-ఆర్థికఅసమానతలు తగ్గించేందుకు అవసరమైన పైలట్ ప్రాజెక్ట్ ను నిమ్మకూరులోనే ప్రారంభిస్తా
-నా ఆలోచనలు ఎప్పుడూ సమాజహితాన్ని దృష్టిలో పెట్టుకొనే ఉంటాయి
-నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగం గా గ్రామస్తులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు
రామరాజ్యం అంటే నందమూరి తారకరామారావు గుర్తొస్తారు. ఆయన చనిపోలేదు..ఎప్పటీకి మనలోనే ఉంటాడు. పేదరిక నిర్మూలనకు కంకణబద్ధుడైన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన ప్రారంభించిన అనేక సంక్షేమపథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరూ కలిసి రావాలి. మహనీయుడు పుట్టిన నిమ్మకూరు అభివృద్ధికి, ఆప్రాంత అభివృద్ధికి ఒక కాన్సెప్ట్ తయారుచేసి, మే28 నాటికి అమలుచేస్తాం. మే28న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రపంచం కనీవినీ ఎరుగనిరీతిలో నిర్వహిస్తాం. తెలుగుప్రజలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు, రాష్ట్రంలో అర్థికఅసమానతలు తొలగించేందుకు, ఎన్టీఆర్ స్ఫూర్తితో నా శేషజీవితాన్ని అంకితం చేస్తాను.
“యుగపురుషుడు స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి శతజయంతి ఉత్సవాలు, ఆ మహానుభావుడి 100వ పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా మనం దరి పూర్వజన్మ సుకృతం. ఆయన కారణజన్ముడు. రామరాజ్యం అంటే నందమూరి తారకరామారావు గారే గుర్తొస్తారు. అలాంటి మహనీయుడికి జన్మనిచ్చిన గడ్డ నిమ్మ కూరు. చరిత్ర ఉన్నంతకాలం నిమ్మకూరు పేరు నిలిచి ఉంటుంది. నిమ్మకూరులో వెంకట్రావమ్మ, లక్షయ్యచౌదరి దంపతులకు 1923 మే28 న జన్మించిన వ్యక్తిని నేడు నిత్యం మనం స్మరించుకుంటున్నాం. ప్రతి ఒక్క పుట్టుక కు ఒక గొప్ప కారణం ఉంటుంది. ఎన్టీఆర్ గారు తెలుగుసినీచరిత్రలో మకుటంలేని మహరాజుగా వెలిగారు. చిత్రసీమలో ఆయన పోషించని పాత్రలేదు. శ్రీకృష్ణుడు, శ్రీ రాముడు, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని మనం రామారావుగారిలోనే చూశా ము.. చూసుకుంటున్నాం. అందుకే ఆయన కారణజన్ముడు అయ్యి, మనందరి హృద యాల్లో నేటికీ కొలువైఉన్నాడు.
నిమ్మకూరు పక్కనే ఉన్న కొమరవోలులో మేనమామ కుమార్తె, కాట్రగడ్డ చెంచయ్య కుమార్తె అయిన బసవతారకమ్మ ని పెళ్లిచేసుకున్నారు. మహాతల్లిని నేను కళ్లారాచూశాను. విజయవాడలో ఒక గుడిసెలో ఉండి ఎన్టీఆర్ మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. పాలుఅమ్ముతూ గుంటూరు ఏసీకాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. సాధారణ వ్యక్తి, అసాధారణ ప్రతిభతో ఉన్నతశిఖరాలకు ఎదిగాడు. ఎన్టీఆర్ చనిపోయి 30ఏళ్లు అవుతున్నా… ఆయన మనలోనే ఉన్నాడు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఎన్టీఆర్ విగ్రహాన్ని చూసి ప్రారంభిస్తే, మనకు విజయం తధ్యం. ఎన్టీఆర్ వచ్చాకే రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. విప్లవాత్మక నిర్ణయాలతో దేశరాజకీయాలనే తిరగరాసిన గొప్పవ్యక్తి ఎన్టీఆర్.
పేదరికాన్ని తొలుత గుర్తించి, దానినిర్మూలనకు కంకణబద్ధుడైన వ్యక్తి ఎన్టీఆర్. అసాధ్యం అనుకున్న రెండురూపాయలకు కిలో బియ్యం పథకాన్ని అమలుచేసి, పేదల ఆకలి తీర్చిన దేవుడు ఎన్టీఆర్. ఆయన తీసుకొచ్చిన పథకాన్నే తరువాత కేంద్రప్రభుత్వం ఆహారభ ద్రత పథకంగా మార్చింది. పేదలకు ఒంటినిండా బట్టలుండాలన్న గొప్పఆలోచనతో జనతావస్త్రాల పంపిణీ ప్రారంభించి, చేనేతకార్మికులకు ఉపాధికల్పించారు. ఎన్టీఆర్ ఏపనిచేసినా, ఆలోచించినా దానివెనుక గొప్ప పరమార్థం ఉంటుంది. సినీరం గంలో 33ఏళ్లు రారాజుగా వెలిగిన ఎన్టీఆర్ కు వాస్తవంగా రాజకీయాలు అవసరంలే దు. కానీ తనను ఆదరించి, తనకు పేరుప్రఖ్యాతులు అందించిన ప్రజలకోసం ఏదో చేయాలన్న తలంపుతో, సామాజిక బాధ్యతను గుర్తించి రాజకీయాల్లోకి వచ్చారు.
60ఏళ్లు వచ్చాక ఎవరైనా పిల్లలతో గడుపుతూ ఆనందంగా ఉండాలనుకుంటారు. కానీ ఎన్టీఆర్ ప్రజలకోసం తెలుగుదేశాన్ని స్థాపించి, కేవలం 9నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారు. నేషనల్ ఫ్రంట్ తో దేశరాజకీయాల్లో చక్రంతిప్పారు. ప్రధానుల్ని నియ మించే స్థాయికి వెళ్లారు. పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా ఒక ప్రాంతీయ పార్టీ పనిచేసింది. దివిసీమ తుఫాన్ వచ్చిన సమయంలో బాధితుల్ని ఆదుకోవడానికి జోలెపట్టిన నాయకుడు ఎన్టీఆర్. అదీ ఆయనకున్న సామాజికబాధ్యత. రాయలసీమలో కరువు వచ్చినా, చైనాతో యుద్ధంవచ్చినా ప్రజల్ని ఆదుకోవడానికి నడుం బిగించారు. రాజ కీయాల్లో ఆయన 13ఏళ్లే ఉన్నారు. కానీ ఎవరూ చేయనివిధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు.
తెలుగుజాతికోసం ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపించారు. తెలుగుభాషపై మక్కువతో, తెలుగుజాతిపై అభిమానంతో గొప్పనిర్ణయాలు తీసుకున్నారు. ఆయన చూపిన బాట లోనే టీడీపీని నడిపిస్తున్నాం. ముందుచూపుతో సాంకేతికపరిజ్ఞానానికి బాటలు వే శాం. హైదరాబాద్ నగరాన్ని తెలుగుజాతికోసం నిర్మించాం. నాలెడ్జ్ ఎకానమీకోసం కొత్తఆలోచనలు చేశాం. అన్నినగరాలకంటే హైదరాబాద్ దేశంలోనే నంబర్ 1 ఉందం టే దానికి కారణం తెలుగుదేశంపార్టీ…ఎన్టీఆర్ మాత్రమే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చాకే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు బ్రహ్మండంగా రాణిస్తు న్నారు. అదే తెలుగుజాతికి తెలుగుదేశంపార్టీ ఇచ్చినవరం. ఇండియాలోని అన్ని భాషలకంటే అమెరికాలో ఎక్కువగా తెలుగుభాషే అభివృద్ధిచెందింది. అమెరికాలో ఉం డేవారికంటే, అక్కడున్న తెలుగువారే ఎక్కువగా సంపాదిస్తున్నారు. తెలుగువారు ఎక్కడున్నాi నంబర్ వన్ గాఉండాలి.. ఆయాదేశాల్లో ప్రజల్లో గుర్తింపు వచ్చేలాతెలుగు వారు ఉండాలన్నదే నా సంకల్పం. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నే ను చేసే సంకల్పం ఉక్కుసంకల్పంగా నిలుస్తుంది.
ఎన్టీఆర్ స్ఫూర్తి, ఆలోచనావిధానం, సిధ్ధాంతాలు అమలుచేస్తే సమాజంలో ఎవరికీ తిరుగుండదు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మొన్న హైదరాబాద్ లో ఒక సమావేశం నిర్వహించాము. నేడు ఆయనపుట్టిన గడ్డపై రెండోసమావేశం నిర్వ హిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 100 సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ను ఆయనకుమార్తె భువనేశ్వరి నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ బసవతారకం ఆసుపత్రి నిర్వహణ చూస్తు న్నారు. ఆయన పుట్టిన నిమ్మకూరుకి అవసరమైన అన్నిపనులుచేశాం. ఈ గ్రామా న్ని లోకే శ్ దత్తతతీసుకొని అభివృద్ధి చేశారు. అవికాకుండా మహిళాసాధికారత కోసం ప్రత్యేకప్రాంగణం ఏర్పాటుచేశారు. ఈ నేలపైనే త్రిపురనేని రామస్వామి చౌదరి, భోగ రాజు పట్టాభిసీతారామయ్య, పింగళి వెంకయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు వంటి మహానుభావులు జన్మించారు. తిరుపతి వేంకటకవులునడయాడిన నేలఇది. కళామతల్లి ముద్దుబిడ్డలు ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇక్కడి వారే. ఘంటసాల గారు పుట్టిన ప్రాంతం ఇదే. గోరా, డాక్టర్ కే.ఎల్.రావు, కాకాని వెంకటరత్నం, కైకాల సత్యనారా యణ, మండలి వెంకటకృష్ణారావు, కోనేరురంగారావు వంటి వారు ఇక్కడి వారే. ఈనాడు రామోజీరావు ఇక్కడేపుట్టారు. ఈ గడ్డమీద ఏదో మహత్యం ఉంది. ఒక వారసత్వానికి స్ఫూర్తిదాయకమైన ప్రాంతం ఇది.
భెల్ కంపెనీ వచ్చాక నిమ్మకూరుకు లైఫ్ వచ్చింది. అదిపూర్తి అయితే వేలఉద్యోగా లు వస్తాయి. ఎన్టీఆర్ పుట్టిన గడ్డమీద అందరూ బాగుండాలి. సంతోషంగా ఉండాలి. అదే నాఆలోచన. ఎన్టీఆర్ గారు, తానుచేసిన పనులు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతా యి. హైదరాబాద్ లో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ , నాలెడ్జ్ ఎకానమీ కేంద్రం, ఎయిర్ పోర్ట్ వంటివి ఎన్నో తెలుగుదేశం ముందుచూపుతో చేసిన గొప్పపనులు. రాష్ట్ర పునర్నిర్మాణానికి చేయాల్సిందంతా చేస్తాం. తెలుగుప్రజలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానని ఎన్టీఆర్ పుట్టిన గడ్డమీద నుంచి ప్రతిజ్ఞచేస్తున్నాను. నేను పేదవాడికోసమే పనిచేస్తాను. అట్టడుగున ఉన్న పేదవారిని ఉన్నతస్థానాల్లో నిలిపేందుకు, ఆర్థికంగా గొప్పవాళ్లను చేసేందుకే నా శేష జీవితం మొత్తం అంకితం చేస్తాను. ఇదేమాట పదేళ్లముందు చెబితే రాజకీయాలు అ న్నారు. నా ఆలోచనలు ఎప్పుడూ సమాజహితాన్ని దృష్టిలో పెట్టుకొనే ఉంటాయి. అభివృద్ధి జరిగితే సంపద వస్తుంది. రోడ్లు, నీళ్లు, పరిశ్రమలు వస్తే ఆ ప్రాంతాలు అభివృ ద్ధి చెందుతాయి. రైతులతోపాటు, పేదల సంపద పెరగాలి. అప్పుడే సమాజంలో ఆర్థిక అసమానతలు లేకుండా పోతాయి. దాన్ని ఈ గ్రామంనుంచే ప్రారంభిస్తాను.
నిమ్మకూరు అభివృధ్ధికి ఒక కాన్సెప్ట్ తయారు చేస్తాను. రాష్ట్రవ్యాప్తంగా ఆర్థికఅసమానతలు తగ్గించేందుకు అవసరమైన పైలట్ ప్రాజెక్ట్ ను నిమ్మకూరులోనే ప్రారంభిస్తాను. సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికం గా అన్నివిధాల నిమ్మకూరును ముందుకుతీసుకెళ్లేలా మే 28నాటికి పనులు ప్రారం భిస్తాం. తెలుగుజాతి గర్వించేలా నిమ్మకూరు ప్రాంతాన్ని స్ఫూర్తిదాయకమైన ప్రాంతం గా తయారుచేస్తాం. మే28 చరిత్ర కనీవినీ ఎరుగని విధంగా స్వర్గీయ ఎన్టీఆర్ కు నివాళులు అర్పిద్దాం. నిమ్మకూరులో రాత్రి బసచేయడం…నేడు గ్రామస్తులతో మనసువిప్పి మాట్లాడటం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తాను.