– పూటకో వేషం కడుతూ, రోజుకో మాట
– టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి
హైదరాబాద్: పీసీ గోష్ కమిషన్ను యధాతధంగా ప్రజల ముందు పెట్టకుండా, తమకు అణువుగా మార్చుకున్నామని ప్రభుత్వమే మంత్రివర్గం మొత్తం కూర్చుని ప్రజలకు వివరించడం హాస్యాస్పదంగా ఉంది. పిసి గోస్ కమిషన్ ఇచ్చిన 655 పేజీల రిపోర్ట్ ను నలుగురు తనకు నచ్చిన అధికారులను పెట్టి 65 పేజీలకు కుదించారు అంటే అందులో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ కవిత్వం ఎలా ఉంటుందో తెలంగాణ ప్రజలు చూడకుండా కూడా అంచనా వేయగలరు.
చంద్రశేఖర్ రావు అనే పేరు రాకుండా రేవంత్ రెడ్డి మాట్లాడలేడు. తన మాటలకు ప్రాచుర్యం రావాలంటే కేసీఆర్ ను తిట్టడం, బూతులు మాట్లాడటం తప్ప వేరే మార్గం లేదని నిశ్చయించుకున్నట్టున్నాడు. ఒకవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కాళేశ్వరం నీళ్లను విడుదల చేస్తూనే మరోవైపు కాళేశ్వరం పై విషం చిమ్మడం చూస్తుంటే, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం లెక్కనే కనిపిస్తుంది.
కాళేశ్వరం కూలిపోయింది. అని రేవంత్ రెడ్డి అనటం చూస్తుంటే ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజం చెయ్యాలని పన్నిన తన కుటిల నీతి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ లెక్కన చూస్తే కాళేశ్వరం కూలిపోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారికంగా బాంబులు పెట్టీ ప్రాజెక్ట్ ను పేల్చేలా ఉంది.
తెలంగాణ ద్రోహుల చేతిలో అధికారం ఉంటే తెలంగాణ ఎలా సర్వనాశనం అవుతుంధో చెప్పడానికి భవిష్యత్ తరాలకు రేవంత్ రెడ్డి ఒక కే స్టడీ అవుతాడు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కాయకొరుకుడు ముచ్చట్లు కాకుండా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయాలి.
రెండేళ్లయినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న చిల్లర డ్రామా ఇది. కాళేశ్వరం నిండుకుండలా హైదరాబాదుకు త్రాగునీరు అందిస్తూ… తెలంగాణ పంట పొలాలకు సాగునీరు అందిస్తుంటే.. మరోవైపు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరం కూలిపోయింది. అనటం వారి అజ్ఞానానికి అద్దం పడుతుంది.
కమిషన్ ముందు ఎదుట హాజరవ్వటమే నేరాన్ని అంగీకరించడం అవుతుందని ముఖ్యమంత్రి స్థానంలో ఉండే కనీస అవగాహన లేకుండా మాట్లాడటం తెలంగాణ ప్రజల పరువు తీస్తుంది. 16 నెలలు కాలయాపన చేసి 20 నెలలో ప్రెస్ మీట్ నిర్వహించి ఐదు ఏళ్ల తర్వాత ఎన్నికల ముందు కుప్పిగంతులు వేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినట్టుంది.
విచారణ పూర్తికాకముందుకే కమిటీ ఇచ్చిన నివేదిక సారాంశం తెలియక ముందే కాళేశ్వరం కూలిపోయిందని, కాళేశ్వరం కూలేశ్వరం అయ్యిందని కామెంట్లు చేసిన వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టి న్యాయం చెప్పమంటే తీర్పు ఏమొస్తుందో సమాజానికి తెలియనిది కాదు.ఆరోపణలు చేసిన వ్యక్తికే తీర్పు చెప్పే అవకాశం వచ్చింది అన్నమాట.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కొనే దమ్ములేక, ఇచ్చిన హామీల పై ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక పూటకో వేషం కడుతూ, రోజుకో మాట మారుస్తూ రాజకీయ ప్రకటనలతో కాల వెళ్లదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో 3 ఏళ్లలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లోలాగే భూస్థాపితం అవ్వడం ఖాయం.
తెలంగాణ కు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే తెలంగాణలో మొదటి చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డ్ కొడతారు. రేపే BRS పార్టీ అధ్వర్యంలో, తెలంగాణ మాజీ భారినీటి పారుదల శాఖామంత్రి, పెద్దలు తన్నీరు హరీష్ రావు నేతృత్వంలో రేపే మీరు కాళేశ్వరం పై చిమ్ముతున్న విషానికి మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో విరుగుడు చూపిస్తాం.