– అరికెపూడి గాంధీ ల్యాండ్ కబ్జా పై ఎందుకు చేయడం లేదు?
– అరికెపూడి గాంధీ గాజుల రామారం లో 11ఎకరాలు భూ కబ్జా చేశాడు
– ఆయన పార్టీ మారిన తరువాతనే ఆ భూమిని ల్యాండ్ రెగ్యులరైజ్
– దమ్ముంటే గాజుల రామారం లో 307సర్వే నంబర్ లో ఉన్న భూమి వద్దకు పోదామా?
– అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు నైతికత ఎక్కడిది రేవంత్?
– ఎవరి కోసం ఈ ఖర్చు మిస్టర్ రేవంత్
– దమ్ముంటే ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలి
– ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
హైదరాబాద్: ప్రజా పాలన పేరు మీద అధికారంలోకి వచ్చి రెండేళ్ల అయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియా లాగా పని చేస్తుంది. దేశం గర్వించదగ్గ నేత పీవీ నరసింహారావు అలాంటి మహానుభావుడు తెచ్చిన చట్టం భూ సీలింగ్ చట్టం. భూమి ఎక్కువగా ఉన్న వారి నుండి ప్రభుత్వం భూమిని తీసుకోవాలి అని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన చట్టం.
రాజీవ్ గాంధీ తెచ్చిన చట్టాలను ఏ విధంగా తూట్లు పెడుతున్నారో చూస్తున్నాం. ఫిరాయింపుల చట్టం ను కూడా ఏ విధంగా తూట్లు పొడుస్తున్నారు చూస్తున్నాం. పార్టీ పిరాయింపు దారులకు, ఆయన అన్యాయాలకు దొడ్డి దారిన భూమిని అక్రమంగా కబ్జా పెట్టినట్లు చూస్తున్నాం. గాజుల రామారం లో 11ఎకరాలు భూ కబ్జా చేశాడు అరికెపూడి గాంధీ. ఆయన పార్టీ మారిన తరువాతనే ఆ భూమిని ల్యాండ్ రెగ్యులరైజ్ చేస్తున్నారు. రేవంత్ కు భజన చేస్తే చాలు,పార్టీ పిరాయింపులు చేస్తే చాలు భూ బదలాయింపు అవుతుంది.
శేరిలింగంపల్లి గాజుల రామారం లో సర్వే నెంబర్ 307 లో 411ఎకరాల భూమి ఉంటే భూ సేకరణ 411ఎకరాలలో 317ఎకరాల భూమిని ల్యాండ్ సీలింగ్ చట్టం ద్వారా భూమి ఎక్కువ ఉందని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నారు. 123 ఎకరాల 28 గుంటలు భూమిని ప్రైవేట్ భూమిని రికార్డ్ లో ఉన్నారు. 317 ఎకరాల భూమిని ల్యాండ్ సీలింగ్ కింద తీసుకున్నారు. 1980 కి ముందు ల్యాండ్ సీలింగ్ భూమిని షేక్ ఇమామ్ కు 1991లో ఆయన పేరు మీద ఉన్నట్లు రికార్డ్ లో ఉన్నది.
128.28ఎకరాలు భూమిని ఆ నలుగురు అమ్మేశారు.
2015 వరకు అభివృద్ధి మరింత జరిగింది. అరికపూడి గాంధీ పార్టీ మారినప్పుడు, రేవంత్ రెడ్డి ఇచ్చిన నజరానా ఏంటి అంటే, అమ్మిన భూమిని మళ్ళీ నకిలీ డాక్యుమెంట్ తెచ్చి ఇచ్చారు. షేక్ ఇమామ్ ఎప్పుడో అమ్మితే దాన్ని 2006లో అమ్మినట్లు దొంగ డాక్యుమెంట్లు సృష్టించారు. భూ భారతి లో కూడా అరికెపూడి గాంధీ పేరు మీద ఎంట్రీ చేశారు.
మాధవరం కృష్ణారావు బాధ్యతగల ఎమ్మెల్యే గా ప్రభుత్వం కు వినతులు ఇచ్చారు. సీసీ ఎల్ ఏ కు, సిఎస్, జిల్లా కలెక్టర్ కు, జిహెచ్ఎంసి కమిషనర్, హైడ్రా , విజిలెన్స్ కమిషనర్, కూకట్పల్లి కమిషనర్ కు, ఇతర పోలీస్ శాఖ అధికారులకు పిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ పిర్యాదు ఇచ్చేందుకు నేను కూడా వెళ్ళాను. రేపే మేము చర్యలు తీసుకుంటాం అని అన్నాడు.
తెల్లారే మళ్ళీ ఆయన బౌండరీ లు వేశాడు. తరతరాలకు ఉండేది భూమి. దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడం ఎవరి సొమ్ము? కబ్జాలను,దొంగలను అరికట్టకపోతే దేశాన్ని ఎవరు కాపాడలేరు. వేల కోట్ల రూపాయల భూమి పార్టీ మారితే నజరానా ఇస్తారట. ఐడీపీఎల్ భూమి మీద విచారణ చేస్తున్నట్లు తెలిపాడు. దొంగ డ్రామాలు ఆడాడు.నీవు విచారణ దేనిమీద చేస్తున్నావు? ఒక్క సర్వే నంబర్ మీద మాత్రమే చేస్తున్నావు. మాధవరం కృష్ణారావు కూడా విచారణ చేయాలని అనేక సార్లు కోరాడు. ఇవాళ కొందరు తృప్తి పరిచేందుకు ఇవాళ విచారణ చేస్తున్నావు.
ఒక్క సర్వే నెంబర్ మీద విచారణ చేస్తున్నావ్. మరి అరికెపూడి గాంధీ ల్యాండ్ కబ్జా పై ఎందుకు చేయడం లేదు? మేము వస్తాం అక్కడ కూడా చేయాలి. నియమ నిబంధనలు పాటించడం లేదు.హైడ్రా కలుస్తాడు అంట. మళ్ళీ ఆయన బ్లూ షీట్స్ పెట్టుకుంటున్నాడు. దమ్ముంటే గాజుల రామారం లో 307సర్వే నంబర్ లో ఉన్న భూమి వద్దకు పోదామా? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు నైతికత ఎక్కడిది రేవంత్?
ఏం చెప్పి అధికారంలోకి వచ్చావు? రాజీవ్ గాంధీ,పీవీ నరసింహారావు తెచ్చిన చట్టాలను నీరుగార్చారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో ఉన్న భూమిలో జరుగుతున్న కార్యకలాపాలను ఆపివేయాలి. అనుమతులు ఇచ్చిన అధికారుల ఏం చేస్తున్నారు? భూ భారతి అంటే బోగస్ భారతి నా? భూ ఆక్రమణలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న. ఐడీపీఎల్ భూములపై ఏవిధంగా విచారణ చేస్తున్నారో గాజుల రామారం లో ఉన్న 307సర్వే నంబర్ లో విచారణ చేయాలి. నీ మంత్రులకు నీకు పడడం లేదు.
హిల్ట్ పాలసీ డాక్యుమెంట్ మంత్రులే బయటకు ఇచ్చారు అని అన్నారు. లేస్తే కేసీఆర్, కేటీఆర్,హరీష్ రావు తప్ప ఇంకా ఏం లేదు. రాష్ట్ర అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు,పెట్టుబడులు పై మాట్లాడాలి కాని ఇవన్నీ ఎందుకు. కేసీఆర్ కేటీఆర్,హరీష్ రావు లపై కాదు. మా పార్టీ నాయకులను బద్నాం చేయాలని చూస్తే ప్రజలు వచ్చేది ఏం లేదు. ప్రజలు కూడా చూస్తే ఊరుకోరు.
ఏకగ్రీవం చేస్తారా చేయరా అని బెదిరింపులు లకు పాల్పడ్డ విషయం చూశాం కదా. అధికారంలో ఉన్న పార్టీ 50 శాతం మాత్రమే గెలవడం సిగ్గుచేటు. మీ ప్రభుత్వం మంచి చేస్తే 90 శాతం సీట్లు గెలవాలి. తాత మనువడు ఆడుకోవడం కోసం ప్రభుత్వ ఖజానా నుండి 200కోట్లు ఖర్చు చేశారు.
ఎవరి కోసం ఈ ఖర్చు మిస్టర్ రేవంత్. దమ్ముంటే ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలి
జివో 9 ఎవరిని అడిగి ఇచ్చావు.కోర్టులో విచారణ ఉండగా ఎందుకు ఆగమేఘాల మీద ఎన్నికలు పెట్టావు. ఎందుకు పిరాయింపు ఎమ్మెల్యేల ను అనర్హత వేటు వేయలేదు? ఇవాళ రాజ్యాంగాన్ని ఖూనీ చేశావ్.
దమ్ముంటే జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు పెట్టు. దమ్ముంటే పోదాం 307సర్వే నెంబర్ దగ్గరకు. ఇవాళ స్పీకర్ ను తప్పుదోవ పట్టించారు .ఆయన మంచి అవకాశం ఉండే. రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం బండి సంజయ్ ను అధ్యక్షుడు పదవి నుండి తప్పించారు. పొద్దున లేస్తే అబద్ధాలు ఆడితే ఏం చెప్తాం? రేవంత్ , బీజేపీ రెండు ఒక్కటే. బీజేపీ మీడియా సమావేశం లలో 10 శాతం కూడా రేవంత్ కు వ్యతిరేకంగా పెట్టలేదు.ఒకవేళ పెడితే నేను ముక్కు నేలకు రాసిపోతాను. కేటీఆర్ అమృత్ స్కాం మీద పిర్యాదు చేస్తే చర్యలు ఎందుకు తీసుకోలేదు? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు ఒక్కటే. ప్రెస్ మీట్ లో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర చారి పాల్గొన్నారు.