– కోటంరెడ్డి స్నేహితుడు రామశివప్రసాద్ రెడ్డి
నెల్లూరు:ఫోన్ ట్యాపింగ్ అంటూ శ్రీధర్ రెడ్డి విడుదల చేసిన ఆడియో రికార్డింగ్ మాత్రమేనని స్పష్టం చేసిన కోటంరెడ్డి స్నేహితుడు. కోటంరెడ్డితో మాట్లాడినప్పుడు తానే రికార్డ్ చేశానని వెల్లడించిన కోటంరెడ్డి స్నేహితుడు రామశివప్రసాద్ రెడ్డి. ఓ కాంట్రాక్టర్ విషయమై కోటంరెడ్డి అసహనం వ్యక్తం చేయడంతో ఆ కాంట్రాక్టర్ కు ఆడియో వినిపించా. ఆ కాల్ రికార్డింగ్ ఇంతలా వైరల్ కావడం,ఇంతటి పరిణామాలకు దారితీయడం వంటివి ఊహించలేదు.చిన్నపాటి కాల్ రికార్డింగ్ కు ప్రభుత్వం సంజాయిషీ చెప్పాల్సి రావడంతోనే మీడియా ముందుకు వచ్చాను.నాపై ఎలాంటి అధికార పార్టీ నేతల బెదిరింపులు జరగలేదు..వైయస్సార్ భక్తునిగా మాత్రమే మీడియాకు వెల్లడించా.కానీ ఆ ఆడియో ఇప్పుడు నా దగ్గర మాత్రం లేదు..స్టోరేజ్ ఫుల్ కావడంతో డిలీట్ చేశాను.