Home » ప్రజలు సమయమిస్తే మళ్లీ పూర్వవైభవం

ప్రజలు సమయమిస్తే మళ్లీ పూర్వవైభవం

-ఐదేళ్లు ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ
-రాజ్యాంగాన్ని విధ్వంసం చేసిన కాంగ్రెస్
-వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

విజయవాడ: రాష్ట్ర ప్రజలంతా ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తే ఖచ్చితంగా గత వైభవం వస్తుందని… అభివృద్ధికి చిరునామాగా ఏపీ నిలుస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్యకుమార్‌యాదవ్‌ అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 16 రోజులే అయిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని 20 తరాలకు కూడా సరిచేయలేనంతగా నష్టం కలిగించారని- ఆ ఫలితాలు చాలా దారుణంగా కనిపిస్తున్నాయని ఆవేదన చెందారు. రాష్ట్రం మళ్లీ గాడిలో పడుతుందని చెప్పారు.

విజయవాడ సిద్దార్ధ అకాడమీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన 1975 జూన్‌ 25 నాటి ఎమర్జన్సీ సమయంలో జరిగిన యదార్ధ సంఘటనలపై అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. అత్యవసర సమయంలో వివిధ కారణాలతో అరెస్టు అయిన వారిని ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్‌ సత్కరించారు.

అనంతరం ఆయన ప్రసంగించారు. ఏ రాష్ట్రంలో అయినా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు, రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు, ప్రజలకు తీవ్రమైన నష్టం వాటిల్లినప్పుడు వినియోగించాల్సిన ఆర్టికల్‌ 356ను దాదాపు 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ 115 సార్లు విధించి… తమకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కుప్పకూల్చిందన్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ఆర్టికల్‌ 356ని విధించలేదని… ఆ పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని అనువణువు ఒంటబట్టించుకున్న భాజపా ఆ విలువలకు కట్టుబడిందన్నారు.

అత్యసర పరిస్థితుల సమయంలో పత్రికా స్వేచ్ఛను పూర్తిగా హరించేశారని- కానీ ఈనాడు వంటి పత్రికలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాయని అన్నారు. ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు ప్రజల్ని చైతన్య పరచడంలో ఇంటి ముఖం చూడకుండా… ఒత్తిళ్లకు తలగ్గొకుండా పనిచేశారని కొనియాడారు.

చీకటి రోజులకు కారణమైన కాంగ్రెస్ రాజ్యాంగం గురించి మాట్లాడుతోందని విమర్శించారు. అత్యవసర కాలంలో ప్రజలు, ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ ఆధ్వర్యంలో దేశభక్తులు చేసిన పోరాటం రెండో స్వాతంత్ర పోరాటమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

మన రాష్ట్రంలో గత ఐదేళ్లూ అప్రకటిత ఎమర్జన్సీలాగా పాలన సాగిందన్నారు. ప్రభుత్వ నిధులు దారిమళ్లింపు వద్ద నుంచి నోరెత్తిన వారిని జైల్లో పెట్టడమే సరిపోయిందన్నారు. తన శాఖ పరిధిలోనే ఆరు వేల కోట్ల రూపాయల వరకు వైకాపా ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదన్నారు.

దేశంలో కొంత మంది కాలం చెల్లిన సిద్ధాంతాన్ని పట్టుకొని వేలాడుతున్న కమ్యూనిస్టు నాయకులు కాంగ్రెస్ మోచేతి నీళ్లు తాగే వాళ్ళు నిజం నిజం నిజం నిజం అంటూ కాంగ్రెస్ విమర్శలను సమర్ధించారంటూ సత్యకుమార్ విమర్శించారు.

రాజ్యాంగాన్ని మార్చింది కాంగ్రెస్ నాయకులయితే బిజెపి పై అసత్య ప్రచారం చేశారు. అత్యంత చీకటి రోజు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న వాళ్లంతా అధికారం చేతిలో ఉంటే అణిచివేయడం ఎంత కాలం ఒక క్షణం పట్టదు అని చెప్పి పాఠం నేర్పిన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర పోరాటంగా పరిగణించబడ్డ కాలంలో ఎమర్జెన్సీ కాలంలో ప్రజలు చేసిన పోరాటం ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ ఆధ్వర్యంలో దేశభక్తులు లో కలిసి చేసిన పోరాటం రెండో స్వాతంత్ర పోరాటమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

లేదంటే చరిత్రలో లిఖించదగ్గ ఆ కాలం గురించి మనం మననం చేసుకోవాలి ఆ సందర్భం గురించి ఆ సమయం గురించి ఆ తర్వాత జరిగిన అరాచకాల గురించి ఏ రకంగా ప్రజల శ్రేష్టమైన పౌర హక్కులను కాలరాచారు జయప్రకాష్ నారాయణ లాంటి వారిని అరెస్టు చేశారు.ఆర్గనైజర్ ఎడిటర్ కెఆర్ మాల్కానీ అరెస్టు, ఇండియన్ ఎక్స్ ప్రెస్ అదినేత రామ్ నాద్ గోయాంకా లాంటి వారిని అరెస్టు చేశారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లో ప్రియాంబుల్ ను మార్చి వేసిన ఘనత కాంగ్రెస్ ది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్అనేక సార్లు మార్చి వేసింది. ఈ విధంగా ఆనాటి పరిస్థితిలను వివరించారు మంత్రి సత్యకుమార్ మన రాష్ట్రంలో గత అయిదు సంవత్సరాలు అప్రకటిత ఎమర్జన్సీలాగా సాగింది.

ప్రభుత్వ నిధులు దారిమళ్లింపు దగ్గర నుండి నోరెత్తిన వారిని జైల్లో పెట్టడమే సరిపోయింది పాలన గాడిలో పెట్టడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కొంత సమయం ఇవ్వాలన్నారు. విశ్వనాయకుడు నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ల ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.

సిద్దార్థ్ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణ రావు, ఆర్ ఎస్ ఎస్ నాయకులు కోనేరు దుర్గా ప్రసాద్, అడ్డూరి శ్రీ రాం తదితరులు ప్రసంగించారు. బిజెపి సీనియర్ నేత కిలారు దిలీప్ సదస్సు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Leave a Reply