రాష్ట్ర ఆర్థిక అంశాల్లో ఎలాంటి లొసుగులు.. తప్పులు లేకపోతే, అప్పులు..ఆదాయ వివరాలు ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడంలేదు?
– రాష్ట్ర ఆర్థికపరిస్థితి, ఆదాయ వ్యయాలకు సంబంధించిన వాస్తవ సమాచారంతో జగన్ సర్కార్ తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి• మా ప్రభుత్వం అంతా పారదర్శకంగా చేస్తోందని ఆర్థికమంత్రి ఉత్తుత్తి మాటలు చెబితే సరిపోతుందా?
• కాగ్ మొత్తుకుంటున్నా జగన్ ప్రభుత్వం ఎందుకు ఆదాయ వ్యయవివరాలు బహిర్గతం చేయడంలేదు?
• ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితికి మించి ఏపీ అప్పులుచేస్తున్నా.. జగన్ సర్కార్ పై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
• ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితికి మించి అప్పులు చేశాయని కేరళ, తెలంగాణ రాష్ట్రాలపై కన్నెర్ర చేసిన కేంద్రప్రభుత్వం ఏపీ ప్రభుత్వ వైఖరిపై ఎందుకు ఉదాసీనతతో ఉంటోంది?
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీ.వీ.రెడ్డి
రాష్ట్రాన్ని అప్పులఊబిలోకి నెట్టిన వైసీపీ ప్రభుత్వం, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేవలం ఏడునెలల్లోనే రూ.72,950కోట్ల అప్పు చేసిందని, ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితి రూ.30,275కోట్లు అయితే, అదపంగా ప్రభుత్వం దాదాపు రూ.42వేలకోట్లకు మించి అప్పు చేసిందని, 2020-21, 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల మాదిరే, 2023-24లో కూడా వరుసగా ప్రభుత్వం ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితికి మించి అప్పు చేసి, ఆ సొమ్ముని ఇష్టానుసారం విచ్చలవిడిగా దుబారాచేసిందని టీడీపీ జాతీ య అధికారప్రతినిధి జీ.వీ.రెడ్డి తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ రాష్ట్ర విభజన వల్ల ఏపీకి వచ్చిన అప్పులు కలిపి, 2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంపై ఉన్న మొత్తం అప్పు కేవలం రూ.3,62,726కోట్లు మాత్రమే. ఈ విషయం 2019 జూలైలో వైసీపీప్రభుత్వమే శ్వేతపత్రం విడుదల చేసి మరీ చెప్పింది. 2019లో మేలో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ తన అప్పుల పరంపర కొనసాగిం చి, కేవలం నాలుగున్నరేళ్లలోనే రూ.7,40,476కోట్ల అప్పుచేసింది. కేవలం ఆర్బీఐ బాండ్స్ ద్వారానే రూ.2,56,166కోట్ల అప్పులు తెచ్చింది. ఇంత భారీగా అప్పులు తెచ్చిన జగన్ సర్కార్ రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి చేసిందా అంటే ఏమీ లేదు.
ఏపీ కంటే కూడా త్రిపుర, అస్సాం వంటి చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాయని తేలింది. జగన్ సర్కార్ అప్పుల్లో అగ్రస్థానంలో నిలిచి… అభివృద్ధిలో అట్టడుగున నిలిచింది. అప్పులు తెచ్చిన సొమ్ముని అన్యాక్రాంతం చేస్తున్న జగన్ ప్రభు త్వం, అప్పుల లెక్కలను కూడా దాచిపెట్టి, తప్పుడు సమాచారం వెల్లడిస్తోంది. ఆర్బీఐ ద్వారా తెచ్చిన అప్పులనే లెక్కలో చెబుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం, ఇతర కార్పొరేషన్లు…ప్రభుత్వసంస్థల ద్వారా తెచ్చిన అప్పులు.. వాడుకున్న ఉద్యోగుల సొమ్ము.. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పెండింగ్ సొమ్ము.. ఇతర డిపాజిట్ల వివరాలను దాచి పెడుతోంది.
రాష్ట్రంపై ఉన్న అప్పులు.. ఇతర ఆదాయ వ్యయ వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని రెండేళ్లుగా తెలుగుదేశం డిమాండ్ చేస్తుంటే, ప్రభుత్వం ఎందుకు స్పందిండం లేదు?
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రెండేళ్లుగా డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయడం లేదు? నాలుగున్నరేళ్లలో తెచ్చిన అప్పులవివరాలు తెలియచేస్తూ..మేంతెచ్చిన అప్పులకు తరువాత వచ్చే ప్రభుత్వాలకు.. ప్రజలకు ఎలాంటి సంబంధం ఉండదని జగన్ ప్రభుత్వం ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతోంది? ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా పారదర్శకత…నిజాయి తీ అని మాటలు చెబితే సరిపోతుందా? రాష్ట్ర ఆర్థిక అంశాల్లో ఎలాంటి లొసుగులు.. తప్పులు లేకపోతే ప్రభుత్వం ఎందుకు జీవోలు కూడా బయటపెట్టడంలేదు?
తెలుగు దేశం సహా ఇతర విపక్షాలు ఆర్థికవ్యవస్థకు సంబంధించి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పాలకులు ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ప్రభుత్వ కార్పొరేషన్లలో జరిగే ఆర్థిక వ్యవహారాలను ఎందుకు ఆడిట్ చేయించడం లేదు? టీడీపీప్రభుత్వంలో ప్రతి కార్పొరేషన్లలో ఎప్పటికప్పుడు ఆడిట్ జరిగేది.. అన్నివివరాలు ప్రజల ముందు ఉంచేది. తెలుగుదేశం అడిగిన ఆర్థిక లావాదేవీల వివరాలను ఆర్థిక శాఖ అధికారి రావ త్ ఎందుకు ఇవ్వడంలేదు?
నిన్నకూడా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృ ష్ణుడు, ఆర్థికమంత్రి బుగ్గనకు లేఖ రాశారు. టీడీపీప్రభుత్వంలో ఉన్న అప్పుల వివరాలు గతంలో వైసీపీ ప్రభుత్వమే బయటపెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం ఏమీ దాచ కుండా పారదర్శకంగా, జవాబుదారీ తనంతో వ్యవహరించింది కాబట్టే.. ఈ ప్రభుత్వం అన్ని వివరాలు బయటపెట్టింది. అలానే జగన్ ప్రభుత్వం ఎందుకు రాష్ట్రంపై ఉన్న అప్పుల వివరాలు మొత్తం బయటపెట్టదు? గతంలో కాగ్ రూ.1,25,000కోట్లు.. రూ.1,30,000కోట్లకు సంబంధించి అడిగిన లెక్కలను ఎందుకు ప్రభుత్వం బయట పెట్టలేదు?
అంతా సక్రమంగా జరిగితే, 22 నెలల నుంచీ కాగ్ కు వివరాలు ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తున్నారు. తమ ప్రభుత్వం అంతా సక్రమంగా చేస్తుందని బుగ్గన చెబి తే సరిపోతుందా? ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్మును ఇష్టానుసారం వివిధ కార్పొరేషన్లకు… నచ్చినవారికి చెల్లిస్తున్నది నిజం కాదా? మద్యం అమ్మకాల ద్వారా వచ్చే సొమ్ముని బహిరంగంగానే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కు మళ్లిస్తున్నారు. ఇలా చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా?
ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితికి మించి అప్పులు చేశాయని కేరళ, తెలంగాణ రాష్ట్రాలపై కన్నెర్ర చేసిన కేంద్రప్రభుత్వం ఏపీ ప్రభుత్వ వైఖరిపై ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది?
ఏపీ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తున్నా.. ఎఫ్.ఆర్.బీ.ఎం పరిధి దాటుతు న్నా కేంద్రప్రభుత్వం అప్పులు తీసుకోవడానికి జగన్ సర్కార్ కు ఎలా అనుమతులు ఇస్తోంది. ఏపీ ప్రభుత్వ ఆర్థిక అవకవతవకలపై ఏపీలోని బీజేపీ నేతలు ఒకటి చెబు తుంటే.. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఇష్టానుసారం అప్పులు ఇస్తున్నారు.
కేంద్రప్రభుత్వా నికి నిజంగా ఏపీకి న్యాయం చేయాలని ఉంటే, విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావా ల్సిన నిధులిచ్చి.. ఇతర ప్రయోజనాలు నెరవేర్చాలి. అంతేగానీ జగన్ సర్కార్ అడగడ మే ఆలస్యమన్నట్లు అప్పులు ఇస్తుంటే, ఆభారం మొత్తం రాష్ట్రప్రజలపై పడటం లేదా? ఈ వాస్తవం తెలియకుండానే కేంద్రప్రభుత్వం జగన్ ప్రభుత్వానికి అప్పులు ఇస్తోందా?
ఎఫ్.ఆర్.బీ.ఎం పరిధి దాటి అప్పులు చేశాయని కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాలకు అప్పుల్లో కోత పెట్టిన కేంద్రప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం విషయంలో మాత్రం ఎందుకు చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. పరిధిదాటి అప్పులు చేశారని..రూ.22 వేలకోట్లు మేం నిలిపేస్తామని, 2021లో లేఖ ద్వారా ఏపీ ప్రభుత్వానికి చెప్పిన కేంద్రం, నేటికీ ఆ పని ఎందుకు చేయలేదు? ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా పరిధిదాటి రూ.40వేలకోట్ల అప్పులకు కేంద్రం ఎలా అనుమతించింది?
కాగ్ విభాగమేమో ఏపీ ప్రభుత్వం తమకు సరిగా లెక్కలు చెప్పడం లేదని మొత్తుకుంటుంటే, కేంద్రం అదే ప్రభుత్వం విషయంలో ఎందుకు ఉదాసీనతతో వ్యవహరిస్తోంది? జగన్ రెడ్డి సర్కార్ నిర్వాకాలతో ఇప్పటికే ప్రజలతో పాటు రైతులపై భారీగా అప్పులభారం పడింది. పరిపాలను గాలికి వదిలేసి, రాష్ట్రాన్ని దుర్మార్గాలు, దోపిడీలు, విధ్వంసాలకు కేంద్రబిందువుగా మార్చిన జగన్ ప్రభుత్వం మొత్తంగా ఏపీని అప్పులఊబిలోకి నెట్టేసిందనే వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలి.
ఇప్పటికీ జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వడంలేదు.. జూలైలో ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చిన ప్రభుత్వం నేటికీ ఐ.ఆర్ చెల్లించలేదు. దానిపై ప్రశ్నించే ధైర్యం ప్రభుత్వానికి లేదు. కమీషన్లు ఇస్తేనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు. అభివృద్ధి పనులు చేసేవారిలో కూడా కులం..మతం.. ప్రాంతం చూసి లబ్ధిచేకూర్చడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. అలానే ప్రజలకు అందించే సంక్షేమపథకాల్లో కూడా మొత్తం కోతలే.
ప్రతి పథకంలో అర్హులకు అన్యాయం చేస్తూ అరకొరగా చెల్లిస్తూ, బటన్ నొక్కి ఉద్ధరిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. మరలా ఖర్మకాలి జగన్ రెడ్డి అధికారం లోకివస్తే, ఉద్యోగులు..ఉపాధ్యాయులు.. కాంట్రాక్ట్ సిబ్బంది.. కార్మికులు.. కూలీలు.. ప్రజలు హ..లక్ష్మణా అని నెత్తీనోరు కొట్టుకుంటూ విలపించాల్సిందే. టీడీపీప్రభుత్వం వస్తేనే మరలా రాష్ట్రంలో అన్ని వర్గాలకు మంచిరోజులు వస్తాయని.. అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడతాయని ప్రజలు గ్రహించాలి.” అని జీ.వీ.రెడ్డి సూచించారు.