Suryaa.co.in

Andhra Pradesh

ఇదేం ఖర్మ.. ఆక్వా రైతాంగానికి

-జాతీయ పార్టీ కార్యాలయంలో గురువారం నాడు రాష్ట్రస్థాయి సదస్సు
-కింజరాపు అచ్చెన్నాయుడు

తెలుగుదేశం హయాంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా రంగం నేడు జగన్‌రెడ్డి చర్యలతో పతనావస్థకు చేరింది. సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకు గురువారం నాడు (24.11.2022) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ‘‘ఇదేం ఖర్మ.. ఆక్వా రైతాంగానికి’’ రాష్ట్రస్థాయి సదస్సును జాతీయ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ఆక్వా రైతు సంఘం నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

ఈ సదస్సుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుతో పాటు ముఖ్య నాయకులు హాజరై ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయంపై చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. ఆక్వా రైతులకు రూ.1.50 కే విద్యుత్‌ సరఫరా చేస్తానని జగన్‌రెడ్డి హామీ ఇచ్చి రైతులను వంచించారు. ఇచ్చిన హామీ అమలు చేయకుండా విద్యుత్‌ కోతలతో ఆక్వా రంగాన్ని జగన్‌రెడ్డి నిండా ముంచారు. ప్రభుత్వ చర్యలతో ఆక్వా రైతులకు మద్దతు ధర లభించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అనేక షరతులతో సబ్సిడీలు ఎత్తివేసి ఆక్వా రైతులను వేధిస్తున్నారు. రూ.5 వేల కోట్ల జె`ట్యాక్స్‌తో ఆక్వా రైతాంగాన్ని నాశనం చేస్తున్న జగన్‌రెడ్డి చర్యలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటంలో ఆక్వా రైతులందరూ పాల్గొనాలని కోరుతున్నాం.

LEAVE A RESPONSE