Suryaa.co.in

Telangana

బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణలో బీసీ అభ్యర్థి సీఎం

కేసీఆర్ ఇప్పటికైనా దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పగలడా?
కేటీఆర్ ‌ను సీఎం చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు
వారసులను కూర్చోబెట్టడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల లక్ష్యం
సూర్యాపేట బీజేపీ ‘జనగర్జన సభ’లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కుటుంబ సంక్షేమం కోసమే.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు పనిచేస్తాయి.రాష్ట్రంలోని పేదల బాగుకోసం బీజేపీ పని చేస్తుంది. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసమే ఆలోచిస్తాయి. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలి. పేదల వ్యతిరేకి బీఆర్ఎస్. దళితలు, బీసీలకు అన్యాయం చేసింది.దళిత ముఖ్యమంత్రి హామీని మర్చిన వ్యక్తి కేసీఆర్.దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు. ఆ హామీ ఏమైంది..?బీసీలకు బీఆర్ఎస్ సర్కార్ ఏం చేసింది..?బీఆర్ఎస్ బీసీల సంక్షేమాన్ని ఎందుకు వదిలేసింది?

బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణలో బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటిస్తాం.కేసీఆర్ ఇప్పటికైనా దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పగలడా?గిరిజనుల అభివృద్ధి కోసం బిజెపి కట్టుబడి ఉంది.వారసులను కూర్చోబెట్టడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల లక్ష్యం.తెలంగాణకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏమి చేయలేదు. కేటీఆర్ ‌ను సీఎం చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు.బిజెపి మాత్రమే పేదల సంక్షేమం కోసం ఆలోచిస్తోంది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉంది. ఇటీవలే మంజూరు చేసిన ట్రైబల్ వర్శిటీకి సమ్మక్క – సారక్క పేరును నిర్ణయించాం. ఈ ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుంది.కృష్ణా జలాల సమస్య పరిష్కారం కోసం ఇటీవలే కొత్త ట్రిబ్యూనల్ ను ప్రకటించాం.జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మంచి నీటిని అందిస్తున్నాం.తెలంగాణకు పసుపు బోర్డు ఇచ్చాం.

స్వాతంత్ర్యం సిద్దించాక తొలిసారి బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకు ప్రధాని మోదీ గారు న్యాయం చేశారు.అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేసుకుంటున్నా. నరేంద్రమోదీ ని మరోసారి ప్రధానిని చేద్దాం.తెలంగాణలో భారతీయ జనతా పార్టీనిగెలిపించాలని కోరుతున్నాను.బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కావాలంటే బిజెపి ని గెలిపించాలి.

LEAVE A RESPONSE