– ఢిల్లీ పెద్దలకు పడి పడి పాదాభివందనం చేసినా చివరకు అత్తారింటికి వెళ్లక తప్పదు విజయసాయిరెడ్డి
– టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు
జగన్ రెడ్డి అరాచక పాలనను, వైసిపి నేతల దోపిడిని, ఎత్తి చూపితే దానిని కుల మీడియా అంటారా?ఒక కులం పై నిత్యం విషం చిమ్ముతూ, అబూత కల్పనలతో అసత్యాలను ప్రచురిస్తున్న మీ మీడియా ని ఏమనాలి?ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు వంత పడుతూ, వారి అడుగులకి మడుగులు వత్తుతున్న మీడియాని ఏ పేరుతో పిలవాలో వీసా రెడ్డే చెప్పాలి.ప్రజల తరుపున నిత్యం పోరాటం చేస్తున్న మీడియాపై విషం చల్లడం మీదే కుటిల మనస్తత్వానికి నిదర్శనం.
ప్రజల మీడియా ఎదో, ప్రభుత్వానికి కొమ్ము కాసే మీడియా ఎదో జనం గమనిస్తున్నారు వీసా రెడ్డీ.తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేకే వైసీపీ దగుల్బాజీ రాజకీయం చేస్తోంది.వయసు పైబడుతున్న కొద్దీ వీసా రెడ్డికి మతిమరుపు రోగం ఎక్కువ అవుతోంది.అబద్దాలను నిజాలుగా చిత్రించడంలో విజయసాయిని మించిన మోసగాడు మరొకరు ఈ ప్రపంచంలో లేరు. రాచరిక వ్యవస్థలో వున్నట్లు,తన సొంత రాజ్యాంగం అమలులో వున్నట్లు విజయసాయి భ్రమిస్తున్నాడు. విజయసాయిది నోరా లేక లేట్రిన్ ట్యాంకా అని ప్రజలకు అనుమానం కలుగుతుంది.
విజయసాయి రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి వాడుతున్న బాష పశువులు కాసుకునే వారు కూడా వాడరు . తన అసమర్ధతను కప్పి పుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడుపై నోటికి వచ్చినట్లు దుర్బాశలాడుతున్నారు. ఇది ఆయన వినాశాకాలానికే విపరీత బుద్ది. నువ్వు మొగొడివి అయితే అభివృద్దిలో చంద్రబాబుతో పోటీ పడు అంతే తప్ప పోటీ పడలేక పిచ్చి కూతలు కూస్తే నీకు ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రే గతి.
మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మతిమరుపు రోగాన్ని ఆరోగ్యశ్రీ లో చేర్చి మెరుగైన వైద్యం అందిస్తాం.ఢిల్లీ పెద్దలకు పడిపడి పాదాభివందనం చేస్తే రాష్టంలో ఫ్యాన్ రిపేరు కాదు.అందరి కాళ్ళు మొక్కినా చివరకి అత్తారింటికి పోక తప్పదు.