Suryaa.co.in

Andhra Pradesh

బూతుల మంత్రిని ఆరోజే కట్టడిచేసి ఉంటే, థాయ్ లాండ్ లో తెలుగువారు జైలుపాలు అయ్యేవాళ్లు కాదు

– గుడివాడలో కేసినో జరిగిన నాడే ముఖ్యమంత్రి చర్యలు తీసుకొని ఉంటే, నేడు వందలాది మంది తెలుగువారు థాయ్ లాండ్ జైల్లో మగ్గేవారుకాదు
• ముఖ్యమంత్రి అవినీతి, అసమర్థత, చేతగానితనంవలనే నేడు వందలాది మందిన తెలుగువారు వేరేదేశం జైల్లో మ్రగ్గుతున్నారు
• ముఖ్యమంత్రి కేసినో నడిపిన బూతులమంత్రిని ఆరోజే కట్టడిచేసి ఉంటే, థాయ్ లాండ్ లో తెలుగువారు జైలుపాలు అయ్యేవాళ్లు కాదు
• తెలుగుదేశం ఫిర్యాదు చేసినప్పుడే ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటే, ఎన్నోకుటుంబాలు రోడ్డునపడేవి కాదు. ఆర్థికంగా చితికిపోయేవి అసలేకాదు
• కేసినో నడిపే చికోటి ప్రవీణ్ బూతులమంత్రి నాస్నేహితుడు, గన్నవరం ఎమ్మెల్యే నా మిత్రుడు అన్నప్పుడే ముగ్గురిపై చర్య తీసుకుంటే, ముఖ్యమంత్రికి ఈ అపవాదు తప్పేది
• ఈ రోజు వాళ్లు జైల్లో ఉండటానికి బాధ్యులు, మీరు, మీప్రభుత్వం, మీ బూతులమంత్రి మీ సజ్జల కాదా?
• గుడివాడ కేసినో వ్యవహారంపై, 500కోట్ల మనీలాండరింగ్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు లేఖవ్రాస్తా. అలానే అన్నిఆధారాలతో డీజీపీకి కూడా లేఖవ్రాస్తాను
– పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

“తనబిడ్డ తోటకూర దొంగతనంచేసిన రోజునే, ఆ తల్లిదండ్రులు అతన్ని మందలించినట్ట యితే, వాడు పెరిగిపెరిగి అంతర్జాతీయ దొంగగా మారేవాడుకాదు, అని నేనెందుకు చెబు తున్నాను అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుందని. రాష్ట్రానికి శాంతిభద్రతలు కాపాడా ల్సిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఆనాడు 2022 జనవరి 14, 15, 16న మూడురోజులు గుడివాడలోదాదాపు రూ.250 నుంచి రూ.500కోట్లవరకు మనీలాండరింగ్ జరిగింది.

చికోటిప్రవీణ్ నేత్రత్వంలో బూతులమంత్రి కొడాలి వెంకటేశ్వరరావు కేసినో పెట్టాడు, ఎంతోమంది తెలుగుమహిళల పుస్తెలుతెగి మంటల్లో కాలిపోయాయి, వేలాది ఎకరాలు కేసినో నిర్వాహకులచేతుల్లోకి పోయినయి, అక్కడే ప్రో నోట్లు, దస్తావేజుల మార్పిడి జరిగి కొన్నికుటుంబాలు సర్వనాశనమయ్యయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నా నేత్రత్వంలో నిజనిర్ధారణ కమిటీ వేశారు. ఆ కమిటీ గుడివాడ వెళ్తే గుడివాడ రానివ్వరా మమ్మల్ని.

నిజంగానే ముఖ్యమంత్రి, మీకు అవినీతిపరులు నిరోధించాలన్న ఆలోచన మీకుంటే, తప్పుడుపనులు నిరోధించాలన్న ఆలోచన మీకుఉన్నట్టయితే, ఇంతమంది తెలుగుమహిళ ల పుస్తెలుతెగి, మంటల్లోకాలిపోతే వేలాదిఎకరాలు ఆనిర్వాహకులు, బూతులమంత్రి ఖాతా లోకి వెళితే, మీరు ఆరోజున నిజనిర్ధారణకమిటీని అడ్డుకునే వారు కాదుకదా? పైగా మీరు మీ పోలీస్ యంత్రాంగం, అధికారయంత్రాంగం అక్కడేం జరగలేదని అబద్ధాలు వల్లెవేశారు.

జరిగిందని బ్రహ్మండంగా మేం వీడియోక్లిప్పింగ్స్ చూపించాం.బూతులమంత్రి ఇలాఖాలో అతని కన్వెన్షన్ సెంటర్లో జరిగిందనిచెప్పి సాక్ష్యాధారాలు ఇస్తే మాట్లాడలేదు. అక్కడిపోలీస్ అధికారులు నూజివీడు డీఎస్పీని ఎంక్వైరీ అధికారిగా వేశామన్నారు. మేంవెళ్తే మమ్మల్ని ఊర్లోకి రానివ్వలేదు.. మా కార్లన్నీ పగలగొట్టారు. మమ్మల్ని అరెస్ట్ చేశారు.. పామర్రుపోలీస్ స్టేషన్లో పెట్టారు. తోటకూర దొంగతనం జరిగిన నాడే ముఖ్యమంత్రి గారు ఆయన విధినిర్వహ ణ ఆయనచేసినట్టయితే, ఈనాడు వందమంది తెలుగువారు, మనరాష్ట్రానికి చెందినవారు థాయ్ లాండ్ జైల్లో మ్రగ్గేవారు కాదుకదా!

ఈరోజున వాళ్లందరూ జైల్లోఉన్నారు. మీరే బాధ్యు లుదానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మీనిర్లక్ష్యం వల్ల, అసమర్థత వల్ల, అవి నీతికి పాల్పడటం వల్ల, మీ మంత్రి అవినీతిని మీరుప్రోత్సహించడంవల్ల, మీమంత్రి అవినీతిని మీరుఎంకరేజ్ చేయడం వల్ల ఈరోజున వందమంది తెలుగువాళ్లు అక్కడ థాయ్ లాండ్ జైల్లో, బ్యాంకాక్ జైల్లో మగ్గుతున్నారు.

మీకు చంచల్ గూడ జైలేతెలుసు. ఆ బ్యాంకాక్ జైళ్లు తెలియవు. ఈరోజున వందకుటుంబా కు ఏంసమాధానం చెబుతారు ముఖ్యమంత్రి? మీరేకదా కారణం. మీ అసమర్థ పరి పాలన కాదా.. మీ అవినీతి ఆలోచన కాదా? మీ మంత్రి ఆబూతులమంత్రికి మీరిచ్చిన వత్తా సుకాదా? మీ సజ్జల రామకృష్ణారెడ్డికి అందులో వాటా ఉందని అందరూఅనుకోలేదా? 500 కోట్ల రూపాయల మనీలాండరింగ్ జరిగితే కిమ్మనకుండా కూర్చుంటారా మీ ప్రభుత్వ యం త్రాంగం? ఎంతసిగ్గుచేటు మంత్రిగారు?

హి బికమ్ ఏ లాఫింగ్ స్టాక్ నౌ. ఇప్పుడదే చికోటి ప్రవీ ణ్ బ్యాంకాక్ లో దొరికినాడు, పటాయా టౌన్ లో. హోటళ్లు అతనే తీసుకుంటాడట, ఇక్కడి నుంచి రెండుతెలుగురాష్ట్రాల నుంచి జనాల్ని తీసుకెళ్లి పెట్టాడు. మనవాళ్లు వందమందిపైన ఉన్నారు.కొందరు పారిపోయారంట..ఎటుపోయారో, ఎలా వచ్చారో? వారి పాస్ పోర్టులు అక్కడి పోలీస్ అధికారులవద్ద ఉన్నా యి. అసలు వాళ్లు ఎలా తిరిగొస్తారు.. ఆ కుటుంబాలేంటి? బ్యాంకాక్ నుంచి ఎలాతిరిగొస్తారు? అసలు చీమకుట్టినట్టు ఉందా? మీరు గుండెలమీద చెయ్యేసుకోండి ముఖ్యమంత్రి, గుండెలమీద చెయ్యేసుకోండి సజ్జలరామకృష్ణారెడ్డి. ఆ గుండె విలువతెలియని బూతులమంత్రిని అనను నేను. మీరు బాధ్యులు అంటున్నాను.

వందకుటుంబాలు చెల్లాచెదురు అయిపోయాయి. బ్యాంకాక్ వెళ్లి, అక్కడ కేసినో క్రీడ ఆడి, జైలుపాలైన మాఇంటిపెద్ద ఎలా తిరిగొస్తాడు అని ఆలోచనతో బాధపడుతున్నారు. దానికి మీరు ఏంసమాధానం చెబుతారు అని అడుగుతున్నాను. ఎస్పీకి చెప్పాం.. డీఐజీకి చెప్పాం.. డీఐజీ ఆరోజున దొరక్కుండా పారిపోయాడు. డీజీకి రిప్రంజటేషన్ ఇస్తామంటే దట్ వండర్ ఫుల్ డీజీ రోడ్డుమీద రిప్రంజటేషన్ తీసుకున్నారు. అంటే మీరందరూ భాగస్తులా ఇందులో?

సీఎంకి తెలుసు. అందుకని మీరు మీ విధినిర్వహణలో నిరాసక్తతగా ఉంటారా? ఈరోజు మీరందరూ ఏంసమాధానంచెబుతారు? ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ఏంసమాధానం చెబుతారు? ఆ వందకుటుంబాలు ఇప్పుడొచ్చి మీ ఆఫీసుముందు కూర్చుంటే, మా ఇంటి వాళ్లు అక్కడికెళ్లారు, వాళ్లను తీసుకురండి అంటే ఏంచెబుతారు? అసలు దానిగురించి ఏమై నా ప్రయత్నంచేస్తున్నారా మీరు ముఖ్యమంత్రిగారు? అసలు ఆలోచన ఉందా మీకు ముఖ్య మంత్రి? ఏమీకిమ్మనకుండా… నేను అడుగుతున్నా ఈరోజున ముఖ్యమంత్రిని.

నూజివీడుడీఎస్పీతో ఎంక్వైరీ వేశామన్నారు. శాసనసభలో మావాళ్లు మాట్లాడితే, నూజివీ డు డీఎస్పీ రిపోర్ట్ రానివ్వండి అన్నారు. ఆ రిపోర్ట్ వచ్చిందా లేదా ఇప్పటికి, సంవత్సరంన్న ర పైన అయ్యింది. నూజివీడు డిఎస్పీ రిపోర్ట్ గుడివాడ కేసినోపై వచ్చిందా లేదా అని అడుగు తున్నాను. అసెంబ్లీలో రిపోర్ట్ సమర్పించారా లేదా? ఆ రిపోర్ట్ బహిర్గతం చేయమని నేను డిమాండ్ చేస్తున్నా, గౌరవముఖ్యమంత్రిని. నూజివీడు డీఎస్పీ మిస్టర్ శ్రీనివాస్.. ఎవరైతే ఎం క్వైరీ ఆఫీసర్ గా కేసినో మీదచేశారో ఆరిపోర్ట్ ను మీకు, మీ ప్రభుత్వానికి ధైర్యముంటే బయ టపెట్టమని డిమాండ్ చేస్తున్నా. ఎంతమంది ఉసురు పోసుకుంటారండీ?

ఆ జైల్లో అన్నీ అక్కడే, అక్కడ దొరికినవారికి. ఈ బూతులమంత్రిని నమ్ముకొని, ముఖ్యమం త్రిని నమ్ముకొని, చికోటి ప్రవీణ్ ను నమ్ముకొని ఈరోజున అక్కడజైల్లో మగ్గుతున్నారు వాళ్లం దరూకూడా. కనీసం ఇక్కడినుంచి ఒకటీమ్ ను పంపించారా మీరు? తెలివైన అడ్వకేట్స్ తో టీమ్ ను పంపించి, కనీసం మనరాష్ట్రం వాళ్లను వెనక్కుతెప్పించే ఏర్పాటుఏమైనా చేస్తున్నా రా? మీరుకదా.. ఈరోజ వాళ్లు జైల్లో ఉండటానికి బాధ్యులు, మీ ప్రభుత్వంకదా. మీ బూతు లమంత్రి కాదా.. మీ సజ్జల కాదా? స్వయంగా మీరుకాదా? సమాధానంచెబుతారా?

ఆ రిపోర్ట్ ను ఎందుకుదాస్తున్నారు. డీఎస్పీ రిపోర్ట్? ఎంతకాలమండి? ఆరోజున ఆ ఎస్పీ వా రం రోజుల్లో ఇవ్వమన్నారు. రిపోర్ట్ ఇవ్వమని డీఎస్పీని అడిగినందుకు అతన్ని ఎన్ని ఇబ్బం దులు పెట్టారు, ట్రాన్స్ ఫర్ చేశారు. ఇదీ మీ వ్యవహారశైలి. దొంగలు దొంగలుఊళ్లు పంచుకు న్నట్టు, మీకు అనుకూలంగా, మీ దొంగతనాలకు అనుకూలంగా ఉండే పోలీసు ఆఫీసర్లు ఉం టారు. ఆ డీఎస్పీ కూడా అక్కడ నాలుగేళ్లు ఉన్నాడు గుడివాడ డీఎస్పీ. అతనికి తెలియ కుండా జరిగిందా ఇది? కేసినో జరిగిన దగ్గరనుంచి అతనే దగ్గరుండి చేయించాడు అక్కడ. అ అయినా ఏమీతెలియనట్టే ఉంటారు.

అందుకే రాష్ట్రప్రజలారా గమనించండి. ఈరోజున వందమంది మనవాళ్లు అక్కడ జైల్లో మగ్గు తున్నారు. బికాజ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్, ఈముఖ్యమంత్రి వల్ల, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల, ఈ బూతులమంత్రి వల్ల. చికోటీ ప్రవీణ్ చెప్పాడు.. వంశీ ఈజ్ మై ఫ్రెండ్ వంశీ అంటే గన్నవరం ఎమ్మెల్యే, నాని ఈజ్ మై ఫ్రెండ్. గన్నవరం ఎమ్మెల్యే వంశీ నాస్నేహితుడు. గుడి వాడ ఎమ్మెల్యే నాని నా స్నేహితుడు. ఆ స్నేహితులే కదాఇప్పుడు వందమంది కొంపముం చింది? అవును మీకు చీమకుట్టినట్టు ఉందా అని అడుగుతున్నా.. వంశీని, నానీని? వంద మంది మీ వాళ్లు థాయ్ లాండ్ జైల్లో ఉంటే, మీకు చీమకుట్టినట్టు ఉందా? ముఖ్యమంత్రి ని అడుగుతున్నా మీకు చీమకుట్టినట్టు ఉందా?

మీ తమ్ముడు గురించి మీ బాబాయ్ గురించి (అంటే జైల్లోఉన్నబాబాయ్ గురించి, చనిపోయి న బాబాయ్ కాదు) బాధపడుతున్నారు తప్పితే, ఇప్పుడు వందమంది దాకా ఉన్నారట! కనీసం ఆలిస్ట్ అయినా తెప్పించుకున్నారా? హౌ మెనీ ఫ్రమ్ అవర్ స్టేట్ హ్యావ్ బీ న్ అరెస్టెడ్ దేర్, హౌమెనీ ఆర్ ఇంప్రిజన్ డ్. అసలు ఉందా ఆ లిస్ట్ ఉందా ఈ ప్రభుత్వం దగ్గర? కనీసం ఆ కుటుంబసభ్యులకు చెప్పారా? మీ వాళ్లు బ్యాంకాక్ జైల్లో మగ్గుతున్నారని.

ఏమి ప్రభుత్వమండీ మీది? చెత్త ప్రభుత్వం కాదా ముఖ్యమంత్రి? మూడురోజుల నుంచి అక్కడ బ్యాంకాక్ జైల్లో ఉంటే, కనీసం ఆ కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వరా మీ రు? ఆకుటుంబసభ్యులకు తెలియచేయరా మీరు? మీవాళ్లు అక్కడ ఫలానాజైల్లో ఉన్నాడు, వెళ్లి చూడండి అనిచెప్పరా? మీరు ఏమి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు? బ్యాంకాక్ జైల్లో మగ్గిపోతున్న మనవాళ్లను వెనక్కుతీసుకురావడానికి ముఖ్యమంత్రి, మీరే మీ ఫోర్ట్ ఫోలియోనే అది. ఏంచర్యలు తీసుకుంటున్నారు మీరు అని ఆ జైల్లోఉన్నవారి తరుపు న, తెలుగుదేశంపార్టీ నాయకుడిగా నేను అడుగుతున్నాను. మొట్టమొదటినుంచీ ఈ కేసినోలో న్యాయంచేయండి అని తిరుగుతున్నవాడిగా నేను అడుగుతున్నాను. ఏమి సమా ధానం చెబుతారు మీరు అనికూడా నేను అడుగుతున్నా. మీ నిర్లక్ష్యంవల్ల ఈరోజున అంత మంది జైల్లో ఉన్నారు గౌరవముఖ్యమంత్రి.

అసెంబ్లీలో రిపోర్ట్ ను బయటపెట్టరు, మేం అడిగినదానికి సమాధానంచెప్పరు. ఆ డీఎస్పీ రిపోర్ట్ ఏమైందో ఎవరికీ తెలియదు. తర్వాత మన హైద్రాబాద్ లో కూడా ఇతను ఇలాగే ఒక ఫామ్ హౌస్ లో కేసినో కండెక్ట్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకిదిగింది హైదరాబాద్ లో. అప్పుడన్నా గుడివాడలో కూడా చేశారని మీరుచెప్పారా ? మీ పోలీసులు చెప్పారా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కి? మీ ప్రభుత్వం ఏమైనా లెటర్ రాసిం దా? మా గుడివాడలో చేశారు…ఎంక్వైరీ చేయండి అని లెటర్ రాయాల్సిన నైతికబాధ్యత మీకు లేదా ముఖ్యమంత్రిగారు? ఇదొక ప్రభుత్వమా? ఇది ప్రజాస్వామ్యప్రభుత్వమా?

ఎప్పుడైతే ఈ చికోటి ప్రవీణ్ అక్కడ దొరికాడో, ఎప్పుడైతే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగం లోకి దిగిందో, దిగినవెంటనే మీరు అప్పుడు వాళ్లకు లేఖరాయవద్దు, ఇక్కడకూడా జరిగింది .. దాదాపు 500కోట్ల రూపాయలు మనీలాండరింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది, ఎంక్వైరీ చేయం డి అని మీరులేఖ రాశారా? లేదు. తరువాత ఇన్ కంటాక్స్ వాళ్లుకూడా నాకు నోటీసు పంపారు. 500కోట్లరూపాయల మనీ లాండరింగ్ జరిగిందని కంప్లైంట్ చేశారు.. మీదగ్గరున్నఇన్ ఫర్మేషన్ తీసుకురండి అని గతసంవత్సరం డిసెంబర్లో మాకు లెటర్ రాస్తే, నేను సమాచారమంతా ఇచ్చాను ఇన్ కంటా క్స్ కి. ఇదేమీ అయిపోలేదు ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రి పీఠంనుంచి దిగిన త ర్వాతకూడా వెంటాడుతుంది. ఆ బూతులమంత్రి అనుకుంటున్నాడు అయిపోయిందని, అయిపోలేదు. మీ పీకకు చుట్టుకుంటుంది ఇది.

ఇంతమంది ఉసురు, ఇన్నికుటుంబాలు నాశనం అవ్వడం ఈఉసురు ఊరికేపోదు అనికూడా నేను తెలియచేస్తున్నా. అందుకే నేను ఈరోజున ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా. మీ అసమర్థతవల్లే ఈరోజున అంతమంది జైల్లోఉన్నారు. వారిని ఎలా వెనక్కు తీసుకువస్తున్నారో రాష్ట్రప్రజలకు తెలియచేయండి అని కూడా తెలియచేస్తున్నా. ఇప్పటికైనా డీఎస్పీ రిపోర్ట్ బయటపెట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోండి, ఇప్పటికైనా మించిపోయిందిలేదు, బూతులమంత్రిని లోపలేయండి. బూతుల మంత్రిని అరెస్ట్ చేయండి. అతనే దీనికి బాధ్యుడు. ఎవరైతే ఈకేసినో నిర్వహణ వెనకున్నారో వాళ్లందరినీ అరెస్ట్ చేయండి. ఇప్పటికైనా మించిపోయిందిలేదు.

కనీసం ఇప్పటికైనా ముఖ్య మంత్రి కళ్లుతెరిచారు అనుకుంటారు. అరెస్ట్ చేయండి, 500కోట్ల రూపాయల మనీలాండరింగ్ గురించి మీరు రాయండి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కి. ఎంక్వైరీ చేయమని, అప్పుడన్నా మీకు కాస్తన్నా గౌరవం మిగులుతుంది అని ముఖ్యమంత్రికి నేను తెలియచేస్తున్నా. ఆ డీఎస్పీ శ్రీనివాస్, నూజివీడు డీఎస్పీ రిపోర్ట్ ను బయటపెట్టండి. ఆయనేం రాశారో చూద్దాం. అసెంబ్లీలో పెడతాంపెడతాం అని మీరెందుకు అబద్ధమాడారో మా శాసనసభ్యులకు, రాష్ట్రప్రజ లకు తెలియచేయండి అనిచెప్పి మేం డిమాండ్ చేస్తున్నాం.

తరువాత డీజీకి కూడా నేను లెటర్ రాస్తున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు, కళ్లుతెరవండి, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను నేను అడుగుతూ ఉన్నాను సభాముఖంగా. ఇమ్మీడియట్ గా గుడివాడలో జరిగిన 500కోట్ల రూపాయల ఏదైతే మనీలాండరింగ్ జరిగిందో, దానిపై చర్యలు తీసుకోండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కెనాట్ కీప్ క్వైట్. ఇంతజరిగిన తర్వాత మౌనంగా ఉంటానికి లేదు, ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ కూడా రంగలోకి దిగిఎంక్వైరీ చేస్తుండగా మీరు మౌనంగా ఉంటానికిలేదు. తప్పకుండా హైదరాబాద్ లో జరిగినదానితో పాటు, ఈ గుడివాడలో జరిగినదానిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ యాక్షన్ తీసుకోవాలి అనిచెప్పికూడా తెలియచేస్తున్నా.

చివరిగా ముఖ్యమంత్రి మీరే బాధ్యులు, మీ అసమర్థత, చేతగానితనం, మీ అవినీతికి వత్తాలుపలికే విధానం, మీ బూతులమంత్రిని సమర్థించిన విధానం ఈరోజున ఇంతమంది ఇతరదేశాలజైల్లో మ్రగ్గవలసి వచ్చింది అనికూడా తెలియచేస్తున్నా. మీరే బాధ్యులు, ఆత్మ పరిశీలన చేసుకోండి ముఖ్యమంత్రిగారు. అవినీతిపట్ల మీరు మొగ్గచూపడంవల్లే ఇంతమంది జైల్లో ఉన్నారని కూడా తెలియచేస్తున్నా. ఈప్రభుత్వం వెంటనే జైల్లోఉన్నవారిని ఏరకంగా వెనక్కు తీసుకువస్తుంది.. ఏంప్రయత్నాలుచేస్తుంది అనికూడా రాష్ట్రప్రజలకు తెలియచేయాలి . ముఖ్యంగా ఆ జైల్లో ఉన్నవారి కుటుంబసభ్యులకు తెలియచేయాలి.

ఏమి ప్రభుత్వమండి సిగ్గు సిగ్గుపడుతున్నాం మేము. మీ ముఖ్యమంత్రిత్వంలో ఈరాష్ట్రంలోఉన్నందుకు సిగ్గుపడు తున్నాం. ఇంతవరకు ఎంతమంది జైల్లో ఉన్నారో తెలియదు.మీ అధికారులందరూ ఏంచేస్తు న్నారో మాకుతెలియదు. ఇప్పటికే ఇంటిలిజెన్స్ టీమ్ బ్యాంకాక్ వెళ్లి వివరాలు అన్నీ తెలు సుకోవాలి. యథారాజా తథా ప్రజా.. మీకు తెలియదు, వాళ్లు పనిచేయరు. అయినా ఎవరినీ వదిలేది లేదు అనితెలియచేస్తున్నా. ఆ జైల్లో మగ్గుతున్న, ఏదో వినోదంకోసం వెళ్లి అక్కడ బోల్తా పడ్డారు. పుట్టిమునిగింది వాళ్లకు, ఏంఖర్మకాలింది వాళ్లకు?

మీరు అవినీతికి మొగ్గ కుండా ఉంటే చికోటి ప్రవీణ్ జైల్లో ఉండేవాడుకదా! బూతులమంత్రి జైల్లో ఉండేవాడుగా.. ఆ గుడివాడ నిర్వాహకులు, గుడివాడ డీఎస్పీకూడా జైల్లోఉండేవాడుకదా! వారంతాజైల్లో ఉంటే, వీళ్లంతా జైలుపాలయ్యేవారు కాదుకదా! సమాధానంచెప్పాలని, మీబాబాయ్ ని బయటకు తెచ్చుకోవడానికి, తమ్ముడిని రక్షించుకోవడానికి చూపే చొరవలో కొంతైనా, బ్యాంకాక్ జైల్లో మగ్గుతున్న అభాగ్యుల పట్లచూపమని గౌరవముఖ్యమంత్రిని కోరుతూ ఉన్నా.

డీజీపీకి లెటర్ రాస్తున్నా. మొట్టమొదటినుంచీ పోలీసులు ఎంతఅసమర్థంగా వ్యవహరిం చారో, ఏ విధంగా వ్యవహరించారో, ఏవిధంగా దాటవేశారోఅన్నీ క్రోడీకరించి, సాక్ష్యాలు కూడా ఇస్తూ, రేపు ఉదయమే డీజీపీగారికి లేఖవ్రాస్తా. అలాగే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు కూడా సవివరంగా లేఖవ్రాసి ఈ మనీలాండరింగ్ కి బాధ్యులైనవాళ్లు అందరిపై చర్యలు తీసుకోవాల ని తెలియచేస్తున్నా. ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా చేస్తూఉన్నారు. దీన్నికూడా వదలకుండా గుడివాడకేసినో ని బాధ్యులు ఎంతపెద్దవారైనా సరే పట్టుకోవాలని, ఏ గ్యాంగ్ నైనా వదలకుండా అందరినీ కాళ్లు విరగ్గొట్టి లోపలేయాలని కోరుతున్నా.”

LEAVE A RESPONSE