– మరి ఖజానా ఖాళీ అని పదే పదే ఎందుకంటున్నారు?
– సనాతని ఎక్కడ దాక్కున్నాడు?
– 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిన హామీ ఏమైంది?
– నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఎందరికి ఇచ్చారు?
– రైతులకు రెండేళ్లలో ఇచ్చింది రూ.10 వేలు మాత్రమే!
– మహిళలకు నెలకు రూ.1500 ఇచ్చావా బాబూ..?
– ఉచిత బస్సు పథకానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి
తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్ అని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలతో కాలం వెళ్లదీస్తున్నారని, ఆయన పాలనలో జరిగిన గొప్పేంటో చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని విమర్శించారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన అడ్వరై్టజ్‌మెంట్, ఇది ఏ లెవల్ మోసమో.. వాళ్ల అనుకూల మీడియాలో వచ్చిన అడ్వైర్టైజ్మెంట్లను ఆయన మీడియా సమావేశంలో చూపిస్తూ ఈ 18 నెలల కూటమి పాలనా వైఫల్యాలను సతీష్‌రెడ్డి ఎండగట్టారు. చంద్రబాబు ఎప్పుడు మీడియాతో మాట్లాడినా, జగన్‌ని నిందించడం తప్ప ఏమీ మాట్లాడరని, ఎందుకంటే, ఆయనకు చెప్పుకోవడానికి ఏమీ లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
జీడీపీ పెరిగి రాష్ట్రంలో సమూల మార్పు తెస్తే ఆదాయం పెరగాలి కదా?. నోరు తెరిస్తే చాలు ఖజానా ఖాళీ అంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే తోపుడు బండి, కిరణాకొట్టు వద్దకు వెళ్దాం. ఆదాయం పెరిగిందా? లేదా అని వారినే నేరుగా అడుగుదాం.ఎలాంటి సమాధానం చెబుతారో చూద్దామా? 2024 మే 9న సూపర్ సిక్స్ అంటూ గొప్పగా పేపర్లకు అడ్వైర్టైజ్మెంట్లు ఇచ్చారు.
యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు చేయకుండా మోసం చేశాడు. 18 నెలల్లో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా?
రైతుకు ప్రతి ఏడాది రూ.20,000 పెట్టుబడి సాయం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి..రెండేళ్లలో రావాల్సిన రూ.30,000లో కేవలం రూ.10,000 మాత్రమే ఇచ్చారు. చాలా మంది రైతులకు నిబంధనల పేరుతో కోతలు పెట్టాడు. తిరిగి అప్లికేషన్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.
ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తానన్న హామీ కూడా అక్షరాలా గాలిలో కలిసి పోయింది.. ఎన్ని సిలిండర్లు ఇచ్చారో ఈ ప్రభుత్వం డేటా కూడా వెల్లడించలేకపోతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ప్రభుత్వం ఆర్టీసీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం తీవ్ర అన్యాయం. వేలాది మహిళలు ప్రయాణిస్తున్నా, ఒక్క బస్సు కూడా అదనంగా పెట్టలేదు, ఇదేనా సంక్షేమం?.
పవర్ పర్చేస్ అగ్రిమెంట్ల గురించి చంద్రబాబు అసత్యాలు చెబుతున్నాడు. వైయస్ జగన్ తన పాలనలో రైతులకు భారం పడకూడదు అని యూనిట్ విద్యుత్‌ను రూ.2.49కి సెకీతో ఒప్పందాలు చేసుకుంటే అప్పట్లో ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అదే పవర్‌ను యూనిట్‌కు రూ. 3.20కు కొనుగోలు చేసింది నిజం కాదా?.
సనాతని ఎక్కడ దాక్కున్నాడు?
తిరుపతి లడ్డూ అపవిత్రమైందంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ రోజు తిరుమల మెట్లు కడిగాడు. అప్పుడు ఆ పవిత్రత, సనాతనం అంతా ఆయనకు గుర్తొచ్చాయి!. కానీ ఇప్పుడు విశాఖలో 1.80 లక్షల కేజీల గోమాంసం దొరికింది. ఇప్పుడు పవన్ నోరు ఎందుకు మెదపడం లేదు? ‘‘సనాతన రక్షకుడు’’ అప్పుడేనా? ఇప్పుడు కాదా? పవన్ ద్వంద్వ వైఖరి చిన్నపిల్లాడికే కూడా అర్థమైపోయింది.
జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదు?:
రాష్ట్రంలో కలకలం రేపిన డూప్లికేట్ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ జయచంద్రారెడ్డిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదు?.