– టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు
దమ్ముంటే లోకేష్ అనంతపురం పర్యటను అడ్డుకొని చూడండి తెలుస్తుందని టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు పేర్కొన్నారు. విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ …రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ కళాశాలల మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం, అనేక జిల్లాల్లో వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తుంటే వారిపై పోలీసులు విచక్షణా రహితంగా వ్యవహరించారు.అనంతపురం జిల్లాలో సత్యసాయి కళాశాలలో విద్యార్థులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతుంటే పోలీసులు అతి కిరాతకంగా విద్యార్థినీ, విద్యార్థులపై లాఠీ ఛార్జి చేశారు. రౌడీల్ని, వీధి గూండాల్ని, హంతకుల్ని తీసుకెళ్లే విధంగా పోలీసులు అతి కిరాతకంగా వ్యవహరించారు.
ఈ తీరును రాష్ట్ర ప్రజలందరూ వీక్షించారు. శంకర నారాయణ అనే వంకర నారాయణ ఏ శాఖా మంత్రో అతనికే తెలియదు. ఇతను మంత్రి అని ఈ జిల్లాలోని ఇతర శాసనసభ్యులే గుర్తించరు. ఆయన తన ఉనికినే కోల్పోయాడు. ఎవరూ తనను గుర్తించలేదనే క్రమంలో ఆయనకు మతి భ్రమించడంతో నారా లోకేష్ మీద అవాకులు, చవాకులు పేలడం ఆయన మతిభ్రమణకు నిదర్శనం. విద్యార్థులపై పోలీసులు దాడి చేసిన సంఘటనను ఖండిస్తూ విద్యార్థులకు అండగా ఉండేందుకు ఎయిడెడ్ విద్యా సంస్థలను కాపాడాలన్నదే నారా లోకేష్ ఉద్దేశం. దాడి ఘటనలో గాయపడ్డ విద్యార్థులను పరామర్శించడానికి అనంతపురం జిల్లా సత్యసాయి కళాశాలకు వెళ్లదలచుకున్న లోకేష్ ను విద్యార్థుల తల్లిదండ్రులు రానివ్వరని, ప్రతిఘటిస్తారని శంకర నారాయణ పేర్కొనడం ఆయన మూర్ఖత్వం.
నారా లోకేష్ అనంతపురం పర్యటకు దమ్ముంటే పోలీసులు లేకుండా పోలీసులుగానీ, వైసీపీ నాయకులుగానీ రండి తేల్చుకుందాం. తాడో, పేడో తేల్చుకుందాం వైసీపీ నాయకులు వావాలని సవాల్ విసురుతున్నా. తెలుగుదేశం పార్టీ గురుకుల పాఠశాలల్ని తెలుగు రాష్ట్రాల్లో స్థాపించింది. పేద విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల్లో చదివే విధంగా బెస్ట్ అవలబుల్ స్కీములు తెచ్చి వేలాది మంది పేద విద్యార్థులకు విద్యను అందించింది. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా లోకేశ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ పేద విద్యార్థులకు విదేశీ విద్యను అందించే విధంగా రూపకల్పన చేశారు. పెనుగొండవాసులు పొట్టచేతపట్టుకొని వలస వెళ్తుంటే కియాలాంటి పరిశ్రమను తెచ్చి వేలాదిమందికి జీవనోపాధి కల్పించి ఆదుకున్నారు. అంతేకాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉపాధి కల్పనకు నీ నియోజకవర్గానికి వచ్చేలా లోకేశ్ చేశారు.
రాష్ట్రంలో ఏ ఎయిడెడ్ కళాశాల దగ్గరికైనా వెళ్లి మీ ప్రభుత్వ నిర్ణయాన్ని పోలీసులు లేకుండా విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పే దమ్ము లేదు. అనంతపురం జిల్లాలోని సత్యసాయి కళాశాల విద్యార్థులతో లోకేశ్ ముఖాముఖి మాట్లాడుతారు. దెబ్బలుతిన్న విద్యార్థుల్ని పరామర్శిస్తారు. దమ్ముంటే మీ నాయకుడుగానీ, మీలో ఎవరైనాగానీ అక్కడ బహిరంగ చర్చకు రావాల్సిందిగా సవాల్ విసురుతున్నాను. పేద విద్యార్థులను విద్యకు దూరం చేయాలని చూస్తే టీడీపీ సహించదు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపితే విచక్షణా రహితంగా వ్యవహరిస్తారా? లోకేశ్ ను విమర్శించే స్థాయి శంకర్ నారాయణకు లేదు.
లక్షల కోట్లు విలువ చేసే ఎయిడెడ్ విద్యాసంస్థల స్థలాలను కబ్జా చేయాలని చేస్తే పుట్టగతులుండవు. శంకర్ నారాయణ పిచ్చి ప్రేలాపనలు, అవాకులు, చవాకులు పేలడం మానుకోవాలి. స్వతహాగా స్వాగత తోరణం పెట్టించుకోలేని స్థితి శంకర నారాయణది. శంకర్ నారాయణ ఏశాఖ మంత్రో ఆయనకే తెలియదు. ఒక జాతీయ పార్టీ ఉనికి కోల్పోతే ఆ సంతతి నుంచి వచ్చిన పార్టీ వైసీపీ. మంచి సిద్ధాంతాలతో, పేద ప్రజల కోసం పుట్టిన పార్టీ టీడీపీ. దమ్ముంటే కేంద్ర విధానాలను వ్యతిరేకించాలి. మాకు, బీజేపీకి సంబంధం లేదు.
పెట్రోల్ బంక్ ల దగ్గర నిరసన తెలియజేయడం అర్థంలేనిదని కొడాలి నానీ మాట్లాడటం సిగ్గుచేటు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం గల నాయకుడి గురించి మాట్లాడే అర్హత కొడాలి నానీకి లేదు. చేతకానితనం, దద్దమ్మ పరిపాలన గురించి రాష్ట్ర ప్రజలకు తెలపడానికే పెట్రోల్ బంక్ లవద్ద నిరసన కార్యక్రమం. రూ.70 లీటరు పెట్రోల్ ఉన్నప్పుడు జగన్ అసెంబ్లీలో గగ్గోలు పెట్టాడు. బాదుడే బాదుడు అని డ్రామా ఆర్టిస్టులా మాట్లాడాడు. ఈరోజు 110 రూపాయలు ఉంటే కనిపించాదా?సాంప్రదాయాలకు, విలువలకు కట్టుబడి బద్వేల్ లో జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. మానవతా విలువలు కలిగిన నాయకుడు చంద్రబాబునాయుడు. అందరికీ సాంప్రదాయాలు నేర్పిన నేత ఆయన. తిరుపతి ఎన్నికల్లో దివంగత ఎంపీ కుటుంబానికి టికెట్ ఇవ్వకుండా వేరే వ్యక్తికి టికెట్ ఇచ్చారు.
ఈ విషయాలను విజ్ఞతతొ ఆలోచించాలని కొడాలి నానీకి తెలియజేస్తున్నా. ఏకపక్షంగా పోటీ చేసి వచ్చిన ఓట్లని టీవీల్లో, పేపర్లలో పేపర్ యాడ్స్ ఇచ్చి మేమింత స్థాయిలో బలపడినామని గొప్పలు చెప్పడం సరికాదు. మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకోవడానికి నానా యాతన పడుతున్నారు. కుప్పం, నెల్లూరు అన్ని ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా భయభ్రాంతానికి గురిచేశారు. ఒకవేళ వేసినా గెలవలేమనే భయమున్న చోట అధికారులచే ఫోర్జరీ సంతకాలతో ఏకగ్రీవాలు చేసుకోవడం సిగ్గుమాలిన చర్య. దొంగ దారుల్లో గెలిచి ఇది ఇది వైసీపీ గెలుపు, జగనన్న బలుపు అని విర్రవీగడం మీ విజ్ఞతకు నిదర్శనం. ఉత్తర ప్రగల్భాలు మానుకోవాలి.ప్రజలు విజ్ఞులు. మీలాంటి దుష్టుల్ని ఎంతకాలం భరించాలో అంతకాలం భరిస్తారు, ఆ తర్వాత మెడపట్టి గెంటే రోజులు దగ్గరలో ఉన్నాయన్న విషయాన్ని కొడాలి నానీ గ్రహించాలని టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు తెలిపారు.