Suryaa.co.in

Entertainment Telangana

రాజాసింగ్ ను విడుదల చేయకపోతే హైద్రాబాద్ ను ముట్టడిస్తాం

అఖిల భారత శ్రీరామ్ సేన జాతీయ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్

రాజాసింగ్ ఎమ్మెల్యే ను కలవడానికి జైల్ కి వెళ్తే అనుమతించలేదు…దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజాసింగ్ ఏమైనా టెర్రరిస్టా…ఏంటి అసలు ఎందుకు కలవ నీయరా? ? కర్ణాటక నుంచి రాజాసింగ్ ను కలవడానికి వస్తే …ములాకత్ కు అనుమతించరా? తెలంగాణ గవర్నమెంట్ ఒక ఎమ్మెల్యే రాజసింగ్ పై అక్రమ పిడియాక్ట్ పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం .

రాజాసింగ్ కు జైల్ లో ఎలాంటి సౌకర్యాలు లేవు. రాజాసింగ్ కు ఏమి జరిగినా ప్రభుత్వం కేసీఆర్ బాధ్యుడు ఒక హిందు ఎమ్మెల్యే పై ఇలాంటి అక్రమ కేసులు పెట్టి జైల్ కు తరలించడం పై, భారత దేశ హిందువులందరిని ఏకం చేస్తాం. రాజాసింగ్ పై పెట్టిన కేసులు ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే..లక్షలాది మందితో హైద్రాబాద్ ను ముట్టడిస్తాం…అందులో ఎలాంటి సంఘటనలు జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఒక ముస్లిం మునవర్ ఫారూఖ్ అలీ హిందువు దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఎలా ఉరుకుంటాం? హిందువు దేవుళ్లను కించపరిచిన మునవర్ ఫారుకీ షోకు ప్రభుత్వం ఎలా అనుమతించింది?

LEAVE A RESPONSE