– మెగాస్టార్ చిరంజీవి
చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న టిడిపి చీఫ్ చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. ‘ఈ మహత్తర విజయం రాష్ట్రానికి గత రాజకీయ వైభవం తిరిగి తెచ్చిన మీ దక్షతకు నిదర్శనం.. దురంధరులైన మీరు, పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని నిలబెట్టు కుంటారని ఆశిస్తున్నా.. రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నంబర్-1 గా తీర్చి దిద్దుతారని ఆశిస్తున్నా..’ అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు..