– అసలైన శకుని పొంగులేటి
– పాలేరు లో తుమ్మల ను వెన్నుపోటు పొడిచి ఓడించింది పొంగులేటి కాదా ?
– కల్లూరు లో డొక్కు స్కూటర్ మీద తిరిగే పొంగులేటి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలి
– పొంగులేటి మీద ఈడీ కేసు ఏమైంది?
– కొడుకు వాచ్ స్మగ్లింగ్ కేసు ఏమైంది?
దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలి
-మంత్రి పొంగులేటికి బీఆర్ఎస్ నాయకులు గట్టు రాంచందర్రావు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్ సవాల్
హైదరాబాద్: మంత్రి పొంగులేటి బీ ఆర్ ఎస్ లో ఉన్నపుడు గంటల తరబడి కేసీఆర్ ,కే టీ ఆర్ నివాసాల వద్ద వేచి ఉండేవారు. స్మశాన వాటికలో దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి పొంగులేటి కేసీఆర్ ,కే టీ ఆర్ ,హరీష్ రావు లపై మాట్లాడిన మాటలు. అసలైన శకుని పొంగులేటి. పాలేరు లో తుమ్మల ను వెన్నుపోటు పొడిచి ఓడించింది పొంగులేటి కాదా ? పార్టీ లో ఉండి పార్టీ వ్యక్తిని ఓడించిన నీవు శకుని వి కాదా ?
రాఘవ కన్స్ట్రక్షన్ నీది కాదంటూనే బీ ఆర్ ఎస్ కు రాఘవ తరపున చందా ఎలా ఇస్తావ్ ? ఖమ్మం జిల్లా వారందరికీ పొంగులేటి చరిత్ర తెలుసు. ఖమ్మం జిల్లా పేరు చెడగొడుతున్నాడు. కల్లూరు లో డొక్కు స్కూటర్ మీద తిరిగే పొంగులేటి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయో ముందు చెప్పాలి. ఇంటికో గడియారం ఇచ్చి ఓట్లు కొల్లగొట్టారు. ఇపుడు కోట్లు కొల్లగొడుతున్నారు. పొంగులేటి మీద ఈడీ కేసు ఏమైంది? కొడుకు వాచ్ స్మగ్లింగ్ కేసు ఏమైంది?
కోట్ల రూపాయలు ఉంటే ఏమైనా చేసుకోవచ్చా?
భూ దోపిడీ పై మా నేత హరీష్ రావు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ధరణి పోర్టల్ పేరు భూ భారతి గా మార్చరే తప్ప కొత్తగా ఏం సాధించావ్ పొంగులేటి? పొంగులేటి కేసీఆర్ కాళ్ళ మీద పడ్డాడు.నేనే ప్రత్యక్ష సాక్షిని ప్రభుత్వం మారితే మొదట జైలుకు పోయేది రేవంత్ ..తర్వాత పొంగులేటి యే. ఆర్థిక ఆరాచకవాదులుగా మారి రేవంత్ ,పొంగులేటి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.
కూల్చుడు, కాల్చుడు ప్రభుత్వ విధానమైంది. న్యాయమూర్తులు తమ కుటుంబసభ్యులు, తెలిసిన వాళ్ళ కేసులను వేరే బెంచ్ లకు బదిలీ చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన పొంగులేటి రెవెన్యూ మంత్రిగా ఎలా ఉంటారు . తక్షణమే రాజీనామా చేయాలి.హౌసింగ్ మంత్రిగా కూడా పొంగులేటి విఫలం అయ్యారు.
అసెంబ్లీ సాక్షిగా పొంగులేటి ఇందిరమ్మ ఇండ్ల పై అబద్దాలు మాట్లాడారు. పొంగులేటి తన అహంకారాన్ని తగ్గించుకుని మాట్లాడితే ఆయనకే మంచిది. హైడ్రా పేదల పాలిట దయ్యం లా మారింది. పొంగులేటి పాత్ర ఉన్న భూముల వైఫు హైడ్రా ఎందుకు చూడటం లేదు?
పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ బీ ఆర్ ఎస్ పై మా వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ ఆర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. మహేష్ గౌడ్ కళ్ళు నెత్తికెక్కినట్టు మాట్లాడుతున్నాడు. ఒక్క సారి కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన బీ ఆర్ ఎస్ పని అయిపోతుందా ? ఎన్నో సార్లు బీ ఆర్ ఎస్ గెలిచిందనే విషయం మహేష్ గౌడ్ తెలుసుకోవాలి. రాహుల్ గాంధీ ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను గెలిపించలేక పోయారు. ఆయన పని అయిపోయినట్టేనని మహేష్ గౌడ్ ఒప్పుకుంటారా ?
బీ ఆర్ ఎస్ పని అయిపోయిందని మహేష్ గౌడ్ కు నమ్మకముంటే, అసెంబ్లీ ని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని రేవంత్ కు చెప్పాలి. జీవన్ రెడ్డి బయటకు రావడం తో కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యల గురించి మహేష్ గౌడ్ ముందుగా మాట్లాడాలి.
అందరూ వాస్తవాలను ఇపుడిపుడే గ్రహిస్తున్నారు. దానం నాగేందర్ లాంటి వారు కూడా జీవన్ రెడ్డి పార్టీ మారడం ఫై స్పందించడం హాస్యాస్పదం. దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలి. కే టీ ఆర్, హరీష్ రావు లు ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారనే విషయం మహేష్ గౌడ్ తెలుసుకుని మాట్లాడితే మంచిది. సింగరేణి లో అవకతవకలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని మేము ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నాం. మహేష్ గౌడ్ మా మీద విమర్శలు మాని ఆ విచారణ జరిపించాలి.