అనంతపురం సీనియర్ వైకాపా నేత, బంధువు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి చనిపోతే జగన్ ఎందుకు రాలేదు? తిరుపతి బంధువులు కూడా కనిపించడం లేదు?
తోపుదుర్తి భాస్కర్ రెడ్డికి, భూమన బ్రదర్స్‌కు వున్న సంబంధం ఏమిటో ఎవరికైనా తెలుసా?
ఆశ్చర్యంగా డాలస్‌లో భూమన వారి ఆధ్వర్యంలో.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రాయలసీమ మీద ఒక ఉద్యమం మొదలైంది తెలుసా?
తోపుదుర్తి భాష్కర్ రెడ్డి భార్య కవితకు భూమన కుసుమ కుమారికి ఏమి సంబంధం?
అదే ఆచార్య భూమన కుసుమ కుమారి గతేడాది ఎన్నికల ఫలితాలకు ముందు 24 మే 2024న “అన్నమయ్య సంకీర్తనలలో ఆధ్యాత్మిక శక్తి తరంగాలు” అని ప్రవచనాలు చెప్పడం గురించి తెలుసా?
క్షమించండి… ఒక్కసారిగా ఇన్ని ప్రశ్నలు అంటే మీ మైండ్ గిర్రున తిరుగుతుంది అని తెలుసు. నాకు కూడా ఏదన్నా స్క్రూలూజ్ అని మీరు అనుకోవచ్చు.
చదివితే అప్సెట్ అవుతారు. కోపం వస్తుంది. ఇన్ని రంగులా అనే ఆక్రోశం కలుగుతుంది.
మన్నించండి, వాస్తవాలు అలాగే మనం ఊహించని స్థాయిలో.. టెక్ టెక్ అనుకొనే మనకు అందని విధంగా శత్రువుల వేగం వుంటుంది. సహనంతో మీ సందేహాలు నివృత్తి చెయ్యడానికి ప్రయత్నిస్తాను.
మనం తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూత గురించి మాట్లాడు కుంటున్నాం కదా. ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. నిన్న పోయినా.. అమెరికా నుండి వారసులు రావాలి. వేచి చూస్తున్నారు. ఈ సమయంలో ఈ ఫోటో చూశారా? పిల్ల చెవిరెడ్డి, జగన్ లెక్కన బిల్డప్ ఇస్తూ పరామర్శ చేస్తున్నాడు. ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఓదార్పు చేస్తున్నాడు జైల్లో వున్న చెవిరెడ్డి కొడుకు పిల్ల చెవిరెడ్డి. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి బాబాయి ఈ చనిపోయిన తోపుదుర్తి భాస్కర్ రెడ్డి.
భూమన బ్రదర్స్‌లో కరుణాకర్ రెడ్డి వదిన కుసుమకుమారి. ఆమె చెల్లెలు తోపుదుర్తి కవితను అనంతపురం జెడ్పి చైర్మెన్ ను చేశాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అదే సమయంలో టిటిడి నిధులు అనంతపురంకు విపరీతంగా కేటాయించి లెక్కలు చెప్పలేని అవినీతిని చేయించారు.
మరి భూమన కుసుమ కుమారిని వైఎస్సార్ ఏమి చేశారు అనుకొంటున్నారు?
ఆమె వల్ల వైకాపా పార్టీ పుట్టింది అని మీకు తెలుశా?
ఆమెను శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ (ఎస్కేయూ) వీసీని చేశాడు వైఎస్సార్!
భూమన కరుణాకర్ రెడ్డి అమ్మాయిని వైఎస్సార్ కుటుంబంలో ఇచ్చారు!
వైఎస్సార్ చనిపోయాక, కుసుమకుమారి పాపం పండింది. ఆమె ఆ హోదాలో 29 మంది అసిస్టెంట్ ప్రొఫెషర్స్ అక్రమ నియామకాలలో అవకతవకలుకు, అవినీతికి పాల్పడింది అని జస్టిస్ హనుమంతు కమిటీ నివేదిక ఇచ్చింది. ఆగస్ట్ 2010 మధ్య ప్రభుత్వం ఆమె వీసీ హోదాను రద్దు చేసింది. కోర్టుకు వెళ్లింది.
అక్టోబర్ 23 2010న గవర్నర్ నరసింహన్ సిఫారసుతో రాష్ట్రం ఆమెను అధికారికంగా పదవి నుంచి తొలగించింది; యోగి వేమన యూనివర్సిటీ వీసీ రామచంద్ర రెడ్డిని చిరస్థాయి ఇన్చార్జిగా ఎస్కేయూకి నియమించారు.
నెలకే జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. ఆమెను అక్రమంగా తొలగించారు అని విమర్శించింది ఆయన వర్గం. పైకి చెప్పింది వేరే కారణాలు. వైకాపా పార్టీ పెట్టడానికి ఇదే ఆజ్యం పోసింది.
.ఎంత చెడినా..
మళ్లీ..
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (గ్రాడా) ఆధ్వర్యంలో ఫ్రిస్కోలో రాయలసీమ ప్రగతిపై ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ ప్రాంతం నుండి ప్రత్యేకంగా ప్రముఖ రచయిత భూమన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు. మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.
ఈ సమావేశానికి మరో గౌరవ అతిథిగా శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్-ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు . తెలుగు సాహిత్యంలో ఆమెకు ఉన్న అపారమైన జ్ఞానం, అనుభవం గురించి వివరించారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం యొక్క గొప్పదనం, దానిని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. ఆమె మాటలు తెలుగు భాషపై మనకున్న మమకారాన్ని, గౌరవాన్ని మరింత పెంచాయి.
దానికి ముందు 24 మే 2024న “అన్నమయ్య సంకీర్తనలలో ఆధ్యాత్మిక శక్తి తరంగాలు” అని ప్రవచనాలు చేశారు.
కట్ చేస్తే.. తోపుదుర్తి భూమన మరదలు భర్త భౌతిక కాయం వద్ద అసలు బంధువులు లేరు. చావు ఇంటి దగ్గర కూడా బినామీలే!
కొసమెరుపు : తోపుదుర్తి ప్రకాశ్ ఏర్పాటు చేసిన లింగమయ్య మర్డర్ డ్రామా కోసం, పరిటాల సునీత రామగిరికి హెలికాప్టర్ వేసుకొని రావడం. ఆ విండ్షీల్ ధ్వంసం, రోడ్డు మార్గాన జగన్, హెలికాప్టర్ వెంటనే ఎగిరిపోవడం, దర్యాప్తు, అన్నీ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగింది.
కానీ అనంతపురం సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి చనిపోతే, తీరిక లేని జగన్ ఒక ట్వీట్ వేసి సంతాపం వ్యక్తం చేశాడు. సోది అనుకోకుండా.. భూమన టీడీఆర్ కుంభకోణం బయటకు వస్తే ఐఏఎస్ శ్రీలక్ష్మిని తీవ్రంగా విమర్శిస్తే.. వాటిని సాక్షిలో సెన్సార్ చెయ్యడం మరిచిపోకండి. విలువలు విశ్వసనీయతలు, అదృశ్యం రూపంలో ఉంటాయి. మనమే అర్థం చేసుకోవాలి.
-చాకిరేవు