– జగన్ రెడ్డి పాపాలు పండాయి…ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి
– 31 కేసుల్లో నిందితుడు 30 ఏళ్లు పాలిస్తాడంట..ఏ నేరచరిత్ర లేని వారు పాలించకూడదంట
– సింగిల్..సింగిల్ అంటూ చివరకు సింగిల్ గా మిగిలిపోయాడు
– గూగూల్ లో 6093 అని టైప్ చేస్తే నేరచరిత్ర మొత్తం ప్రత్యక్షం
– అమరావతిలో మీడియాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా క్రైమ్ అండ్ కరప్షనే.అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు.అన్నపూర్ణ లాంటి ఏపీని దిగజార్చి బీహార్, ఉత్తరప్రదేశ్ లే మేలనే పరిస్థితులు తెచ్చారు.ఆయా రాష్ట్రాల్లో పాలన మెరుగుపడగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దురదృష్టకరమైన పాలన కొనసాగుతోంది.
సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలకు చేతలకు పొంతనే కుదరదు.ఓ వైపు వాళ్ల చిన్నాన్న జైలులో ఉన్నాడు. తమ్ముడు కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు వాళ్ల పత్రిక సాక్షిలో కుట్రదారులతో చంద్రబాబు నాయుడు కుమ్మక్కు అని వార్తలు రాయిస్తాడు.31 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని 30 ఏళ్లు పాలిస్తాననడం విడ్డూరంగా ఉంది.
సింగిల్ గా వస్తాను..సింగిల్ గా వస్తానంటూ చెప్పిచెప్పి చివరకు సింగిల్ గా మిగిలిపోయాడు. అమ్మ, చెల్లి ఆయనతో లేరు. మరో చెల్లి ఏకంగా ఆయన బృందంపైనే కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సింగిలా..డబులా అనే సంగతి నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 108 నియోజకవర్గాల ప్రజలు తేల్చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై బనాయించిన అక్రమకేసులకు లెక్కేలేదు.ఓ వైపు అక్రమ కేసులు బనాయిస్తూ మరోవైపు వైసీపీ నేతలే అనేక మందిని చంపారు.మీ ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసి నాలుగు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వస్తే ఊరేగింపులు నిర్వహించి సమాజానికి ఏమని సందేశం ఇస్తున్నారు.కోడికత్తి కేసులో ఎవరి ప్రమేయం లేదని, జగన్మోహన్ రెడ్డి అభిమానే ఆయనకు సానుభూతి రావడం కోసం కత్తితో గీశాడని ఎన్ఐఏ తేల్చేసింది.
ఈ రోజు జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులకు వాయిదాలకు పోలేకపోతున్నాడు..ఆయన పెట్టుకున్న కేసుల్లో కూడా కోర్టుకు రానంటున్నాడు.ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడానికి ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.గూగుల్ లో 6093 అని టైప్ చేస్తే ఆయన నేరచరిత్ర అంతా ప్రత్యక్షమవుతోంది. తాతది హత్య, చిన్నాన్నది దారుణహత్య, మామది అనుమానస్పద మరణం, మరో చిన్నాన్న భాస్కర్ రెడ్డి జైలులో, తమ్మడు అవినాష్ రెడ్డి జైలుకెళ్లే దారిలో..ప్రియశిష్యుడు శంకర్ రెడ్డి 22 నెలలుగా జైలులో రిమాండ్…ఇదీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి.
అంతర్జాతీయ స్థాయిలో విశేష సంఖ్యలో పాపులారిటీ కలిగిన రజనీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని పెద్దాయన గొప్పతనంతో పాటు చంద్రబాబు నాయుడు విజనరీని పొగిడితే తట్టుకోలేని పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయారు. జగన్మోహన్ రెడ్డిని పొగడడానికి ఎవరూ లేరని, నేరచరిత్ర తప్ప చేసిన గొప్ప ఏమీ లేదని తెలిసి కుమిలిపోతూ చెత్త మంత్రులతో చంద్రబాబు నాయుడిని నోటికొచ్చి మాట్లాడిస్తున్నాడు.
31 కేసులున్నాయన 30 ఏళ్లు పాలిస్తాడంట, ఏ కేసులు లేని వాళ్లు అసలు అధికారంలోకి వచ్చేదానికే లేదంట..ఇంత సిగ్గుమాలిన సీఎంను ఎప్పుడూ చూడలేదు.నా వెంట్రుక కూడా ఎవరూ పీకలేరని ప్రగల్భాలు పలికాడు..చివరకు 108 నియోజకవర్గాల ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమదైన శైలిలో సమాధానమిచ్చారు. ఆయన జీవితమంతా నేరమయమే..పరిటాల రవీంద్ర హత్య, మొద్దు శీను, ఓంప్రకాష్, కోడికత్తి, వివేకానందరెడ్డి మర్డర్..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.ఈ రాష్ట్రంలో మైనింగ్ చట్టం జగన్మోహన్ రెడ్డి కాళ్ల కింద నలిగిపోతోంది..సిలికా నుంచి గ్రానైట్ వరకు అన్నింట్లోనూ దోపిడీనే.
దేశంలో ఇంత అత్యాశ కలిగిన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు..ఏం చేసుకుంటాడో ఇంత డబ్బుని.ఓ పక్క ఇన్ని అరాచకాలకు పాల్పడుతూ మరోపక్క సిగ్గులేకుండా పంచతంత్ర కథలంటూ చేతకాని మాటలు మాట్లాడుతున్నాడు. జగనాసుర రక్తచరిత్రతో పాటు అవినీతి, అక్రమాలు, దోపిడీపై తాడేపల్లి ఫైల్స్ పేరుతో సినిమా తీస్తే 1, 2, 3, 4 పేరుతో నాలుగు సీక్వెల్స్ తీసినా సరిపోవు..ఇప్పుడుండే డైరెక్టర్లు కూడా సరిపోరేమో.చరిత్రల ఎప్పుడూ లేనటువంటి దురదృష్టకరమైన పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి.
ప్రజాస్వామ్యాన్ని చంపేసి రాజ్యాంగానికి విలువలేకుండా చేసేశారు. ఇంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో.చట్టాలతో పాటు జాతీయ ఉపాధి హామీ పథకం, 14వ ఫైనాన్స్, 15వ ఫైన్సాన్స్.. చెప్పుకుంటూ పోతే దేనికి విలువ ఇస్తున్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేశారు. సర్పంచ్ ల ఖాతాల్లోని నిధులను లాగేశారు..ప్రజల కోసం పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చారు.జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నేతల పాపాలు పండాయి..వారు చేసే ఘోరాలు పరాకాష్టకు చేరాయి.
మేం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటుంటే మీ కుటుంబసభ్యులేమో సీబీఐ, కోర్టులు, జైళ్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడింది.ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధమైపోయారు.ఏపీకి మళ్లీ మంచిరోజులు రాబోతున్నాయి.. జగన్మోహన్ రెడ్డి రౌడీయిజం, కిరాతకాలు ఇక సాగబోవు.