమ్మం: ‘‘ మేము ఏం చేసినా బాజాప్త చేస్తాం బేజాప్తా చేయం. నేను లోకేష్ ను కలవలేదు. అయినా రేవంత్ లాంటి అంతరాష్ట్ర దొంగ లోకేశ్ కాదు. ఒకవేళ లోకేష్ ను కలిస్తే తప్పేముంది? కలిసినట్టు ఆ డైలాగులు ఎందుకు రా హౌలే? లోకేష్ ఏమైనా దావూద్ ఇబ్రహీమా? లేదంటే గూండానా? నీ పెద్ద బాస్ కొడుకే కదా? రేవంత్ రెడ్డి లాగా నేను చీకట్లో మోడీ, అమిత్ షా కాళ్లు పట్టుకోలేదు.
బనకచర్ల విషయంలో అడ్డంగా దొరికన రేవంత్ రెడ్డి దాన్ని కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తనపై నికృష్టపు మాటలు మాట్లాడార’’ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు విమర్శించారు. బనకచర్ల పేరుతో తన గురువు చంద్రబాబుకు రేవంత్ ఇస్తున్న
గురుదక్షిణను అడ్డుకుంటామని హెచ్చరించారు.
గోదావరి మిగులు జలాల్లో 1950 టీఎంసీలు, నికర జలాల్లో 968 టీఎంసీల వాటా తెలంగాణకు ఉందని మోడీ ప్రభుత్వం ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.కాళేశ్వరం తో పాటు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు వేయించిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. అప్పుడే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు.
ఖమ్మం లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, రేవంత్ నోరు తెరిస్తే డ్రైనేజ్ కంటే ఎక్కువ కంపు వస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు ఆయన ప్రెస్ మీట్లు, చిట్ చాట్ లకు దూరంగా ఉండి ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల సాక్షిగా అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి, చిట్ చాట్ ల పేరుతో చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క తప్పు కూడా చేయలేదు కాబట్టే ధైర్యంగా మాట్లాడుతున్నామన్న కేటీఆర్, తనపై చేసిన ఆరోఫణలను రేవంత్ రెడ్డి నిరూపించాలన్నారు.
లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్దమన్న మొదటి నాయకున్ని తానే అన్నారు. ఎవరైనా మంచి మానసిక వైద్యుడికి రేవంత్ రెడ్డిని చూపించాలని ఆయన
కుటుంబసభ్యులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో రేవంత్ చేస్తున్న మోసాన్ని బీసీలు అర్థం చేసుకున్నారన్నారు.
రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లు, చిట్ చాట్ లకు కూడా రాష్ట్ర ప్రజలు దూరంగా ఉండాలి. డ్రగ్స్ తో ఎలాగైతే ఆరోగ్యాలు నాశనం అవుతాయో.. అట్లనే
రేవంత్ రెడ్డి మాట్లాడే నికృష్టపు మాటలు, చెప్పే నీచమైన డైలాగులు వింటే మీ ప్రశాంతతకు ఆరోగ్యానికి హానికరం. ప్రాణాలకు ప్రమాదం.
నక్క పీనుగునే తింటుంది. పంది బురదలోనే పొర్లుతుంది. గొడ్ల సావిడిలోనే పెండ పురుగు తిరుగుతుంది. అట్లనే గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప
ఏమీ రాదు. నికృష్టపు మాటలు తప్ప మంచి మాటలు అస్సలు రావు. ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటడు. ఇంకో రోజు ఫార్ములా ఈ అంటాడు. మరో రోజు డ్రగ్స్ అంటడు కాదంటే కాళేశ్వరం లేదంటే కేసీఆర్. కెసిఆర్ జపం చేయడమే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడు రేవంత్ రెడ్డి బతుకు
పంది ఎంత బలిసినా నంది కాదు. ముఖ్యమంత్రి కావచ్చు. ఇంకో మూడేళ్లు ఉండొచ్చు. మురిపంగా డబ్బులు దోచుకోవచ్చు కానీ ఎన్నటికైనా రేవంత్ రెడ్డి బతుకు పెండను తినే పురుగులాంటిదే. కెసిఆర్ స్థాయి కాని, ముఖ్యమంత్రి పదవికి ఉండే గౌరవం ఈ జన్మలో రేవంత్ కు రావు.
కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్సార్, రోశయ్య, కేసీఆర్ లాంటి మహామహులు ముఖ్యమంత్రి పదవిలో ఎంతో హుందాగా వ్యవహరించారు. రేవంత్ రెడ్డి మాత్రం నికృష్టంగా వ్యవహరిస్తున్నాడు. తన వల్ల వీసమెత్తు లాభం పొందిన ఏ ఒక్క మనిషినైనా రేవంత్ రెడ్డి చూపించగలుగుతాడా? చిల్లర గాసిప్ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ నడుపుకునే కొంతమందికి మాత్రం రేవంత్ రెడ్డి వల్ల కడుపునిండా బ్రహ్మాండంగా ఆదాయం వస్తుంది.
థర్డ్ రేట్ యూట్యూబ్ ఛానల్స్ కి, మీడియా ముసుగులో దరిద్రాన్ని వండే దగుల్బాజీ లకు ఆదాయం పెరిగిందేమో కానీ, రాష్ట్ర ప్రజలకు దమ్మిడి లాభం కూడా కలగలేదు. చిట్ చాట్ ల పేరుతో రేవంత్ రెడ్డి చీటింగ్ చేస్తున్నాడు.
అందుకే జనం ఛీ కొడుతున్నారు. 20 నెలల నుంచి మా మీద టన్నుల కొద్ది అక్రమ కేసులు పెట్టాడు. గుండు పిండంత ఆధారం కూడా దొరకలేదు. తప్పు చేస్తేనే కదా భయపడేది. మేము ఏ తప్పు చేయలేదు.
నువ్వే హోమ్ మంత్రి, నువ్వే ముఖ్యమంత్రి నీ కిందనే వేల మంది పోలీసులు ఉన్నారు. మంది మార్బలం వ్యవస్థ అంతా ఉంది. 20 నెలల్లో ఏం పీకావ్? ఏదో సినిమాలో గ్రీకువీరుడు అనేవారు. ఈయన మాత్రం లీకువీరుడు. లీకులు, చిట్ చాట్లు తప్ప రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు. మేమేం తప్పు చేయలేదు కాబట్టే ఇవాళ ఇంత ధైర్యంగా మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాము. దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టమని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుడిని దేశంలో నేనే. నీకుందా దమ్ము?
ఓటుకు నోటు కేసులో డబ్బులు తీసుకోలేదు, ఇవ్వలేదని చెప్పే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? మగాడివైతే పిరికి సన్నాసి కాకపోతే లైవ్ లో లై డిటెక్టర్
పరీక్ష కు వస్తావా? ఇద్దరి మీద ఏసిబీ కేసు ఉంది .ముందుకు రా అని సవాల్ చేస్తే రాలేదు. దొంగ కేసులు కూడా సరిగ్గా పెట్టడం చేతగాని సన్నాసి రేవంత్ రెడ్డి. దొంగ కేసులు పెట్టి వెంటనే దొరికిపోతాడు.
సీసీ కెమెరాల సాక్షిగా అడ్డంగా దొరికిన చిల్లర దొంగ రేవంత్ రెడ్డి.
ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన బుద్ధి మారలేదు. చిట్ చాట్ ల పేరుతో చీకటి బాగోతాలు ఎందుకు? కెసిఆర్ వస్తాడా? కేటీఆర్ వస్తాడా? అని చాలెంజ్ చేసి నేను వచ్చేసరికి పారిపోయిండు. రేవంత్ సవాల్ ను స్వీకరించి వస్తే పిరికి సన్నాసి పారిపోయిండు. అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా మమ్మల్ని మాట్లాడించే దమ్ముందా? అసెంబ్లీలో ఆ చెంపా ఈ చెంపా వాయిస్తున్నారని ఆయనే మీడియాలో చెప్పుకున్నాడు.
రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం రాదు. పనికిమాలిన పాత చింతకాయ పచ్చడి డైలాగులు మాత్రం వస్తాయి. చర్చకు రమ్మటే జూబ్లీహిల్స్ ప్యాలెస్ కి లేదంటే ఆయన కొడంగల్ కోటకైనా వెళతాను. మేము పోరాటాల నుంచి వచ్చాము. రేవంత్ లాగా బ్యాగులు, సద్దులు మోసి రాజకీయాల్లోకి రాలేదు.
మానసిక రుగ్మతతో బాధపడుతున్న రేవంత్ రెడ్డిని డాక్టర్‌కు చూపించాలని కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వ కాన్వాయ్ లలో తిరుగుతూ… అడ్డగోలు సెటిల్మెంట్లు చేయడం, వాటాలు పంచుకోవడంలో బిజీగా ఉండకుండా అర్జెంటుగా రేవంత్ రెడ్డిని మంచి డాక్టర్ కు చూపించండి. బట్టలు చించుకొని రోడ్ల మీదకి వచ్చేలా ఉన్నాడు. ఆ దరిద్రాన్ని రాష్ట్ర ప్రజలు చూడకముందే దయచేసి ఒక మానసిక ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించాలి.
అధికారంగా చెప్పకపోయినా కాంగ్రెస్ చెబుతున్న అడ్డమైన అబద్ధాలను మీడియా ప్రచారం చేయడం దారుణం. కాంగ్రెస్ చెప్పిన హామీల అమలును ప్రశ్నించడాన్ని వదిలేద్దామా? రైతులకు ఇస్తానన్న బోనస్ ను, ఆడపిల్లలకు ఇస్తానన్న తులం బంగారాన్ని, ముసలివాళ్లకు ఇస్తానన్న 4 వేల పెన్షన్ సంగతిని అడగడం మానేద్దామా? గాసిప్స్ అడిక్షన్ అనే జబ్బు రేవంత్ రెడ్డికి ఉంది. చిట్ చాట్ లతో చిల్లర మాటలు మాట్లాడే నికృష్ణుడు రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి, ఆయనే హోంమంత్రి దమ్ముంటే ఏ ఆధారం ఉందో బయటపెట్టాలి. దుబాయ్ లో ఎవరో చనిపోతే దానిని నాకు అంటగట్టి శవాల మీద పేలాలు ఏరుకుతింటున్న దౌర్భాగ్యుడు రేవంత్ రెడ్డి. దమ్ముంటే ఆధారం బయట పెట్టాలి. ఏ టెస్ట్ చేస్తావో చెయ్, లేదంటే కిట్టి పార్టీ ఆంటీ లాగా మీడియాను మేనేజ్ చేసి ఎక్కువ రోజులు బతకలేవు.
చెత్త మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా అని 2021 లో కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. దానిని స్టే అని మూర్ఖుడైన రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. ఇంజక్షన్ ఆర్డర్ కి స్టే కి తేడా తెలియదు. పాలన గురించి తెలుసుకోవాలంటే బీఆర్ఎస్ నాయకులను కలుస్తారు. దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆంధ్ర ప్రభుత్వం పెట్టిన మీటింగ్ కు వెళ్లేది లేదని, చంద్రబాబు చెప్పినట్లు కేంద్రం వింటుందని 48 గంటల ముందు డైలాగులు కొట్టిన రేవంత్ రెడ్డి, 24 గంటలు గడవకముందే ఢిల్లీకి వెళ్లాడు.
బనకచర్ల గురించి మాట్లాడలేదని రేవంత్ అంటే, సమావేశంలో మొట్టమొదటి అంశం బనకచర్ల అని ఆంధ్ర మంత్రి రామానాయుడు చెప్పిండు. 30 రోజుల్లో కమిటీ వేస్తామని, చంద్రబాబు డైరెక్షన్ కు రేవంత్ రెడ్డి ఓకే అన్నాడని ఆంధ్ర మంత్రి చెప్పిండు. తెలంగాణ ప్రయోజనాలను, గోదావరి జలాలను పూర్తిస్థాయిలో చంద్రబాబు గారికి తాకట్టుపెట్టి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు.
అందుకే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నిన్న చిట్ చాట్ లో అడ్డమైన చెత్తంతా వాగాడు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ, డ్రగ్స్ అంటూ
మన్నూ మశానం తప్ప, ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట కూడా రేవంత్ మాట్లాడడం లేదు.
రైతులకు మొత్తం రుణమాఫీ ఎప్పుడు పూర్తి చేస్తాడో; మహాలక్ష్మి పథకాన్ని ఆడబిడ్డలకు ఎప్పుడు ఇస్తాడో, వడ్ల బోనస్ ఎంత ఇచ్చాడో, రైతు భరోసా 15000 అని చెప్పి 12000 ఎందుకు ఇస్తున్నాడో, ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తాడో, ముసలివాళ్లకు 4000 పెన్షన్లు ఎప్పుడు ఇస్తాడో చెప్పే
దమ్ము రేవంత్ కు ఉందా? .
దండుపాళ్యం బ్యాచ్ లాగా అనుమల బ్రదర్స్ తెలంగాణను దోచుకుంటున్నారు.వెన్నుపోటు పొడవడం అనేది రేవంత్ రెడ్డి కి వెన్నతో పెట్టిన విద్య. నమ్మి ఓటేసిన పాపానికి దేశ రాజధానిలో తెలంగాణ ప్రజల గొంతు కోసిన కసాయి రేవంత్ రెడ్డి. నాడు నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నాడు. త్యాగాలు, బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి లాంటి నికృష్టుడు ముఖ్యమంత్రి కావడం మనందరికీ అవమానం.
పొలంలో నీళ్లు ఉండాలి కానీ రైతు కళ్ళలో కన్నీళ్లు ఉండకూడదన్న లక్ష్యంతో సీతారామ, భక్త రామదాసు, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మిషన్ కాకతీయ పథకాలను చేపట్టి కేసీఆర్ గారు రైతులను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు. రైతుబంధు, రైతు బీమా, బ్రహ్మాండంగా కరెంటు, నీళ్లు ఇచ్చి 12వ స్థానంలో ఉన్న తెలంగాణ ను నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లారు.
చంద్రబాబుతో జరిగిన చీకటి ఒప్పందం బయటపడగానే దాన్ని కవర్ చేసుకోవడానికి ఇలా అడ్డమైన వాగుడు వాగుతున్నాడు.ఏం చేయాలో తెలియక కుడితిలో పడ్డ ఎలుకలాగా కొట్టుకుంటున్నాడు.
అజెండాలో ఫస్ట్ ఐటమ్ బనకచర్ల అని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టంగా చెప్పాక కూడా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధం
ఎందుకు చెప్పాడు? 70 లక్షల రైతులు, కోట్లాది ప్రజల ముందు దొరికాడు కాబట్టే ఇలా పనికిమాలిన మాటలతో అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నాడు. డ్రైనేజీ
కంపు కంటే ఎక్కువ కంపు రేవంత్ రెడ్డి నోటి నుంచి వస్తుంది.
20 నెలల కాలంలో రాష్ట్రానికి ఏం చేశాడో? ఖమ్మం జిల్లా కి ఏం చేశాడో రేవంత్ రెడ్డి చెప్పగలుగుతాడా? కెసిఆర్ సీతారామ ప్రాజెక్టును కడితే ఆ ప్రాజెక్టు ఓపెనింగ్ కి వచ్చి నెత్తిన నీళ్లు చల్లుకొని పోవడం తప్ప రేవంత్ కానీ ఆయన మంత్రులు గాని చేసింది ఏం లేదు. కాంగ్రెస్ వాళ్లు మమ్మల్ని ఏం చేయలేరు. 420 హామీలను అమలు చేసేదాకా వాళ్లను ఫుట్ బాల్ లాగా ఆడుకుంటాము.
కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో పొంగులేటికి 4,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారు. పొంగులేటి ఇంటి మీద ఈడి దాడులు జరిగి సంవత్సరం
అయింది. ఇప్పటిదాకా అటు ఈడి వాళ్లు, ఇటు పొంగులేటి మాట్లాడలేదు. ఏం జరిగిందో చెప్పలేదు. నీళ్లు చంద్రబాబుకు , నిధులు రాహుల్ గాంధీకి పంపుతూ తెలంగాణ ప్రజలకు మాత్రం బూడిద మిగిల్చాడు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈస్టిండియా కంపెనీ అని విమర్శించి, అధికారంలోకి వచ్చాక అదే కంపెనీకి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో సగం పనులు,
పొంగులేటి కంపెనీకి సగం పనుల కాంటాక్ట్ ఇచ్చాడు. జగదీష్ రెడ్డి ఎత్తు గురించి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఏమైనా అమితాబచ్చన్ అంత హైట్
ఉన్నాడా? ఎత్తు బూట్లు ఎత్తు కుర్చీలో కూర్చునంత మాత్రాన ఏం హైట్ పెరగలేదు.
మిస్ వరల్డ్ పోటీలు పెడితే కాంగ్రెస్ నాయకులు తనను వేధించారని వేశ్య లాగా చూశారని మిస్ ఇంగ్లాండ్ ఆరోపించి వెళ్లిపోయింది. బాధ్యులపై కనీసం చర్యలు కూడా తీసుకోలేదు. అంతర్జాతీయంగా మన దేశం పరువు పోతే కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. ఒక ఆడ కూతురుకు అన్యాయం జరిగితే రేవంత్ స్పందించలేదు.
కొన్ని మీడియా సంస్థలు రేవంత్ రెడ్డికి బాకా ఊదుతున్నాయి. వాళ్ళు చెప్పినట్టు ఇతను ఆడుతున్నాడు. రేవంత్ జుట్టు ఆ మీడియా సంస్థల చేతుల్లో
ఉంది. కొంతమందిని కొంతకాలం మోసం చేయొచ్చు అంతేకానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయడం కుదరదు. పదేళ్లలో కేసీఆర్ గారు ఖమ్మం కి ఏం చేశారని ఒక సన్నాసి అడుగుతున్నాడు. 2014లో ఖమ్మం పట్టణం ఎలా ఉండేది. 2023 నాటికి ఎలా అయింది? కెసిఆర్ చేసినట్టు ఖమ్మానికి ఎవరైనా చేశారా?
తన సీటుకు ఎసరు పెడతారన్న భయంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడు. ఫోన్లు టాప్ చేయడం లేదని తన మనవడి మీద ఒట్టు వేసి రేవంత్ రెడ్డి చెప్పగలుగుతాడా? రాష్ట్రంలోని వేలాది మంది నాయకుల
ఫోన్లు ట్యాప్ చేస్తున్నది వాస్తవం కాదా లైవ్ డిటెక్టర్ ముందు కూర్చొని కాదని చెప్పే దమ్ము రేవంత్ కు ఉందా?
రేవంత్ రెడ్డి లాంటి దగుల్బాజీలు చేసే లుచ్చా రాజకీయాలను ప్రజలు తప్పకుండా తిప్పికొట్టాలి. గాసిప్స్, చిట్ చాట్ లు, థంబ్ నెయిల్స్ తో
చేసే వికృత నికృష్ట రాజకీయాన్ని తప్పకుండా నిలదీయాలి.
కాంగ్రెస్ నేతల గల్లా పట్టి 420 హామీల అమలు గురించి అడగాలి. రేవంత్ రెడ్డి తన వారి కోసం ఆరు గ్యారంటీలను అమలుచేస్తున్నాడు. అనుముల సోదరుల కోసం ఫోర్త్ సిటీ, ఏఐ సీటి, ట్రిపుల్ ఆర్ పేరిట భూదందాలు చేసుకునే మొదటి గ్యారంటీ. బాబు గారి కోసం బనక చర్ల రెండో గ్యారెంటీ. రాహుల్ గాంధీకి నెలనెలా డబ్బుల మూటలు పంపడం మూడో గ్యారెంటీ. బామ్మర్ది కోసం అమృత్ కాంట్రాక్ట్ నాలుగో గ్యారెంటీ.
ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాల గొంతు నొక్కడం ఐదో గ్యారెంటీ. నెలకు నాలుగు సార్లు ఢిల్లీ పోయి చీకట్లో మోడీ కాళ్లు పట్టుకోవడం ఆరో గ్యారంటీ. రాష్ట్రంలో ఏ ఫార్మర్ హౌజ్ కు పోయినా రేవంత్ రెడ్డి బతికేందో రైతులు చెబుతారు. నేను ఏ చాలెంజ్ కైనా రెడీ.
42 శాతం రిజర్వేషన్ల పేరిట రేవంత్ ఆడుతున్న నాటకాన్ని బీసీలు అర్థం చేసుకున్నారు. ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ అన్నాడు కానీ ఇప్పటిదాకా
దాన్ని నెరవేర్చలేకపోయాడు. బీసీ సబ్ ప్లాన్ అతీ గతీ లేదు. ప్రభుత్వ పనుల్లో, కాంట్రాక్టుల్లో 42 శాతం బీసీలకు ఇస్తానన్నాడు. కనీసం కొడంగల్
లో అయినా ఇచ్చాడా?
మంత్రివర్గంలో 42 శాతం బీసీలు ఉన్నారా? తన చేతుల్లో ఉన్న ఏ పని చేయకుండా కేంద్రం చేతిలో ఉన్న రిజర్వేషన్లను మాత్రం అమలుచేస్తానని అబద్ధం ఆడుతున్నాడు. రేవంత్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఆర్డినెన్స్ చెల్లదని హైకోర్టు జడ్జిగా పనిచేసిన ఈశ్వరయ్య గౌడ్ చెప్పారు.
బనకచర్ల పేరిట చంద్రబాబుకు రేవంత్ చెల్లిస్తున్న గురుదక్షిణను మేము అడ్డుకుంటాం. 1486 టీఎంసీల నికరజలాల్లో 968 టీఎంసీలు తెలంగాణ వాటా అని మేము అధికారంలో ఉన్నప్పుడే స్పష్టంగా కేంద్రానికి చెప్పాను. 3000 టీఎంసీల మిగులు జలాలను కూడా అదే దామాషా ప్రకారం పంచి 1950 టీఎంసీల నీళ్లు తెలంగాణకు ఇవ్వాలని కేంద్రానికి స్పష్టం చేశాము.
మిగులు జలాల్లో తెలంగాణ వాటా 1950 టీఎంసీలు, నికర జలాల్లో 968 టీఎంసీలు తెలంగాణకు ఉన్నాయని, కేంద్రం ప్రకటించాలి. సీతారామా సాగర్, సమ్మక్క బరాజ్, కాళేశ్వరం మీద ఆంధ్ర ప్రభుత్వం వేసిన కేసులను ఉపసంహరించుకుంటే అప్పుడు తెలంగాణకి న్యాయం జరుగుతుంది కాని ఇలా చేస్తే అన్యాయమే జరుగుతుంది.
గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అనుమతి మనకు బనకచెర్లకు లేదు. దాంతో పాటు సెంట్రల్ వాటర్ కమిషన్, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవు. రేవంత్ రెడ్డి, మోడీ జుట్టు తన చేతిలో ఉందని చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. మేము ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర రైతాంగానికి వ్యతిరేకం కాదు. ముందుగా తెలంగాణ హక్కులు తేల్చాలని మాత్రమే అడుగుతున్నాము.
కాళేశ్వరం తో పాటు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉత్తరాలు రాసిన చంద్రబాబు నాయుడు, ఇవాళ సానుభూతి మాటలు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోము. తెలంగాణ రైతాంగ ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ ఎన్నటికీ రాజీ పడదు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రేవంత్ రెడ్డి చేస్తున్న తెలంగాణ వ్యతిరేక చర్యలను ఎదుర్కునేందుకు ప్రజలతో కలిసి ఉద్యమిస్తాం.