– కల్తీ కల్లు నివారణ పేరిట లిక్కర్ మాఫియా
– హైదరాబాద్ నుంచి కల్లు దుకాణాలు తరలించి చూడండి .బీసీ కులాల సత్తా ఏమిటో చూపిస్తాం
– మాజీ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్
హైదరాబాద్: మద్యం మీద వచ్చే ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఎక్సైజ్ పాలసీ గడువు నవంబర్ దాకా ఉండగా, ఇపుడే కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దరఖాస్తు ధరను రెండు లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయలకు పెంచుతున్నారు.
బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని అడుగడుగునా మద్యం షాపులు తెరవాలని ప్రణాళిక వేస్తున్నారు. మద్యం మాఫియా ను పెంచిపోషించి కల్లు దుకాణాలను మూసి వేసే కుట్ర చేస్తున్నారు. కల్తీ కల్లు నివారణ పేరిట లిక్కర్ మాఫియా ను ప్రోత్సహిస్తున్నారు. కల్తీ మద్యాన్ని ఈ ప్రభుత్వం అరికట్టడం లేదు.
ఖజానా నింపుకోవడానికి గ్రామ గ్రామాన మద్యం దుకాణాలు తెరుస్తున్నారు. మద్యం టెట్రా ప్యాక్ లు తెస్తూ మద్యాన్ని ఏరులై పారేలా చేస్తున్నారు. కల్తీ కల్లు పేరిట గౌడ సోదరులను ఈ ప్రభుత్వం పెంచి పోషిస్తోంది. సిగాచీ లో ప్రమాదం జరిగి 54 మంది మరణిస్తే ఆ యాజమాన్యం పై చర్యలు లేవు అరెస్టులు లేవు.
రెండు షాపుల్లో కల్తీ కల్లు ఘటనలు జరిగిందనే పేరు తో మొత్తం కల్లు దుకాణాలపై దాడులు చేసి భయభ్రాంతులు చేస్తున్నారు. ఊరు పేరు లేని మద్యం కంపెనీల నుంచి మద్యాన్ని కొనుగోలు చేసేలా కొత్త ఎక్సైజ్ పాలసి రూపొందిస్తున్నారు. మద్యం షాపుల లైసెన్స్ ల గడువును రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలకు పెంచే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.
మద్యం ఆదాయం పెంచుకునేందుకు అక్రమ మార్గాలకు ప్రభుత్వమే పూనుకోవడం దుర్మార్గం. కల్లు దుకాణాలను మూసి వేసే కుట్రను అడ్డుకుని తీరుతాం. కేసీఆర్ హాయం లో ఈత తాటి వనాలను పెంచాం .వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం సొసైటీ లకు కేటాయించడం లేదు. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా కూడా చెల్లించడం లేదు.హైదరాబాద్ నుంచి కల్లు దుకాణాలు తరలించి చూడండి .బీసీ కులాల సత్తా ఏమిటో చూపిస్తాం. మమ్మల్ని తక్కువగా అంచనా వేయొద్దు .అన్నిటికి తెగించి కొట్లాడుతాము.
కల్తీ కల్లు దోషులెవరో తేలక ముందే కల్లు దుకాణ దారులను ఎక్సైజ్ అధికారులు వేధిస్తున్నారు. రెస్టారెంట్లలో ,నూనె కర్మాగారాల్లో కల్తీ జరుగుతోంది .వాటి పై దాడులు జరుగుతున్నాయా ? గౌడ కుటంబాలను వేధిస్తే అందరం రోడ్లపైకి వస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం కల్లు దుకాణాల పై వేధింపు చర్యలు ఆపాలి.