Suryaa.co.in

Telangana

ఈ మూర్ఖుడు దిగిపోతేనే మనకు అభివృద్ధి

– కేసీఆర్ పథకం తాగుడు… ఊగుడే
– యాసిడ్, ఫినాయిల్ వేసి కడిగినా ఆ కంపు పోదు
– ఇచ్చేటోడు మోడీ అయితే… పంచేతోడు మనోడు కాదు
– వడ్డెర కులస్తులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖాముఖి

పాలమూరు లోని మోతీ నగర్ లో వానొచ్చి, మా గుడిసె కప్పులు అన్నీ ఎగిరిపోయాయి. మొన్నటి గాలి, వానికి మా గుడిసెలు మొత్తం కోల్పోయాం… నిలువ నీడ లేకుండా.. ప్రస్తు మీ ముందు నిలుచున్నాం. మమ్మల్ని ఆదుకున్నవాళ్లే లేరు. ప్రభుత్వం నుంచి స్పందన లేదు.చిన్నపిల్లలతో మా ఇబ్బందులు, బాధలు ఇన్నీ అన్నీ కావు.మాకు ఆధార్ కార్డు ఉన్నా… మాకు ఇళ్ళు కేటాయించడంలేదు అంటూ సంజయ్ ముందు కన్నీరు పెట్టుకున్న లక్ష్మి అనే మహిళ. మాకు మోతీ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని గత 5 సంవత్సరాలుగా మొరపెట్టుకుంటున్నా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు.
– మాకు మీరే దిక్కు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎదుట వాపోయిన మోతీనగర్ గుట్ట వడ్డెర కులస్తులు

వారి బాధలపై స్పందించిన బండి సంజయ్.. మీ సమస్యలు పరిష్కరించాలని కేంద్రం ప్రయత్నిస్తున్నా, కేసీఆర్ అడ్డుపడుతున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా సంజయ్ వారితో ఏమన్నారంటే… మీ బాధలు చూస్తే బాధేస్తోంది. ఎక్కడికి పోయినా… ఇండ్లు లేవనే పేదలు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. పాదయాత్ర లో చూసా…. చిన్న గుడిసెల్లో నలుగురు ఉంటున్నారు. దేశవ్యాప్తంగా పేదల కోసం మోడీ 20 కోట్ల ఇండ్లు కట్టిస్తున్నారు.తెలంగాణకు 1.40 వేల ఇండ్లు కేటాయించారు. యూపీ లో 40 లక్షల ఇండ్లు కట్టిస్తే… యోగీ మళ్లీ గెలిచాడు.
ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు అయిన 1.40 వేల ఇండ్లను కట్టిస్తే… ఇంకో లక్ష ఇండ్లను మంజూరు చేయిస్తా అంటే… కేసీఆర్ స్పందించడం లేదు. ఈ మూర్ఖుడు దిగిపోతేనే మనకు అభివృద్ధి జరుగుతుంది. అధికారులతో మీ సమస్యపై మాట్లాడతా. బీజేపీ ప్రభుత్వం రాగానే మీకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది.

ఎనుగొండ లో ప్రజలతో బండి సంజయ్ ముఖాముఖి
-పెన్షన్స్ లేవు, 2bhk లేవు అంటూ తమ సమస్యలు చెప్పుకుంటున్న ఎనుగొండ వాసులు. ఉద్యోగాలు లేవంటూ యువత, ఉన్నోళ్లకి అన్నీ ఇస్తున్నారు, లెనోళ్ళ పరిస్థితి అంతే అంటూ గృహిణులు చెప్పుకుంటున్న సమస్యలను సావధానంగా విన్న బండి సంజయ్
– పేదోడు కూరగాయలు కొనే పరిస్థితి లేదు, పెంచిన విద్యుత్ చార్జీలతో బిల్లులు కట్టాలంటే మాకు నరకం కనిపిస్తోంది అంటున్న ఎనుగొండ వాసులు
– భర్త చనిపోయినా పింఛను రావడం లేదు అంటూ ఓ వితంతువు ఆవేదన
– ఆర్థిక భారంతో మా పిల్లలను చదివించలేక పోతున్నాం అంటూ సంజయ్ ముందు గోడు వెలబోసుకున్న పలువురు గృహిణులు
– ఓ పాప ని 10th చదివిస్తా అని సంజయ్ హామీ
– ఎనుగొండ గ్రామంలో ఉన్న సమస్యలతో పాటు తమ ప్రధాన సమస్యలను సంజయ్ ముందు ఏకరువు పెట్టిన గ్రామస్తులు

ఈ సందర్భంగా సంజయ్ వారితో ఏమన్నారంటే..
ఎక్కడికెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ వచ్చి, మనతో ఇలా కింద కూర్చున్నారు. అదే కేసీఆర్ కు ఏసీ లేకపోతే ఇలా కూర్చుంటాడా? కేసీఆర్ షాప్ లు ఏంటో తెలుసు కదా? కేసీఆర్ షాప్ లు అంటే వైన్ షాప్ లు, బెల్ట్ షాప్ లే.

కేసీఆర్ పథకం తాగుడు… ఊగుడే. ఇప్పటికే 2 పెగ్గులు అయిపోయి ఉంటాయి. మోడీ ఫ్రీగా బియ్యం, వ్యాక్సిన్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఎన్నికలు లేవు… మేము ఓట్ల కోసం రాలేదు. టిఆర్ఎస్ పార్టీ హామీలు ఏమయ్యాయి? 23 రోజుల నుంచి మీ కష్టాలను తెలుసుకునేందుకే… ఎర్రటి ఎండలో, మండుటెండల్లో పాదయాత్ర చేస్తున్నాం.

పేదల కష్టాలు తెలుసుకునేందుకు ప్రతి గడప దగ్గర కి వెళ్లాలని మోడీ ఆదేశిస్తే… పాదయాత్ర చేస్తున్నాం. బియ్యం ఇచ్చేది మోడీ అయితే… రేషన్ షాపుల దగ్గర ఫోటో కేసీఆర్ ది. కరోనా కారణంగా మరో ఆరు నెలలపాటు పేదలకు ఫ్రీగా బియ్యాన్ని ఇస్తున్న ఘనత మోదీదే. ప్రజలకు పూర్తిగా రెండు డోసులు వ్యాక్సిన్ ను ఫ్రీ గా ఇచ్చారు మోడీ.

చాయ్ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని అయ్యారు.పేదల కోసం దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 20 కోట్ల ఇండ్లను కట్టిస్తున్నారు. తెలంగాణకు 1,40,000 ఇళ్లను మంజూరు చేసి, నిధులను విడుదల చేస్తే… కెసిఆర్ ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. కేంద్రం మంజూరు చేసిన ఇండ్లలో ఇక్కడ ఎన్ని ఇల్లు కట్టించారో లిస్ట్ ఇవ్వాల్సిందిగా కేసీఆర్ ను అడిగితే… ఇప్పటివరకు ఆ లిస్ట్ ఇవ్వలేదు.

పేదలకు ఇళ్లు కట్టివ్వని కేసీఆర్… తాను మాత్రం రూ.800 కోట్లతో ప్రగతి భవన్ కట్టుకున్నాడు.ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కెసిఆర్…. తన ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. నిరుద్యోగ భృతి ఇవ్వని కెసిఆర్… తన ఇంట్లో మాత్రం ఐదుగురికి 25 లక్షలు ఇచ్చుకున్నాడు.కేంద్రం నిధులు ఇస్తుంటే ఆ పథకాలకు తన పేరుతో ప్రచారం చేసుకుంటున్నాడు.పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడు.

తెలంగాణ ఉద్యమం లో కేసీఆర్, హరీష్, ktr దెబ్బలు తిన్నారా?అమెరికాలో ఉన్న ktr ఇప్పుడు మంత్రి అయ్యాడు.పేదోళ్ల ఆత్మహత్యలతో ఏర్పడ్డ తెలంగాణ లో… పెద్ధోళ్ళు పాలిస్తున్నారు. ఇచ్చేటోడు మోడీ అయితే… పంచేతోడు మనోడు కాదు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు. యాసిడ్, ఫినాయిల్ వేసి కడిగినా ఆ కంపు పోదు. మోడీ పేరు వింటే చాలు కేసీఆర్ గజగజా వణుకుతాడు.ఒక్కసారి మమ్మల్ని ఆశీర్వదించండి… మీకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి.తెలంగాణలో బాధలను తెలుసుకోమని మోడీ చెబితేనే… భూపేందర్ యాదవ్ ఇక్కడికి వచ్చారు.ఉద్యమ సమయంలో దొంగ దీక్ష చేసిన కేసీఆర్… ఇప్పుడు పాలిస్తున్నాడు. టీఆర్ఎస్ వాళ్లు చెప్పే పిట్ట కధలు నమ్మకండి.

LEAVE A RESPONSE