Suryaa.co.in

Andhra Pradesh

ఆడవారి జోలికొస్తే వళ్లు పగిలిపోద్ది

– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు

మహిళల్లో చైతన్యాన్ని పురిగొల్పుతున్న వంగలపూడి అనిత గురించి మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావ్ అసభ్యకరంగా మాట్లాడం సిగ్గుమాలిన చర్య. ఆడపులిలాంటి అనితను చూసి చెంగల వెంకట్రావ్ చాలా నేర్చుకోవాలి. చెంగల్ రావు తల్లిదండ్రులు కూడా అసహ్హించుకునేలా మాట్లాడావు. దళితుడినని చెప్పుకుంటూ దళిత బిడ్డ గురించి అసభ్యకరంగా మాట్లాడడమా?. టీడీపీ బిక్షతో ఎమ్మెల్యేవయ్యావనే విషయం చెంగల వెంకట్రావ్ మరవకూడదు.

టీడీపీ బిక్షతో పైకొచ్చి టీడీపీవారినే విమర్శించడమా? మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావ్ దళిత కమ్యుూనిటీలో పుట్టానని చెప్పుకోవడం సిగ్గుచేటు. మహిళల తాళిబొట్లు తెగుతుంటే వారికి అండగా ఉండి పోరాటం చేయటం అనిత చేసిన తప్పా? జగన్ తో పాటు జైల్లో ఉండి జగన్ తో పాటు బయటికొచ్చి క్రిమినల్ మైండ్ తో మాట్లాడుతున్నట్లున్నావు. అనిత అవినీతి చేసిందని ఆరోపించడంలో అర్థంలేదు. ఎప్పుడో అవినీతి జరిగిందని ఇప్పుడు చెబుతున్నారు, ఇన్నాళ్లు గుడ్డిగుర్రానికి పళ్ళుతోముతున్నారా?. సొంత తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రి పదవిపై కన్నువేసిన జగనే నీచేత వల్లిస్తున్నాడని అర్థమౌతోంది. తండ్రి చావుపై రిలయన్స్ పై జగన్ కు అనుమానమున్నప్పుడు వారు సూచించిన వ్యక్తికి రాజ్యసభ సీటు ఎందుకిచ్చారు?

వంగలపూడి అనిత చేసిన తప్పేంటి? అవినీతిపరుడైన ముఖ్యమంత్రిపై పోరాటం చేస్తున్న అనిత గురించి నీచంగా మాట్లాడితే మహిళలు ఊరుకోరు. సినిమా పరిశ్రమలో ఉన్నప్పుడు చేయరాని పనులెన్నో చేశావు. చిన్న పిల్లలచే వ్యభిచారం చేయించిన చరిత్ర నీది. సంసారపక్షంగా, పద్ధతిగా బతుకుతున్నవారిపై దుమ్మెత్తిపోస్తావా?. గతంలో తూర్పు గోదావరి జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో బీఎంసీ కంపెనీకి సంబంధించిన అల్లర్లకు కారకుడివి. గోపాల కొండయ్య అనే వ్యక్తి హత్యకు కారకుడవు. 50మందిని అనవసరంగా కేసుల్లో ఇరికించావు. డిస్టిబ్యూటర్లకు డబ్బులు ఎగ్గొట్టిన ఘనుడివి. అనేక చెక్ బౌన్స్ కేసులు నీమీద ఉన్నాయి.

పౌరుషం, ఆత్మ గౌరవం లేని వ్యక్తివి నీవు. బూతుల మాజీ మంత్రి కొడాలి నానీ ఇలాకాలో మినీ మహానాడు పెడుతున్నాం. ధైర్యం ఉంటే అక్కడికి వచ్చి మాట్లాడాలి. చంద్రబాబునాయుడు, లోకేష్ బాబు లను విమర్శించే అర్హత నీకు లేదు. 12 గంటల్లో ప్రెస్ మీట్ పెడితే ఏదో చేస్తానన్నావు నీవు చెప్పినట్లుగానే ప్రెస్ మీట్ పెట్టాము. దమ్ముంటే రావాలి. నేను ఎక్కడికైనా రావడానికైనా సిద్ధమే. దళితుల గురించి, దళితుల ఆర్థిక స్థితిగతుల గురించి, మహిళల గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, టీడీపీ క్రమశిక్షణ గురించి దేని గురించైనా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను.

అడవారి జోలికి వస్తే ఖబడ్దార్.. చెంగల వెంకట్రావ్ ను తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. చంగల్ రావు తన క్రిమినల్ మైండ్ ని మార్చుకోవాలి. చంద్రబాబు, లోకేష్ బాబు, వంగలపూడి అనిత, టీడీపీ పై అవాకులు, చవాకులు పేల్చడం మానాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు సూచించారు.

 

LEAVE A RESPONSE