-57 ఏళ్లకే పెన్షన్ ఇప్పిస్తాం..
– 50 వేల నుంచి లక్ష లోపు రైతు రుణాలు మాఫీ…
– 60 నుంచి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం….
– స్వంత జాగా ఉన్నవారికి ఇళ్లు కట్టుకునేందుకు 5 లక్షల రూ .సాయం చేస్తాం.
– రాజేందర్ గారు….మీరు గెలిస్తే హుజూరాబాద్ కు ఎం చేస్తారు.
– సిలిండర్ ధర 500 రు. కు తగ్గిస్తారా….? మీ బీజేపీ పార్టీ ఏం చేస్తది..?
– ఈటల రాజేందర్ కు ఆర్థిక మంత్రి హరీశ్ రావు సూటి ప్రశ్న….
– ఇందిరానగర్, శాలపల్లిలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారం
ఇది నడమంతర ఎన్నికలు. రెండున్నరేళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. సీఎంగా కేసీఆర్ ఉంటారు. ఆర్థిక మంత్రిగా నేను ఉంటాను. 30 ఎన్నికల తర్వాత ఏ పని జరగాలన్నా సీఎంగారి ప్రేమ ఉండాలి. ఈటల రాజేందర్ పార్టీ బీజేపీ ఢిల్లీలో ఉంది. టీర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉంది.
బీజేపీ ధరలు పెంచింది. టీఆర్ఎస్ పార్టీ సంపదను పెంచి పేదలకు పంచింది. బీజేపీ పేదలను దంచింది. పెద్దలకు, గద్దలకు పంచింది.సబ్సిడీ ఎగబెట్టిండ్రు, సిలిండర్ ధర వెయి రూపాయలు చేసిండ్రు. పేదలపై భారం వేసి, పెద్ద పెద్ద లోన్లు తీసుకున్న వ్యాపారవేత్తలకు పది లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారు. రైతులకు చేయలేదు. పేదలకు చేయలేదు. పెద్దలకు చేసిండ్రు.
కేసీఆర్ 2016 రూ పెన్షన్ పెదలకు ఇచ్చిండ్రు. కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష నూట పదహార్లు సాయం చేసిండు. రైతులకు యాసంగి, వానాకాలం పంటకు కలిపి ఎకరానికి పది వేలు ఇచ్చింది కేసీఆర్. ఏది ఇచ్చినా రైతు బందు, దళిత బందు ఇచ్చినా.. అది కేసీఆర్ మాత్రమే ఇస్తడు.
శాలపల్లిలోనే ఈటల రాజేందర్ ను తన తమ్ముడు అన్నడు. ఆకాశానికి పైకెత్తిండు. కాని ఈటల ఎం అంటున్నడు.. బొంద పెడతా అంటున్నడు. ఘోరీ కడతా అంటున్నడు… కూల గొడతా అంటున్నడు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను మోసం చేసిండు. పెంచి పెద్ద చేసి ఆరు సార్లు ఎమ్మెల్యేను, రెండు సార్లు మంత్రిని చేస్తే.. ఇష్టమొచ్చినట్లు కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ ను తిడుతున్నరు.
తిట్టడం కాదు. గెలిస్తే ఎం చేస్తవో చెప్పు. 57 ఏళ్లకే 2016 రూపాయల పెన్షన్ ఇస్తాం. నెలకు రెండు సార్లు ఇక్కడకు వచ్చి మీ పనులు చేయిస్తా. 50 వేల నుంచి లక్ష లోపు రుణాలు ఉగాది పండుగ తర్వాత వడ్డీతో
సహా మాఫీ చేస్తాం.సొంత జాగాలో ఇళ్లు కట్టిస్తాం. ఐదు లక్షల ఇళ్లు కట్టిస్తాం. మంత్రిగా ఉండి ఒక్క ఇళ్లు కట్టలేదు. రేపు గెలవనే గెలవడు.గెలిచినా మంత్రి కాడు. ఏ రకంగా ఇళ్లు కడతడు. ఇప్పటికే ఇళ్లు కట్టకుండా మోసం చేసిండు.
గెల్లు శ్రీనును గెలిపించండి. మళ్లీ వచ్చి కొబ్బరికాయ కొట్టి పనులు చేయిస్తా.. రాజేందర్ గారికి ఓటు ఎందుకు వేయాలి. బీజేప గవర్నమెంట్ పెట్రోల్, డీజీల్, గ్యాస్, మంచినూనె ధరలు పెంచిండ్రు. అయినా బీజేపీక ఓటు వేయాలా.. వేయి రూ. సిలిండర్ చేసాం. అయినా ఓటు వేశారు. ఇంకో 500 రూ. పెంచరా… కేంద్ర మంత్రితో మాట్లాడినా..దీని ధర 500 చేయిస్తా అని రాజేందర్ గారు చెప్పాలి కదా.. ఎందుకు చెప్పడం లేదు.
బీజేపీకి ఓటు వేయడమంటే..మన వేలితో మన కన్ను పొడుచుకోవడమే. మీటంగ్ లకు వస్తే ఇది చేస్తా అని చెప్పడం లేదు. బొంద పెడతా..కూలగొడతా అని తిడుతున్నరు.బీజేపీ పార్టీ ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతుంది. బీఎస్ఎన్ ఎల్ లో 50 వేల ఉద్యోగాలుతీసేసింది. రైల్వేలు, విమానాశ్రయాలు, బ్యాంకులు, ఎల్.ఐ.సీని అమ్ముతున్నరు. టీఆర్ఎస్ 1 లక్ష 30 వేల ఉద్యోగాలు ఇచ్చింది. త్వరలో మరో 60 నుంచి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. ఉద్యోగాలు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. మరో 70 వేల ఉద్యోగాలు ఇచ్చేది టీఆర్ఎస్ పార్టీ. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టేది బీజేపీ పార్టీ.