– విశాఖలో ఆఫీస్ ప్రారంభం
విశాఖలోని ప్రతిష్టాత్మకమైన లాన్సమ్ స్క్వేర్ బిల్డింగ్‌లో ఐబిఎం ఆఫీసును ఏర్పాటు చేసింది. ప్రముఖ కో-వర్కింగ్ స్పేస్ ప్రొవైడర్ iSprout భాగస్వామ్యంతో ఈ ఆఫీస్ కార్యకలాపాలు సాగనున్నాయి. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ Xలో పోస్టు పెట్టారు. వెల్కమ్ టు వైజాగ్.. ఐబిఎం వచ్చేసింది! స్వాగతించిన లోకేష్.#ChooseSpeedChooseAP అనే హ్యాష్‌ట్యాగ్ జత చేశారు.
వైసీపీ హయాంలో ఐటీ కంపెనీలు రాక లేక వెలవెలబోయిన విశాఖకు, ఇప్పుడు ఐబిఎం రాక కొత్త ఊపిరి పోసింది. ఐబిఎం వంటి సంస్థ ఒక నగరంలో అడుగుపెట్టిందంటే, దాని అనుబంధ సంస్థలు మరియు ఇతర MNC కంపెనీలు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉంటుంది.
సాధారణంగా ఐబిఎం తన గ్లోబల్ డెలివరీ సెంటర్ల ద్వారా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, కన్సల్టింగ్ సేవలను అందిస్తుంది. విశాఖ సెంటర్ ద్వారా వందలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఉపాధి దొరకనుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సిన అవసరం లేకుండా,అంతర్జాతీయ స్థాయిలో కెరీర్ నిర్మించుకునే అవకాశం లభించనుంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. లోకేష్ స్వయంగా కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతుండటంతో, ఫలితాలు గ్రౌండ్ లెవల్లో కనిపిస్తున్నాయి.