– సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: దేశంలోనే రామోజీ ఫిల్మ్ సిటీ ఒక యూనిక్ ఫిల్మ్ సిటీ.. అలాంటి రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణలో ఉండటం మనకు గర్వకారణం. శ్రీమద్ భాగవతం సినిమా తీయాలన్న ఆలోచన వచ్చినందుకు సినిమా టీమ్ ను అభినందిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘శ్రీమద్ భాగవతం పార్ట్-1’ ఫిల్మ్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఆనాడు నలభై ఏళ్ల క్రితం రామాయణం సీరియల్ రామాయణాన్ని అందరికీ చేరువ చేసింది.
కోవిడ్ టైమ్ లో మళ్లీ రామాయణం సీరియల్ ను టెలికాస్ట్ చేస్తే ప్రపంచ రికార్డు సృష్టించింది. 2035లోగా తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమిగా తీర్చి దిద్దాలని మేం సంకల్పించాం. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమిగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందుకోసం 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకుంటున్నాం..
2047 విజన్ డాక్యుమెంట్ లో సినిమా రంగానికి ఒక ప్రత్యేక చాప్టర్ ఉంటుంది. ఆనాడు రామానంద్ సాగర్ తీసిన రామాయణం సీరియల్ ఎంత పాపులర్ అయిందో.. శ్రీమద్ భాగవతం పార్ట్-1 సినిమా అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. మూవీ టీమ్ కు నా అభినందనలు.