-రైతులకు కల్లాలు కడితే బిజెపి ప్రభుత్వం వద్దంటుంది.. రైతులు తిరగబడాలి
-మూర్ఖపు బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది
-మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో క్రిస్మస్ నూతన వస్త్రాల పంపిణీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
(మహబూబాద్ జిల్లా – తొర్రూరు, డిసెంబర్ 23) రెండు మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు రాబట్టుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తుందని, కానీ తెలంగాణలో అది సాధ్యం కాదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని మతాలకు గౌరవం దక్కుతోందని, అన్ని మతాల వాళ్ళు కలిసి ఉన్నారని, తగాదాలు పెడితే బిజెపి ప్రయత్నం ఫలించదని చెప్పారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం క్రిస్టియన్ మైనార్టీలకు ఇస్తున్న నూతన వస్త్రాలను మంత్రి క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు పంపిణీ చేశారు. గతంలో క్రిస్టియన్ సోదరులు పిలిస్తే చర్చిలకు పోయేది ..ఇప్పుడు అధికారులు మిమ్మల్ని పిలిచి వేడుకలు చేసే పరిస్ఠితి కెసిఆర్ వల్ల వచ్చింది.అన్ని మతాలు ఒకటే. అన్ని మతాలను గౌరవించాలి. రాముడు, అల్లా, ప్రభువు అందరూ దేవుని అవతారాలు.
దేవుడు ఒక్కడే.. తీరు తీరుగా వస్తారు. ప్రభువును ప్రపంచం అంతా కీర్తిస్తుంది.ప్రభువును అనుసరిస్తే పాపాలు, మోసాలు ఉండవుశరీరంలో చెడును తొలగించేది డాక్టర్లు అయితే మనుషుల పాపాలు తొలగించేది ప్రభువు ఒక్కరే. పాపాలు చేసినోళ్ళు మన కళ్ళ ముందు పైకి వస్తారు..కానీ నేను రోజూ చర్చి, గుడి, మసీదు పోయినా ఇన్ని కష్టాలు ఏమిటి అని కొంతమంది బాధ పడుతారు.
కానీ పాపాలు చేసిన వాడు ఆస్తులన్నీ అతను ఒక్కడే అనుభవిస్తాడు…పిల్లలు బాగు పడరు.పుణ్యం చేస్తే వెంటనే లాభం జరగక పోయినా వారి పిల్లలు బాగుపడతారు.మా నాయన మంచి చేశాడు కాబట్టి నాకు ఉపయోగపడింది. నేను మంచి చేస్తే నా పిల్లలకు అక్కరకు వస్తుంది.అందుకే మనం మనస్పూర్తిగా సేవ చేస్తే పుణ్యం వస్తుంది.
కేసిఆర్ పేదల కోసం కల్యాణ లక్ష్మి పథకం ఇచ్చాడు. వెనుకట మేనమామ పెళ్లికి వస్తే బంగారం,పైసలు, చీరలు తెచ్చేవాళ్ళు. కానీ మన సీఎం కేసీఆర్ గారు ఇపుడు మేనమామగా 1,00,116 రూపాయిలు ఇస్తున్నాడు.పెన్షన్లు 2116 రూపాయలు ఇస్తున్నారు. ముసల్లోల్లకు గౌరవం దక్కింది కేసిఆర్ వల్లేతొర్రూరు మున్సిపాలిటీ అన్ని విధాల అందంగా తీర్చి దిద్దుతున్నాను.ఇవన్నీ కేసిఆర్ గారి నాయకత్వములో జరుగుతున్నాయి.
ఇప్పుడు కొన్ని మత పార్టీలు చేరినయ్. బీజేపీ రెండు మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు రాబట్టుకునే ఆలోచన చేస్తుంది.కానీ తెలంగాణలో అన్ని మతాలను కేసిఆర్ గారు గౌరవం ఇస్తున్నాడు.రైతులకు కళ్లాలు కడుతుంటే బిజెపి ప్రభుత్వం వద్దు అంటుంది.ప్రతి రైతుకు కల్లాలు కట్టుకునేందుకు సీఎం కేసీఆర్ గారు డబ్బులు ఇచ్చారు.
కానీ కల్లాలు కట్టొద్దు..కట్టిన వాటి దగ్గర రైతుల నుంచి డబ్బులు వాపస్ తీసుకోవాలి అంటున్నారు బిజెపి నేతలు.వేరే రాష్ట్రాల్లో రొయ్యలు ఎండ పెట్టుకునేందుకు కల్లాలు కట్టడానికి అనుమతులు ఇస్తున్న బిజెపి ప్రభుత్వం రైతుల కల్లాలు కట్టుకునెందుకు మాత్రము డబ్బులు ఇవ్వను అంటుంది.కేంద్రంలో మూర్ఖపు బీజేపీ ప్రభుత్వం ఉందికేంద్రం రాష్ట్రం మీద కక్ష సాధింపు చేస్తోంది. పెళ్ళి లగ్న కోటు వేసుకోగానే ఆ కాగితం మాకు ఇస్తే పెళ్లికి ముందే కళ్యాణ లక్ష్మి చెక్కు ఇస్తాం. ఇది మీకు పెళ్లికి ఉపయోగపడుతుంది.
సీఎం కేసీఆర్ చర్చిల కోసం డబ్బులు ఇచ్చే అవకాశం ఇచ్చారు..మీకు ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకు రండి డబ్బులు ఇస్తాను. పేద ఫాస్టర్లు దళిత బంధు ఇండ్లు పెట్టిస్తాను. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, ఎంపీపీ అంజయ్య, జెడ్పిటిసి శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ హరి ప్రసాద్, పాస్టర్లు కెవి పీటర్, కృప పాల్, కృష్ణ మోహన్, ఏసుదాసు, రంజిత్ పాల్, దేవ సహాయం, డేవిడ్ రాజ్, జెర్మియా తదితరులు పాల్గొన్నారు.