Suryaa.co.in

Telangana

పీవీ చనిపోతే ఢిల్లీలో ఆయన అంత్యక్రియలు ఎందుకు నిర్వహించలేదు?

-ఇక్కడ చేసిన అంత్యక్రియలకు ఎందుకు రాలేదు?
– భౌతిక కాయాన్ని పార్టీ ప్రధాన కార్యాలయం లోనికి రానీయకుండా ఆపింది గాంధీ కుటుంబం కాదా?
– ఒక మెమోరియల్ ఘాట్ నిర్మించలేదు ?
– పీవీ కీర్తి, ప్రతిష్టలను, గుర్తించి గౌరవించింది కేసీఆర్ మాత్రమే
– నెక్లెస్ రోడ్డు లో పీవీ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం
– హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

ప్రియాంక గాంధీ మాజీ ప్రధాని పీ వీ పై చేసిన మాటలపై నవ్వాలో లేక బాధ పడాలో తెలవకుండా పోతుంది. హిపోక్రసీ గాంధీ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య. మనసులో విషమున్న మీదకు అమృతం కక్కుతున్నట్టు చెప్పుకుంటూనే వస్తున్నారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ కు పివి గుర్తొచ్చారు. పీవీ ను బతికుండగా నే కాదు. చనిపోయిన తరవాత కూడా అవమానించిన కుటుంబం గాంధీ దే అని ప్రపంచానికి అంతా తెలుసు. ఓట్ల ప్రియాంక పీవీ గురించి ఇపుడు చిలక పలుకులు పలికితే నమ్మడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కారు.

రాజీవ్ మరణం తర్వాత పీవీ తమను కాపాడారని ప్రియాంక ఇపుడు అంటున్నారు. మరి పీవీ చనిపోతే ఢిల్లీ లో ఆయన అంత్యక్రియలు ఎందుకు నిర్వహించలేదు? ఇక్కడ చేసిన అంత్యక్రియలకు ఎందుకు రాలేదు? ప్రధానమంత్రి అయి ఉండిని కాంగ్రెస్ అధ్యక్షులు గా 6 సంవత్సరాలు పూర్తి చేసిన ఆయన భౌతిక కాయాన్ని పార్టీ ప్రధాన కార్యాలయం లో నికి రానీయకుండా ఆపింది గాంధీ కుటుంబం కాదా? ఇది ఇంతవరకు ఏ నాయకు డికైనా, ప్రధానమంత్రి కైనా జరిగిందా ? దానిని మర్చిపోయి నేడు ప్రియాంక పీ వీ గారు గాంధీ కుటుంబానికి ఇచ్చిన దైర్యాన్నే జ్ఞాపకముంచుకోమంటున్నారు.

పీ వీ మరణిస్తే ఆమె కుటుంబం నుంచి ఒక సభ్యుడైన అంత్యక్రియలకు వచ్చారా? ఎందుకు రాలేదు. ప్రధాని నరసింహ రావు కి జరిగిన అన్యాయం , అవహేళన ,అవమానాలు ఇంత అంతా కాదు అవి అన్నీ ప్రియాంక కు తెలియకపోవడం నిజంగా దురదృష్టకరం.నరసింహ రావు తన జీవితాంతం కాంగ్రెస్ కి సేవ చేసిన మనిషి. కానీ ఆయనను ,పార్టీ చాలా అవమాన పరిచింది . 1996 లో పార్టీ టికెట్ కూడా ఆయనకి దొరకలేదు.

పీ వీ రాజ్యమని ఎందుకు చెప్పుకోవడం లేదు? గత రెండు సంవత్సరాలు క్రితం ఆయన CENTUNARY సందర్భంగా వారి గొప్పతనాన్ని మేము చెప్పుకోగలిగాము. అందరూ ప్రధానులకు ఉన్నట్లుగా పీ వీ కు ఒక మెమోరియల్ గాని ఘాట్ గాని నిర్మించలేదు. చివరికి ఆయన పేరిట ఒక విగ్రహం గాని , పార్లమెంటు లో ఒక ఫోటో గాని లేదు .ఆ విషయం లో మా నాన్న చేసిన అభ్యర్ధనలు అన్నీ బుట్ట దాఖలు అయ్యాయి. ఆయనకు భారత రత్న ఎందుకు ఇవ్వలేదు?

పీవీ నరసింహా రావు కీర్తి, ప్రతిష్టలను గుర్తించి గౌరవించింది కేసీఆర్ మాత్రమే. నెక్లెస్ రోడ్డు లో పీవీ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. పీవీ నరసింహా రావు కు భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదింప చేసారు సీఎం కేసీఆర్ అందుకే ఈ కపట మాటలను మరిచి, ఆయన గొప్పతనాన్ని ప్రియాంక గాని ఆయన తల్లి గాని గుర్తుంచుకుంటే నేను చాలా సంతోషిస్తాను.

LEAVE A RESPONSE