Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగుల ఉద్యమంలో స్వచ్చందంగా పాల్గొనక పోతే చివరికి నష్టపోయేది ఉద్యోగులే

-మన సమస్యల సాధన కోసం మనమే పోరాటం చేయాలి తప్ప, వేరే వాళ్ళు చేయరని ప్రతి ఉద్యోగి గమనించాలి
-ఉద్యోగులపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యదోరణి విడనాడక పోతే ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు
-ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు, సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసం చేస్తున్న ఈ ఉద్యమంలో ఉద్యోగులంతా స్వచ్చందంగా పాల్గొని జయప్రధం చేయకపోతే చివరికి నష్టపోయేది ఉద్యోగులేనని, మన సమస్యల సాధన కోసం మనమే పోరాటాలు చేయాలి తప్ప, ఇతరులు వచ్చి చేయరని ప్రతి ఒక్క ఉద్యోగి, ఉపాధ్యాయుడు, కార్మిక, విశ్రాంత, కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరూ స్వచ్చందంగా ఉద్యమం లో పాల్గొని ఆందోళనా కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఒక్కఉద్యోగి కూడా ఆనందంగా లేని పరిస్దితికి ఉంది. ఒకప్పుడు జీతాలు పెంపుదల కోసం ఉద్యోగులు ఉద్యమం చేసేవాళ్లం,ఇప్పుడు ప్రతినెలా ఒకటవ తేదీనే జీతాలు/పెన్షన్లులు ఇమ్మని కూడా ఉద్యమాలు చేయాల్సిన పరిస్దితి ఈ ప్రభుత్వంలో నెలకొని ఉంది. ఇలాంటి పరిస్దితులలో కూడా ఉద్యోగులు మౌనంగా ఉంటే భవిష్యత్ లో ఉద్యోగుల భవిష్యత్ ఏవిధంగా ఉంటుందో ఆలోచించుకొని ఈ మళిధశ ఉద్యమ కార్యచరణలో ప్రతి ఒక్కరూ పాల్గోని విజయవంతం చేయాలని ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు, సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు అన్నారు.

శనివారం విజయవాడలో లెనిన్ సెంటర్ వద్ద రాష్ట్రకమిటి పిలుపుమేరకు NTR జిల్లా ఏపిజెఏసి అమరావతి జిల్లా కమిటీ ఆద్వర్యంలో చైర్మన్ దొప్పలపూడి ఈశ్వర్,ప్రధానకార్యదర్శి వై.శ్రీనివాసరావు పర్యవేక్షణలో నల్లకండువాలతో జరిగిన నిరసన కార్యక్రమంలో బాగంగా ఉద్యోగుల డిమాండ్లు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా పాల్గొన్న బొప్పరాజు & పలిశెట్టి మిడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు సమస్యలు పరిష్కారం లో ఇంకా చిన్న చూపు చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవరిస్తూ ఉద్యోగుల సహనాన్ని పరిక్షీస్తు ఉంటే మాత్రం ఈ ఉద్యమం ఇంతటితో ఆపేది లేదని ఇకపై ప్రత్యక్ష ఆందోళణా కార్యక్రామాలకు సిద్దపడతామని,ఈ ఉద్యమం వలన ప్రజలకు ఇబ్బందులు, ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు ఎర్పడినా సరే దానికి ప్రభుత్వమే బాద్యతవహించాల్సివస్తుందని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చేక ఏర్పాటు చేసిన గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులసమస్యలు పరిష్కారంలోను, హెల్త్ కార్డులు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల కారుణ్య నియామకాలు అలాగే ఈప్రభుత్వం వచ్చేక ప్రభుత్వంలో విలీనం చేసిన ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరంలో కూడా చొరవ చూపకపోవడం బాదాకరమని తెలిపారు.

ఈమలిధశ ఉద్యమంలో బాగంగా ఈనెల 11 న ఒక్కరోజు సెల్ డౌన్ కార్యక్రమం చేపట్టనున్నామని, ఈనెల 12 న 26 జిల్లాల కలెక్టర్లు కార్యాలయాల వద్ద ఉద్యోగులు & రిటైర్డు ఉద్యోగుల సమస్యలపై, ఈనెల 18 న CPS ఉద్యోగులు,ఉపాధ్యయుల సమస్యల పైన, ఈనెల25 న కాంట్రాక్టు & ఔట్ సోర్శింగు సమస్యల పైన, అంతే కాకుండా ఈనెల 29 న గ్రామవార్డు సచివాలయ ఉధ్యోగుల సమస్యల పై అన్ని జిల్లా కలెక్టర్లు కార్యాలయాలవద్ధ ధర్నాలు నిర్వహించడమే కాకుండా,ఈనెల 15 న మరణించిన CPS మరియు పదవీవిరమణ చేసిన ఉద్యోగుల ఇండ్ల సందర్శన,ఈనెల 27 న పెన్షన్ సకాలంలో రాని రిటైర్డు ఉద్యోగుల ఇళ్లను సందర్శించుతామని బొప్పరాజు,పలిశెట్టి దామోదరరావు తెలిపారు. నిరసన కార్యక్రమానికీ రెవిన్యూభవన్ నుండి ర్యాలీగా లెనిన్ సెంటర్ వరకు అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులంతా వెళ్లి అక్కన నల్లకండువాలు వేసుకొని ఉద్యోగుల డిమాండ్లు పోస్టర్ ను విడుదల చేసారు.

అన్ని జిల్లాలలో విజయవంతం :
శనివారం 26 జిల్లాలలోనూ రాష్ట్రకమిటి ఆదేశాలమేరకు మలిధశ ఉధ్యమకార్యాచరణలో బాగంగా విజయవంతంగా ఉద్యోగుల డిమాండ్లు పోస్టర్లను ఆయా నగరాలు/పట్టణాలలో నల్లకండువాలు వేసుకొని నిరసన ప్రదర్శన చేశారని బొప్పరాజు తెలిపారు. శనివారం లెనిన్ సెంటర్ వద్ధ జరిగిన ఈనిరసన కార్యక్రంలో జెఏసి రాష్ట్రనాయకులు బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావు తో పాటు కె.చంధ్రశేఖర్, ఏ.సాంబశివరావు, యస్.మల్లేశ్వరరావు, వి.అర్లయ్య,డి.శ్రీనివాస్, జి.ప్రవీన్ కుమార్ రెడ్డి, బత్తెన రామకృష్ట, చింతకాయల అప్పారావు తధితరులు నాయకులతో పాటు అధికసంఖ్యలో ఉధ్యోగులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE