Suryaa.co.in

National

ఇండియా కూటమి వస్తే.. మోదీ అవినీతి పాఠశాలకు లాక్

– రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని అన్నారు..భాజపా నేతలకు అవినీతి పాఠాలను ఆయన చక్కగా బోధిస్తున్నారని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదిక వ్యాఖ్యానించారు.

”దేశంలో అవినీతి పాఠశాలను ప్రధాని మోదీ నడుపు తున్నారు. ఈ స్కూల్‌ లో ‘డొనేషన్‌ బిజినెస్‌’ అనే కోర్స్‌ లోని ప్రతీ అధ్యాయాన్ని స్వయంగా ఆయనే బోధిస్తున్నారు. దానాన్ని కూడా వ్యాపారంగా ఎలా మార్చాలో మోదీ వివరిస్తారు. సోదాలు నిర్వహించి విరాళాలు ఎలా సేకరించాలి..? విరాళాలు తీసుకున్న అనంతరం ఒప్పందాల పంపిణీ ఎలా చేయాలి..? అనే అంశాలను వివరిస్తారు” అని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

అయితే, కాషాయ పార్టీ లోని ప్రతి నేతకూ ఈ కోర్సును తప్పనిసరి చేసిందన్నారు.అవినీతి పరుల నేర మరకలను వాషింగ్‌ మెషీన్‌లా కడిగేస్తోదంటూ భాజపాను ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు.ఏజెన్సీ లను రికవరీ ఏజెంట్లుగా మార్చి ‘బెయిల్‌’, ‘జైలు’ అనే గేమ్‌ను ఎలా ఆడాలో వివరించగలదన్నారు. అవినీతికి భాజపా నిలయంగా మారిందని విమర్శించారు.

ఒక వేళ సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారం లోకి వస్తే మోదీ నడుపుతున్న అవినీతి పాఠశాలతో పాటు ఈ కోర్సును పూర్తిగా మూసి వేస్తుందని అన్నారు

LEAVE A RESPONSE