Suryaa.co.in

Andhra Pradesh

ఈ గడ్డపై 1000 కి.మీ. చేరుకోవడం నా అదృష్టం

అరాచకాలను ఎండగట్టేందుకు ఆయుధంలా యువగళం
యాత్రపై యువత మనోభావాలను నాతో పంచుకోండి
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

యువగళం పాదయాత్ర రాయలసీమ గడ్డపై 1000 కిలోమీటర్ల మైలురాయి చేరుకోవడానికి సహాయ, సహకారాలు అందించిన యావత్ రాయలసీమ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నేలపై 1000 కిలోమీటర్ల యాత్రను పూర్తిచేయడం నా అదృష్టంగా భావిస్తూ, నా యాత్రను సఫలీకృతం చేసిన ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.

రాయలసీమ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలను ఎండగట్టేందుకు ఈ యాత్ర ఒక ఆయుధంలా ఉపయోగపడింది. రాయలసీమలోని ప్రతి కుటుంబాన్ని సుభిక్షంగా మార్చాలన్నది నా ఆకాంక్ష. రాష్ట్రంలో జగన్ అరాచకపాలనను అంతమొందించేందుకు నేను యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టాను. ఈ సందర్భంగా రాయలసీమ సమగ్ర అభివృద్ది కోసం యువత ఆలోచనలు, అభిప్రాయాలను ఈ దిగువ వాట్సాప్ నెంబర్ లో నేరుగా నాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను.

వాట్సాప్ నెం. 96862 – 96862,
Registration form: https://yuvagalam.com//register,
Email Id: suggestionsyuvagalam@gmail.com ద్వారా మీ మనోభావాలను నేరుగా నాతో పంచుకోవచ్చు.

LEAVE A RESPONSE