Suryaa.co.in

Andhra Pradesh

విద్యుత్ ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లు పరిష్కరించకుంటే, జగన్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకుంటాడు

• ఇచ్చిన హమీలు నెరవేర్చకుండా, అక్రమ అరెస్టులు.. గృహనిర్బంధాలతో విద్యుత్ ఉద్యోగుల్ని అణచివేయాలని చూస్తే, నష్టపోయేది ముఖ్యమంత్రే
• విద్యుత్ పంపిణీ సంస్థల్ని అప్పులకు వాడుకోవడం, వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం తెలిసిన జగన్ కు ఉద్యోగుల సమస్యల పరిష్కారం తెలియదా?
• విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించేవరకు, టీడీపీ వారికి అండగా నిలుస్తుంది
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు

న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విద్యుత్ ఉద్యోగులు తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని అణచివేయడా నికి ప్రభుత్వం నిన్నటినుంచే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతల ముందస్తు అరెస్టులు, అక్రమ నిర్భం ధాలు మొదలుపెట్టిందని, ఏంచేసైనా సరే విద్యుత్ శాఖ ఉద్యోగులు రోడ్లపైకి రాకూడదన్న ధృఢచిత్తంతో సర్కారు వారిపై ఉక్కుపాదం మోపుతోందని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

“ విద్యుత్ ఉద్యోగుల ఉద్యమం తీవ్రరూపం దాలిస్తే, దాని ప్రభావంతో జగన్ సర్కారు ఉక్కిరిబిక్కిరి అవడం ఖాయం. ఇతర ఉద్యోగుల ఉద్యమాలు, ధర్నాలు ఒకెత్తు అయి తే విద్యుత్ ఉద్యోగుల సమ్మెలు, ధర్నాలు మరోఎత్తని ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. విద్యుత్ ఉద్యోగులకు 01-04-2022న ఇవ్వాల్సిన పీఆర్సీని ముఖ్యమంత్రి ఇంతవరకు ఫైనల్ చేయలేదు. ఎందుకు చేయలేదో ప్రభుత్వం సమాధానంచెప్పాలి. తప్పు ప్రభు త్వం వైపు పెట్టుకొని ఉద్యోగుల గొంతునులిమే ప్రయత్నాలు చేస్తే మొదటికే మోసం వస్తుందని ముఖ్యమంత్రి తెలుసుకుంటే మంచిది.

డీపీప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల కు 25శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ ఇచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని తప్పుపట్టిన జగన్ రెడ్డి, వారికి అవిచేస్తాను.. ఇవిచేస్తానని ఎన్నోహామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నీ పక్కనపెట్టి, నేడు మూడుడీఏలకు ఒకడీఏ, 7 శాతం ఫిట్ మెంట్ ఇస్తానని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఎన్నికల ప్రచారంలో వారికిచ్చిన హామీలను జగన్ రెడ్డి ఒకసారి గుర్తుచేసుకుంటే మంచిది.

విద్యుత్ శాఖ ఉద్యోగుల్ని ముఖ్యమంత్రి తన అధికారమదంతో అణచివేస్తుంటే, ఆ శాఖ మంత్రి ఎక్కడున్నాడో కూడా తెలియడంలేదు. తనశాఖ ఉద్యోగులు రోడ్లపైకి వస్తే మంత్రి స్పందించకపోవడం సిగ్గుచేటు. తమకు రావాల్సిన పీఆర్సీ, ఇతర బకాయిలు, డిమాండ్లపై విద్యుత్ ఉద్యోగులు మాట్లాడకూడదా.. వారి బాధలు ఎవరితో చెప్పుకోవాలి?

ఎన్నికల సమయంలో విద్యుత్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు విస్మరించిన జగన్, నేడు వారి సమస్యల్ని పట్టించుకోకుండా, పీఆర్సీ కమిషన్ వేశామని గొప్పలు చెప్పుకోవడం సరైందికాదు
01-07-2023 నుంచి రాష్టప్రభుత్వ ఉద్యోగులందరికీ పీఆర్సీ వేసినట్టు ప్రభుత్వ సలహాదారు సజ్జల చంకలు గుద్దుకుంటున్నాడు. పీఆర్సీ కమిషన్ వేసిన ప్రభుత్వం, ఏకంగా పీఆర్సీ మొత్తం చెల్లించేసినట్టు, ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత గొప్పగా డబ్బాలు కొట్టుకో వడం సిగ్గుచేటు. 01-04-2022 నుంచి ఇవ్వాల్సిన పీఆర్సీపై సమాధానంచెప్పకుండా ఏవేవో కుంటిసాకులు చెబుతూ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.

కేంద్రప్రభుత్వం కరోనా సమయంలో రెండు డీఏలు ఇవ్వలేమని ఫ్రీజ్ చేసింది. కానీ ఆ సమయంలో ప్రపంచమంతా విద్యుత్ ఉద్యోగులు పనిచేశారు. దేశంలో ఎన్నివ్యవస్థలు స్తంభించినా కరోనా సమయంలో విద్యుత్ వ్యవస్థ పనిచేసింది. ప్రజలు కూడా విద్యుత్ బిల్లులు చెల్లించారు. అలాంటప్పుడు మా డీఏలు ఎందుకు ఆపుతారని విద్యుత్ ఉద్యోగుల ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ శాఖలోని కాంట్రాక్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి, రెగ్యులర్ ఉద్యోగుల్లానే వారికి డైరెక్ట్ గా జీతాలు ఇస్తానని గతంలో జగన్ హామీ ఇచ్చాడు.

నేటికీ అదినెరవేరలేదు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం 180రోజులు నిర్విరామంగా పనిచేస్తే కాంట్రాక్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి. కానీ జగన్ సర్కార్ వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగుల గోడు పట్టించుకోవడం లేదు. ఆఖరికి ఉద్యోగులు దాచుకున్న జీ.పీ.ఎఫ్, ఎర్నర్ లీవ్ ఫండ్, ట్రస్ట్ లోని ఫండ్ తాలూకా రూ.12వేలకోట్ల సొమ్ముని కూడా జగన్ రెడ్డి సర్కార్, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కు బదలాయించింది.

ఇంతకంటే దారుణం మరోటి ఉండదు. ఉద్యోగులకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా వారు దాచుకున్న సొమ్ముని ప్రభుత్వం తనఇష్టానికి వాడుకోవడం దుర్మార్గం. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కు ఎంప్లాయీస్ సొమ్ము వాడుకునే హక్కు ఉందా? భవిష్యత్ లో సదరు కార్పొరేషన్ ఎత్తేస్తే, ఉద్యోగులు దాచుకున్నసొమ్ముకి ఎవరు గ్యారంటీ ఇస్తారు?

విద్యుత్ ఛార్జీలు పెంచి వినియోగదారుల్ని, అప్పులు తెచ్చి విద్యుత్ డిస్కంలను కోలుకోకుండా దెబ్బతీసిన జగన్ రెడ్డి, విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు ఎందుకు పరిష్కరించడు?
విద్యుత్ ఉద్యోగులు సమస్యలు, ఇబ్బందులు పరిష్కరించలేని ముఖ్యమంత్రి నాలుగేళ్ల లో 7సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. శ్లాబుల పేరుతో, సర్వీస్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీల పేరుతో విపరీతంగా వినియోగదారుల జేబులు కొల్లగొట్టారు. ఇంతచేసి ఉద్యో గుల సమస్యలు మాత్రం పరిష్కరించడంలేదు. అటు వినియోగదారుడి వీపు విమానం మోత మోగించి, ఇటు విద్యుత్ ఉద్యోగులకు న్యాయం చేయకుండా జగన్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నాడో సమాధానం చెప్పాలి?

విద్యుత్ రంగాన్ని చేజేతులా సర్వ నా శనంచేసిన జగన్, చివరకు విద్యుత్ ఉద్యోగులు సమ్మెచేసే వరకు మొద్దునిద్ర పోయా డు. ప్రభుత్వం వేసిన పీఆర్సీ కమిషన్ వల్ల ఉద్యోగులకు ఒరిగేదేమీలేదు… అలానే ప్ర భుత్వానికి ఒక తెల్లకాగితం తప్ప రూపాయి ఖర్చులేదు. విద్యుత్ శాఖను ప్రత్యేకంగా చూడాల్సిన ప్రభుత్వం, కేవలం ఆదాయార్జన శాఖగానే చూస్తోంది. రాష్ట్రప్రభుత్వం తక్షణమే విద్యుత్ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.

టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థికపరిస్థితి బాగోలేకపోయినా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు లేకుండా వారికి న్యాయంచేసింది. కానీ జగన్ సర్కార్ ప్రజల విషయంలో వ్యవహరించినట్టే ఉద్యోగుల విషయంలో నిర్దాక్షణ్యంగా కర్కశంగా వ్యవహరిస్తోంది. ఏపీ జెన్ కో, ట్రాన్స్ కో వంటివాటిని తనఖాపెట్టి అప్పులు తెచ్చిన సర్కార్, విద్యుత్ శాఖను కోలుకోవడానికి వీల్లేనంతగా దెబ్బతీసింది.

స్వార్థనిర్ణయాలతో విద్యుత్ శాఖను నిర్వీర్యంచేసిన జగన్ రెడ్డి, ఉద్యోగుల్ని రోడ్డున పడేయాలని చూస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటాడు. ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులకు వ్యతిరేకంగా తీసుకునే చర్యలను ప్రజావ్యతిరేక చర్యలుగానే పరిగణించాల్సి వస్తుంది.” అని అశోక్ బాబు స్ప ష్టం చేశారు.

LEAVE A RESPONSE