– తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో చంద్రబాబు నాయుడు
తిరుమల:- తెలుగు జాతి ప్రపంచలో నెం. 1 గా ఉండాలని, ఆ సంకల్పంతో పని చేస్తానని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం 8 గం.లకు ఏడుకొండలు శ్రీవారిని చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…..వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ప్రజా సేవకు అంకితమయ్యా. వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం, ఏ పనైనా ఆయన్ను తలచుకునే ప్రారంభిస్తా. 2003 శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో అలిపిరిలో నాపై దాడి జరిగినపుడు నాకు ఆ వెంకటేశ్వర స్వామి ప్రాణ భిక్ష పెట్టారు.
మొన్న నాకు కష్టం వచ్చినపుడు కూడా వెంకటేశ్వరస్వామికి మొక్కుకున్నా. మొదటగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతే మిగతా కార్యక్రమాలు చేపట్టాలి అని అనుకున్నా. భారతదేశం ప్రపంచంలో అగ్రస్ధానంలో ఉండాలనేది, అందులో తెలుగుజాతి నెం – 1 గా ఉండాలనేది నా ఆకాంక్ష. ప్రపంచంలోనే అత్యున్నత నాగరికత భారత దేశం సొంతం. అందులో తెలుగుజాతి ప్రత్యేకం. తెలుగు జాతి అగ్రస్ధానంలో ఉండాలని స్వామిని కోరుకున్నా. తెలుగు జాతిని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాలనే నా సంకల్పానికి శక్తిని ప్రసాదించమని దేవున్ని ప్రార్దించా.
నా కష్ట సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలలోని తెలుగు ప్రజలు మద్దతుగా నిలిచారు. వారందరికీ ధన్యవాదాలు. మనం చేసే పనులకు దైవ సంకల్పం, సహకారం ఉండాలి అప్పుడే అవి విజయవంతం అవుతాయి అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు కూడా చంద్రబాబు తో కలిసి దర్శనం చేసుకున్నారు.
జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తితున్న గన్నవరం – విజయవాడ జాతీయ రహదారి
తిరుపతి నుంచి 1 గంటకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న చంద్రబాబు
ఎయిర్పోర్ట్ వద్ద స్వాగతం పలికిన నేతలు కార్యకర్తలు
దారిపొడవునా రోడ్లపైకి వచ్చి జనం జేజేలు
వేలాది గా తరలివచ్చిన అభిమానులతో జాతీయ రహదారి కిటకిట
గన్నవరం లో లాండ్ అయ్యి 4 గంటలు గడుస్తున్నా ఇంకా రమవరప్పాడు రింగ్ ప్రాంతానికి చేరుకోని చంద్రబాబు కాన్వాయ్.
బాబు ను చూసేందుకు ఎగబడుతున్న సాధారణ ప్రజలు, మహిళలు, దారిలోని వ్యాపారులు, వాహనదారులు, స్థానిక ప్రజలు
ఇళ్ల నుంచి, కాలనీల నుంచి వచ్చి బాబు కు అభివాదం చేస్తున్న ప్రజలు