– పెందుర్తి టిడిపి ఇన్చార్జ్ గండి బాబ్జి
పరవాడ: మా ప్రభుత్వంలో పని చేస్తూ మా నాయకులు కార్యకర్తలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల విషయాలు తెలియజేయరా అంటూ ఎంపీడీవో పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ ఏపీ ఆయిల్ ఫైడ్ చైర్మన్ గండి బాబ్జీ పరవాడలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ప్రజా పరిష్కార వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండి బాబ్జి మాట్లాడుతూ ..పరవాడ మండలంలో ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు అధికారులు తెలియజేయాలని వీటి విషయంలో నిర్లక్ష్యం వహించే ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
పరవాడ మండలంలో తెలుగుదేశం పార్టీ ఉందని అధికారులు గుర్తుతెరిగి పనిచేయాలని అన్నారు. గ్రామాల్లో సర్పంచ్ ల తో పాటు తమ నాయకులు కార్యకర్తలకు ప్రత్యేక గౌరవాన్ని అధికారులు ఇచ్చి తీరాల్సిందేనని అన్నారు. అనంతరం పలువురు నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి అధికారులను వాటిని పరిష్కరించాలని కోరారు. తాసిల్దార్ నాగరాజు ఎంపీడీవో రమేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జడ్పిటిసి పైలా జగన్నాథరావు ,అనకాపల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కన్నూరు వెంకటరమణ, మండల పార్టీ అధ్యక్షులు వియ్యపు చిన్న, పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.