Suryaa.co.in

Telangana

అసదుద్దీన్ ఆదేశిస్తే సబ్ ఇన్ స్పెక్టర్ ను సస్పెండ్ చేస్తారా..?

జగిత్యాల ఘటనపై డిజిపి సమాధానం చెప్పాలి
ఎంఐఎం ఎమ్మెల్యేలకు జగిత్యాల ఎస్పీ డిఎస్పి రాచ మర్యాదలు
సస్పెన్షన్ ఎత్తి వేసే వరకు ఉద్యమం
ఎస్సై భార్యపై దాడికి పాల్పడిన మహిళను ఎందుకు అరెస్టు చేయలేదు
సీఎం కేసీఆర్ స్పందించాలి
ఎటువంటి విచారణ లేకుండా సస్పెక్షన్ కు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
బంగారు తెలంగాణలో రక్షక భటుల కుటుంబాలకే రక్షణ కరువు
విశ్వహిందూ పరిషత్

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆదేశానుసారం జగిత్యాల సబ్ ఇన్ స్పెక్టర్ అనిల్ కుమార్ యాదవ్ ను అకారణంగా సస్పెండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు ఓ పోలీస్ అధికారిని బలి చేయడం దుర్మార్గం. ఈ చర్యను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. కరీంనగర్ నుంచి జగిత్యాలకు ఆర్టీసీ బస్సులో వస్తున్న ఎస్సై భార్య సంధ్యతో గొడవకు దిగి, దాడి చేసి గాయపరిచిన ముస్లిం మహిళపై ఇప్పటివరకు ఎందుకు కేసు పెట్టలేదో పోలీస్ అధికారులు తెలియజేయాలి.

“కోసిపారేస్తాం..చీరిపారేస్తాం” అంటూ నానా బూతులు తిట్టి ఎస్సై ఎదుటే తన భార్యను వంగబెట్టి వీపు మీద పిడుగులు గుద్దిన మహిళపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.? అసలు ముస్లిం మహిళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అంతటి ధైర్యం ఆమెకు ఎక్కడి నుంచి వచ్చింది..? ఆమె వెనుక ఉగ్ర మూలాలు ఉన్నాయా..? ఈ విషయాలపై పోలీసులు ఎందుకు విచారణ చేపట్టలేదు..? ఎందుకు అరెస్టు చేయలేదు..? అని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ డిజిపిని ప్రశ్నిస్తోంది.

బస్సులో నాపై దాడి చేస్తున్నారని భర్త ఎస్సై కి ఫోన్ చేస్తే.. మరింత రెచ్చిపోయిన ముస్లిం మహిళ విపరీతమైన తిట్లు తిడుతూ దాడికి దిగింది. తన భార్య ఏడుస్తుంటే.. బస్సులో అంత మంది ముందు అవమానాలకు గురవుతుంటే ఎస్సై తన భార్యను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఈ క్రమంలో ముస్లిం మహిళ కడుపులో బూటు కాలుతో తన్నాడు అంటూ అసత్య ప్రచారం చేసిన వాళ్లకి పోలీసులు వంత పాడటం విడ్డూరం. బస్సులో డ్రైవర్.. కండక్టర్.. ప్రయాణికులతో కూడా ఎటువంటి విచారణ లేకుండా హైదరాబాద్ ఎంపీ ఆదేశానుసారం ఎస్ఐ ని సస్పెండ్ చేయడం పోలీసు వ్యవస్థకే తలవంపుగా విశ్వహిందూ పరిషత్ భావిస్తోంది.

ఎంఐఎం ఎమ్మెల్యేలకు రాచ మర్యాదలు
జగిత్యాల ఎస్పీ భాస్కర్.. డీఎస్పీ ప్రకాష్ లు ఓవైసీకి, ఎంఐఎం నేతలకు గులాం గిరి చేయడంలోనే తరిస్తున్నారు. ఘటన జరిగిన మరుసటి రోజు జగిత్యాలకు వచ్చిన ఇద్దరు ఎంఐ ఎమ్మెల్యేలకు రాచ మర్యాదలు చేసిన డిఎస్పి, ఎస్పీలు తోటి ఎస్ఐ ని అకారణంగా తప్పుపట్టారు. ఎస్ఐ భార్యపై దాడి చేసి గాయపరిచిన దుండగులకు మద్దతుగా నిలవడం చూస్తుంటే సమాజం సిగ్గుపడుతుంది.

విచారణ లేకుండా వేటు వేయడం ఐజి కి తగునా..?
బస్సులో ముస్లిం మహిళలపై ఎస్సై దాడి చేస్తుంటే బస్సు డ్రైవర్, కండక్టర్, తోటి ప్రయాణికులనైనా కనీసం విచారించకుండా తప్పంతా ఎస్సై దేనని జడ్జ్మెంట్ ఇచ్చిన మల్టీజోన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి గారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. తాను కట్టుకున్న భార్యను తాను కాపాడుకుంటే ఎస్సై తప్పు చేసినట్లేనా..? ఇంతటి ఘోరమైన నిర్ణయం వెనుక ఏ శక్తులు దాగి ఉన్నాయో సమాజానికి తెలియజేయాలి.

ఇప్పటికీ “కారు స్టీరింగ్” ఓవైసీ చేతిలోనైనా..?
కారు స్టీరింగ్ తన చేతిలోనే ఉంది అని చెప్పుకునే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఈ చర్యతో తన మాటను మరోసారి రుజువు చేసుకున్నాడు. “తెలంగాణ రాష్ట్రంలో పేరుకి కెసిఆర్ ముఖ్యమంత్రి.. కానీ, నడిపేదంతా ఓవైసీనే..!” అని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది. అకారణంగా ఎస్సైని సస్పెండ్ చేసిన ఘటనపై తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ స్పందించాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి పండరీనాథ్ , ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి డిమాండ్ చేశారు.

ఎస్సై అనిల్ యాదవ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ విశ్వహిందూ పరిషత్ పోరాడుతుందన్నారు. పోలీసులు తమ కుటుంబ సభ్యులనే కాపాడుకోకపోతే, ఇక ప్రజలను ఏం కాపాడుతారని విశ్వహిందూ పరిషత్ నిలదీసింది. శనివారం జగిత్యాల బందుకు విశ్వహిందూ పరిషత్ పిలుపునిస్తోందని.. హిందువులందరూ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

కులాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా హిందువులు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. పోలీసు వ్యవస్థకే తలవంపులు తెచ్చేలా ప్రవర్తించిన ఎస్సై సస్పెన్షన్ అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించాలని వారు డిమాండ్ చేశారు. హిందువులపై జరుగుతున్న ప్రభుత్వపు దాడులు ఆపాలని, రజాకార్ల రాజ్యం తీసుకువస్తే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని విశ్వహిందూ పరిషత్ నేతలు హెచ్చరించారు.

– పగుడాకుల బాలస్వామి
అధ్యక్షులు
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (JAT)
9912975753
9182674010

LEAVE A RESPONSE