– అదే సమయం లో నాకు రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యం
– సమ్మె జరుగుతుంటే చూస్తూ ఉర్కోలేం
– సినిమా కార్మికుల కు హెల్త్ ఇన్సూరెన్స్ అందజేసే ప్రయత్నం చేస్తాం
– సీఎం రేవంత్ రెడ్డి
– సినిమా కార్మికుల ను పిలిచి మాట్లాడిన ముఖ్యమంత్రి లేరన్న సంఘాల నాయకులు
– జూబ్లీ హిల్స్ నివాసం లో సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు
– హాజరైన సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు,తెలుగు సినీ పరిశ్రమ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని,ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు కానుమిల్లి, వివిధ సినీ సంఘాల ప్రతినిధులు
హైదరాబాద్ ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న. ప్రభుత్వం నుంచి సినిమా కార్మికులకు ఏమి కావాలో చర్చించుకుని చెప్పండి. సినిమా కార్మికులను విస్మరించవద్దని నిర్మాతలకు చెప్పాను. సినిమా కార్మికులలో నైపుణ్యాల పెంపుకు సహకరించాల్సిందిగా నిర్మాతలను కోరాను.
స్కిల్ యూనివర్సిటీ లో సినిమా కార్మికులకు శిక్షణ ఇస్తాం. సినిమా కార్మికులు తమ నైపుణ్యాలను పెంచుకోవాలి. అన్ని భాషల చిత్రాలు తెలంగాణ లో షూటింగ్ జరిగేలా సహకరించాలి. చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలి.
పరిశ్రమలో పని వాతావరణాన్ని చెడగొట్టుకోవొద్దు. సమ్మెలకు పోతే రెండు వైపులా నష్టం జరుగుతుంది.సమస్యను సమస్యగానే చూస్తా. వ్యక్తిగత పరిచయాలను చూసుకోను. సినిమా కార్మికుల తరుపున నిర్మాతల తో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది.
ఈ ప్రభుత్వం మీది..మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది.
నేను కార్మికుల వైపు ఉంటాను. అదే సమయం లో నాకు రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యం. సమ్మె జరుగుతుంటే చూస్తూ ఉర్కోలేం. సినిమా కార్మికుల కు హెల్త్ ఇన్సూరెన్స్ అందజేసే ప్రయత్నం చేస్తాం. సినీ కళాకారులకు గద్దర్ అవార్డ్ లను ఇచ్చాం. 10 ఏళ్ల పాటు సినిమా వాళ్లకు అవార్డు లు కూడా ఇవ్వలేదు.