చెరిగిపోతుంది అని తెలిసీ.. సముద్రం ఒడ్డున పేరు రాస్తాం!
కానీ ఇంకొంచెం లోపలికి వెళ్లి భవిష్యత్‌ను సృష్టించుకోవాలనే ఆలోచన వస్తే.. అది పిచ్చి కాక మరేమిటి!
మనలాగా పెద్ద పెద్ద రాష్ట్రాలు, విశాలమైన భూమి, ఎన్నో వనరులు ఆ చిన్న దేశానికి లేవు. కానీ, వాళ్ళకో పిచ్చి పట్టింది. భవిష్యత్‌ను సృష్టించుకోవాలనే పిచ్చి! అందులోంచే పుట్టింది ఈ జురాంగ్ ఐల్యాండ్ పెట్రోకెమికల్ హబ్ అనే అద్భుతం.
ఎలా మొదలైంది ఈ కల?
అదో పాతికేళ్ల కిందటి మాట. సింగపూర్ దగ్గర చిన్న చిన్న ఏడు దీవులు ఉండేవి. సముద్రంలో అక్కడక్కడా చెదురుమదురుగా ఉన్న ఆ దీవులను చూసి, “వీటిని కలిపేద్దాం! ప్రపంచంలోనే అతిపెద్ద కెమికల్ ఇండస్ట్రీ హబ్‌ను తయారు చేద్దాం!” అని కలగన్నారు వాళ్ళు. ఈ మాట వింటే ఎవరికైనా పిచ్చిగా అనిపించాలి కదా? చిన్న దీవులను కలిపి, సముద్రం పక్కన పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. కానీ, వాళ్ళు అనుకున్నారు… చేశారు!
ఎంత పెద్దదంటే?
మొత్తం ఏడు చిన్న దీవులను కలుపుకుంటూ, సముద్రాన్ని పూడ్చుకుంటూ వెళ్లారు. దాదాపు 32 చదరపు కిలోమీటర్లు! అంత పెద్ద విస్తీర్ణంలో, ఇప్పుడు ఏమున్నాయో తెలుసా? ఎక్సోన్మొబిల్, షెల్, బీఏఎస్ఎఫ్, డూపాంట్… ఇలా చెప్పుకుంటూ పోతే, ప్రపంచంలోని టాప్ 100 కంపెనీలు అక్కడ తమ ప్లాంట్లను పెట్టాయి. ఇదొక మామూలు ఇండస్ట్రియల్ పార్క్ కాదు, అదొక పెట్రోకెమికల్ సిటీ! అవును, కేవలం ఓ పేరు కాదు, ఒక లంగరు వేసిన రెస్టారెంట్ కాదు, ఏకంగా ఒక సిటీనే!
ఏం స్పెషల్? ఎందుకు ఇంత గొప్పది?
అదొక అనుసంధానించిన ఎకోసిస్టం! ఇక్కడ కంపెనీలు అన్నీ ఒకదానికొకటి కలిసి పనిచేస్తాయి. ఒక కంపెనీకి కావాల్సిన ముడి సరుకు, ఇంకో కంపెనీ నుంచి పైప్లైన్ల ద్వారా వెళ్తుంది. ఇంకో కంపెనీ నుంచి వచ్చే వేస్ట్, వేరే కంపెనీకి రా మెటీరియల్ అవుతుంది! దీన్ని వాళ్ళు “ప్లగ్-అండ్-ప్లే” ఎన్విరాన్మెంట్ అంటారు. లోడింగ్, అన్లోడింగ్ల బాధ ఉండదు. దీనివల్ల వాళ్ళకు ఖర్చు చాలా తగ్గుతుంది, రవాణా సమస్య ఉండదు.
ఎన్ని రకాల ప్రొడక్ట్స్!
ఇక్కడ పెట్రోల్, డీజిల్ లాంటివి మాత్రమే కాదు. మనం వాడే సీడీలు, డీవీడీలు, టీవీ ప్యానెళ్లు, ఇంకా పసిపిల్లల డైపర్లు… ఇలా ఎన్నో రకాల కెమికల్ ప్రొడక్ట్స్‌కు కావాల్సిన బిల్డింగ్ బ్లాక్స్ అక్కడే తయారవుతాయి. వాళ్ళ ప్రొడక్షన్ చూస్తే మైండ్ బ్లోయింగ్!
డబ్బుల పంట పండుతుంది!
వలలు వేసి చేపలు పట్టుకొని అమ్మడం కాదు, ఇక్కడ డబ్బుల పంట పండుతుంది! ఈ ద్వీపం పూర్వీకులైన మత్స్యకారులది కావచ్చు. కానీ ఇప్పటివరకు $50 బిలియన్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. సింగపూర్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో 25% కేవలం ఈ కెమికల్ సెక్టార్ నుంచే వస్తుంది. అంటే, వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంత ఇరుసుగా ఉందో అర్థం చేసుకోండి. దాదాపు 26,000 మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇక్కడే పనిచేస్తున్నారు. ఈ పరిశ్రమల వల్ల అనుబంధంగా లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది.
సముద్రం రాళ్ళ కింద స్టోరేజ్!
ఆసియాలోనే మొదటిసారిగా జురాంగ్ రాక్ కావెర్న్స్ అనే భూగర్భ స్టోరేజ్ ఇక్కడే ఉంది. సముద్రం కింద 130 మీటర్ల లోతులో, రాతి గుహల్లో చమురును, ఇతర కెమికల్స్‌ను నిల్వ చేసుకుంటారు. అదొక ఇంజనీరింగ్ అద్భుతం!
పర్యావరణానికి పెద్ద పీట!
పెట్రోకెమికల్ ఇండస్ట్రీ అంటే కాలుష్యం అని మనం అనుకుంటాం. కానీ, సింగపూర్ దీన్ని కూడా మార్చేసింది. వాళ్ళు “సర్క్యులర్ ఎకానమీ” అనే పద్ధతిని పాటిస్తారు. అంటే, ఒక కంపెనీ వ్యర్థం, ఇంకో కంపెనీకి వనరు. వేస్ట్ లేకుండా, రీసైకిల్ చేసుకుంటూ, పర్యావరణాన్ని కాపాడుకుంటూనే ప్రొడక్షన్ చేస్తారు. ప్రపంచానికి ఇదొక పెద్ద పాఠం. సింగపూర్ ఒక పర్యావరణ పెద్దబాలశిక్ష!
గ్లోబల్ పవర్ హౌస్!
కెమికల్స్ ఎక్స్‌పోర్ట్స్‌లో సింగపూర్ ప్రపంచంలోనే టాప్ 10లో ఉంది. రోజుకు 1.1 మిలియన్ బ్యారెళ్ళకు పైగా చమురును శుద్ధి చేస్తుంది. ఆసియాలో చమురు ప్రొడక్ట్స్ ఎగుమతిలో సింగపూర్‌ను ఎవరూ అందుకోలేరు.
ఈ జురాంగ్ ఐల్యాండ్ కథ మనకు ఏం చెబుతుందంటే – వనరులు లేకపోయినా, విశాలమైన భూభాగం లేకపోయినా, దూరదృష్టి, కఠోర శ్రమ, అద్భుతమైన ప్లానింగ్ ఉంటే ఒక చిన్న దేశం ఎలా ప్రపంచంలోనే గొప్ప ఎకనామిక్ పవర్ హౌస్‌గా మారగలదో చూపిస్తుంది.
ఆ కథ తరువాత.. మన కలల సంగతేంటి?
తీరప్రాంతంలోని కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులను కలుపుతూ పారిశ్రామిక-లాజిస్టిక్ కారిడార్ ఏర్పాటు చేయాలని కలలుగంటున్న ఒక దార్శనికుడు ఇవ్వాళ సింగపూర్‌లో పర్యటించి, జురాంగ్ ఐల్యాండ్‌ను నిశితంగా చూసి, అధ్యయనం చేశారు.
ఆ జురాంగ్ ద్వీపం నుండి కనీస ఇన్స్పిరేషన్ తీసుకొంటే.. లాజిస్టిక్ కారిడార్ మనం సాకారం చేసుకోవచ్చు. ఆలోచనలు పిచ్చివి కావచ్చు. కసిగా ఆలోచించేలా మార్చుకోవాలి మన వారిని. కానీ అద్భుతమైన కృష్ణా నదీ తీరాన మన కలల రాజధానిలో “చేపలు పట్టుకోవచ్చు” అని వాగే రాచ్చీసుల నాలుకల మీద చేపల పొలుసులు వేసి తోమినా పాపం లేదని అనిపిస్తోందా లేదా?
బంగారం కూడా మట్టిలో నుంచే తీస్తారు. ఇసుకనే బంగారం అని నమ్మించి, మనకే అమ్మి వేల కోట్లు దోచుకు తిని పెడబొబ్బలు పెట్టే రాచ్చీసుల మాటలు నమ్మితే మన కిడ్నీలనే మనకే అమ్మేస్తారు.
నాయుడిని నమ్మితే చాలు. ఆ మయుడి పూర్వీకులైన మత్స్యకారుల వలె, అద్భుతాలు సృష్టించిన జురాంగ్ లాంటివి మనకూ చూపిస్తారు!