– ఆ దిశగా ఎందుకు అడుగులు వేయడం లేదు?
– ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తీసుకురావడం లేదు?
– విభజన హామీల గురించి కూటమి ఎందుకు మౌనంగా ఉంది?
– ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చకుండా అమరావతి జపం చేయడం సరికాదు.
– శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం: అమరావతిపై కూటమి ప్రభుత్వానిది కేవలం ప్రచార ఆర్భాటమే. ప్రత్యేక హోదా తెస్తే పది అమరావతులు వస్తాయి.ఆ దిశగా ఎందుకు అడుగులు వేయడం లేదు? రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక రైతులు, ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు అల్లాడుతున్నారు. ప్రజల సమస్యల కంటే చంద్రబాబుకు కాంక్రీట్ పనులపైనే తాపత్రయం ఎక్కువ. రాష్ట్రంలో అనేక సమస్యలున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
గిట్టుబాటు ధర లేక రైతులు, ఫీజు రీయింబర్స్మెంట్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమరావతిలో కాంక్రీట్ వేశామని అనిపించుకోవడానికే చంద్రబాబు ఆరాటపడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలను మీడియా పట్టించుకోకపోవడం దారుణం. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది.
అమరావతిని కేవలం తీర్మానాలతో పర్మినెంట్ అనుకుంటే పొరపాటే. నిర్మాణాలు పూర్తి చేయాలి. రాష్ట్ర విభజన హామీల గురించి కూటమి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ప్రత్యేక హోదా వస్తే ముంబై వంటి నగరాలు, పది అమరావతులు రాష్ట్రానికి వస్తాయి. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తీసుకురావడం లేదు? మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్లను కూడా ఈ రెండేళ్లలో పూర్తి చేయలేకపోయారు. కనీసం కరకట్ట రోడ్డు కూడా వేయలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది.
రెండేళ్ల కాలంలో క్లాస్ ఫోర్ ఉద్యోగులకు ఇళ్లు ఎందుకు పూర్తి చేయలేదు? అమరావతి ఎప్పటికి పూర్తవుతుందో చెప్పడానికి ప్రభుత్వానికి టైమ్ బాండ్ లేదు. గతంలో 2014-19 మధ్య చంద్రబాబు కేవలం 5 శాతం పనులే చేశారు. ఈ రెండేళ్లలో అమరావతిపై ఎంత ఖర్చు చేశారు? ఎంత పని చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి.
అమరావతి నిర్మాణంలో చదరపు అడుగుకు (SFT) 14 వేల రూపాయల ఖర్చుపై అనుమానాలు వస్తున్నాయి.గిరి గీసుకుని అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తామంటే కుదరదు. వైయస్సార్సీపీ ప్రభుత్వంలో అమరావతి రైతులకు కౌలు డబ్బులు ఒక్క రోజు కూడా ఆగలేదు. అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం అదనంగా చేసిన మేలు ఏంటో చెప్పాలి. అమరావతిలో గతంలో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ ఏమైంది?
వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై బిల్లు పెట్టించాలి. ప్రత్యేక హోదా బిల్లు పెట్టి హోదా సాధిస్తే చంద్రబాబును మేమే మెచ్చుకుంటాం. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చకుండా అమరావతి జపం చేయడం సరికాదు.