Suryaa.co.in

Andhra Pradesh

జనం తరిమినా.. కుట్రలు మానని బాబు

అవకాశవాది బాబు ఏ గట్టునున్నాడో
వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి చెయ్యాలన్న టీడీపీ డిమాండ్ కు అర్థమేమిటి
తప్పుడు కథనాలతో దేశ సార్వభౌమత్వానికి భంగం
ప్రెస్ కౌన్సిల్ కు విశిష్ట అధికారాలు తెచ్చేందుకు పార్లమెంటులో బిల్లు తెస్తా
ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి

తమ వాడేనన్న ఒకే ఒక్క కారణంతో ఎల్లో మీడియా భుజాన ఎత్తుకున్న పుణ్యమా అని చంద్రబాబు ఇన్నాళ్లు నెట్టుకొచ్చాడని, ప్రస్తుతం పరిస్థితి మారిందని, సోషల్ మీడియా చైతన్యంతో బాబు అసలు రంగు బయటపడిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. జనం తరిమినా సిగ్గురాలేదని, కుట్రలకు తెగబడుతూనే ఉన్నాడని మండిపడ్డారు.

ఆ గట్టునా కనిపించట్లేదు, ఈ గట్టున కూడా లేడు, అప్పట్లో చక్రాలు తిప్పిన అవకాశవాది ఏం చేస్తున్నాడా అని 5 కోట్ల మంది ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారని అన్నారు. కరకట్ట అక్రమ కొంపలో తుప్పు, పప్పు (చంద్రబాబు, లోకేష్‌)లు విరిగిన సైకిల్ చక్రాలు ముందేసుకుని శోకాలు పెడుతున్నారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారని ఏద్దేవా చేసారు.

వెంకయ్య నాయుడుకి రాష్ట్రపతి పదవి ఇవ్వాలని ఏపీలో ఉన్న బీజేపీ నేతలు కాకుండా టిడిపి నాయకులు మాత్రమే మాట్లాడుతున్నారంటే, దీని భావమేంటో ఆ దేవుడికే తెలియాలని అన్నారు.

ఏబీఎన్ తెలుగు టీవీ మరియు టీవీ 5 న్యూస్ నౌ ఛానళ్లు జర్నలిజం యొక్క నైతిక సూత్రాలను మర్చిపోయి తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. .దక్షిణ భారత రాష్ట్రాల వారు ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేస్తున్నారంటూ ప్రసారం చేసిన విద్వేషపూరిత వార్తలు తప్పుడు కథనాలని, ఇటువంటి చర్యలు దేశ ద్రోహానికి సమానమని మండిపడ్డారు.

వెంకయ్యనాయుడుకి రాష్ట్రపతి పదవిని నిరాకరించడం కారణంగా ప్రత్యేక దేశం డిమాండ్ తలెత్తే స్థాయికి కూడా ఈ ఛానళ్లవారు వెళ్లారని, ఈ ఛానళ్ల జర్నలిస్టులు, ఎడిటర్లు జాతీయవాదానికి వ్యతిరేకులని, భారతదేశ సార్వభౌమత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నించించిన దేశ వ్యతిరేకులని ఆగ్రహం వ్యక్తం చేసారు.

సమాజంలోని ఇటువంటి విద్వేషపూరిత కథనాల ప్రసారాలకు వ్యతిరేకంగా వ్యవహరించేందుకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధికారాలు ఇచ్చేలా తాను ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును తీసుకువస్తానని స్పష్టం చేసారు.

 

LEAVE A RESPONSE