ఎంపీ విజయసాయిరెడ్డి
అక్టోబర్ 25: ఇప్పటికి స్కిల్ స్కామ్ నిజం మాత్రమే గెలిచిందని, మిగిలిన నిజాలన్నీ గెలిస్తే బాబు శాశ్వతంగా జైల్లోనే శేష జీవితం గడిచిపోతుందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. సోషల్ మీడియా. వేదికగా బుధవారం ఆయన ఈ ఆంశంపై తనదైన శైలిలో స్పందించారు.
స్కిల్ స్కాం నిజం గెలవడంతో బాబు జైలుకెళ్లాడని అన్నారు. ఓటుకు కోట్లు కేసు, అమరావతి అక్రమాలు, స్కిల్ స్కామ్, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్డ్ భూ దోపిడి,టిడ్కో ఇళ్లలో అక్రమాలు, ఇలా అనేక కుంభకోణాల్లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడని అన్నారు. చంద్రబాబు కుంభకోణాల్లో నిజం గెలిస్తే ఆయన జైలుకే పరిమితం అవుతాడని అన్నారు
సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించాలి
గడిచిన 53 నెలల్లో సీఎం జగన్ చిత్తశుద్ధితో సామాజిక న్యాయానికి కొత్త అర్థం చెప్పారని విజయసాయిరెడ్డి అన్నారు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కాగా ఇందులో 2.07 లక్షల ఉద్యోగాలు గడిచిన 53 నెలల్లోనే వచ్చినవని అన్నారు.
80% ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే నని, కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకూ సింహభాగం పదవులు ఆయా వర్గాల వారికే ఇచ్చారని అన్నారు. గురువారం నుంచి సామాజిక సాధికారత’ బస్సు యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో సామాజిక విప్లవాన్ని ప్రజలకు వివరింంచాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారని ఆయన అన్నారు.