• తన ప్రాణాలకు హాని ఉందని, జైల్లో తగిన భద్రత లేదని చంద్రబాబే స్వయంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చెప్పారు
• ఆయనకు ప్రభుత్వం సరైన భద్రత కల్పించిందా లేదా అని న్యాయమూర్తి వెంటనే పరిశీలించాలి
• జైలుపై గతంలో డ్రోన్ తిరిగిన ఘటనపై ప్రభుత్వం ఎలాంటి విచారణ చేపట్టలేదు
• చంద్రబాబు జైల్లో ఉన్నారనే కంటే ప్రభుత్వ కస్టడీలో ఉన్నారని చెప్పడమే కరెక్ట్
• టీడీపీ అధినేత జైలుకు వెళ్లినప్పటినుంచీ ఆయన విషయాలన్నీ ప్రభుత్వ సలహాదారు సజ్జలే పర్యవేక్షిస్తున్నాడు
• జైలు అధికారులు..వైద్యులు.. ఇతరులు ఏం చేయాలో.. ఏం మాట్లాడాలో అంతా సజ్జలే నిర్ణయిస్తున్నాడు
• వైద్యులు ప్రతిరోజు చంద్రబాబుని పరీక్షించాక ఆయన ఆరోగ్య సమాచారం ఎందుకు బహిర్గతం చేయడంలేదు? డాక్టర్లు ఇచ్చిన ఒరిజినల్ రిపోర్టుని కాదని జైలర్ ధృవీకరించిన రిపోర్టుని ఎందుకు మీడియాకు చూపిస్తున్నారు?
• స్కిల్ డెవలప్ మెంట్ కేసే పెద్ద బోగస్ కేసు. రాజకీయ కుట్రలోభాగంగానే చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపారని ప్రజలు గ్రహించారు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి టీడీపీ పక్షనేత యనమల రామకృష్ణుడు
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అసలు ఎలాంటి అవినీతి జరగనప్పుడు, చంద్రబాబు ఏ తప్పు చేయలేదని తెలిసీ కేవలం ఆయనపై కక్షతో, ఆయన ఆరోగ్యం దెబ్బతీయడానికి, ఆయన్ని ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలన్న దురుద్దేశం పాలకుల్లో స్పష్టంగా కనిపిస్తోందని, చంద్రబాబునాయుడి భద్రతపై కూడా పలు అనుమానాలు తలెత్తుతున్నాయని, తనకు సరైన భద్రత లేదని ఆయనే స్వయంగా చెప్పినా ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకోలేదని, ఇవన్నీ గమనిస్తే టీడీపీ అధినేతే లక్ష్యంగా ప్రభుత్వం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనమండలిలో టీడీపీ పక్షనేత యనమల రామకృష్ణుడు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
చంద్రబాబులాంటి నాయకుడి భద్రత, ఆరోగ్యం విషయంలో పాలకులు వ్యవహరిస్తున్న తీరుపై, జైల్లోని పరిణామాలపై న్యాయమూర్తి దృష్టి పెట్టాలి
“ తనకు సరైన భద్రతలేదని స్వయంగా చంద్రబాబునాయుడు, ఏసీబీ కోర్టు న్యాయ మూర్తితో చెప్పాక, న్యాయమూర్తి తగిన భద్రత కల్పించాలని ఆదేశించాక కూడా జైలు అధికారులు ప్రభుత్వం పట్టించుకోకపోవడం రాజకీయ కుట్రకాక మరేమిటి? జైల్లో చంద్రబాబుకి సమీపంలో కూడా ఎవరూ ఉండటంలేదు. జైలుపై గతంలో డ్రోన్ తిరిగింది. దానిపై ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి విచారణ చేపట్టలేదు. చంద్రబాబు హెల్త్ బులెటి న్ కూడా సక్రమంగా విడుదల చేయడంలేదు. వైద్యుల సూచనల్ని జైలుఅధికారులు ఖా తరు చేయడంలేదు.
వైద్యులు ప్రతిరోజు చంద్రబాబుని పరీక్షించాక ఆయన ఆరోగ్య సమాచారం ఎందుకు బహిర్గతం చేయడంలేదు? డాక్టర్లు ఇచ్చిన ఒరిజినల్ రిపోర్టుని కాదని జైలర్ ధృవీకరించిన రిపోర్టుని ఎందుకు మీడియాకు చూపిస్తున్నారు? చంద్ర బాబుకి ప్రాణహాని ఉందనే కేంద్రప్రభుత్వం ఆయనకు ఎన్.ఎస్.జీ భద్రత కల్పించింది. ఆ భద్రతను అంచెలంచెలుగా పెంచుకుంటూ పోయింది. చంద్రబాబుకి జైల్లో తగిన భద్రత కల్పించారా లేదా అనేదానిపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పరిశీలించాలి.
చంద్రబాబులాంటి నాయకుడి విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆలోచించాలని ఒక సాధారణ పౌరుడిలా విజ్ఞప్తి చేస్తున్నాం.
అధికారంకోసం సొంత బాబాయ్ చంపించిన వ్యక్తికి ఇతరులంటే లెక్క ఉంటుందా?
నానాటికీ చంద్రబాబుకి ప్రజాదరణ పెరగడాన్ని చూసి తట్టుకోలేకనే జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధినేతను అన్యాయంగా జైలుకు పంపాడు. కుట్రలు, కుతంత్రాలు, దురాలోచ న గల నాయకుడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి, అసలు రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీనే లేకుండా చేసి ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నాడు. గతంలో కంబోడియాలో ఇలానే జరిగిందని చెప్పుకున్నాం. సొంత బాబాయ్ ని అధికారంకోసం చంపించిన వ్యక్తికి ప్రతిపక్షాలన్నా.. ప్రధాన నాయకులన్నా లెక్క ఉంటుందా?
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో వేలకోట్ల అవినీతి జరిగింది.. చంద్రబాబు ప్రభుత్వసొమ్ము కాజేశాడని మాట్లాడినవారు.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సభ్యత్వ రుసుముని అవినీతిసొమ్ముగా చూపిస్తున్నారు
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు అనేది కేవలం యువతను దృష్టిలో పెట్టుకొ ని వారి నైపుణ్యాభివృద్ధిని పెంచడానికి తీసుకొచ్చిందే. గతంలో మానవమేథస్సు మీదే పారిశ్రామిక రంగం ఎక్కువగా ఆధారపడేది. కానీ ఇప్పుడు అంతా సాంకేతిక పరిజ్ఞానం .. రోబోటిక్స్ సైన్స్ వంటివి ఇండస్ట్రియల్ సెక్టార్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత నైపుణ్యాలు.. పెంచడానికి, వారికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడిన శిక్షణ అందించడానికే టీడీపీప్రభుత్వం గతంలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసింది.
పేదలు, బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడే ప్రాజెక్ట్ ను, తన కక్షలకు బలి చేసిన జగన్ రెడ్డి, చివరకు యువతకు ఎలాంటి శిక్షణ లేకుండా చేశాడు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు నాటి ప్రభుత్వం విడుదలచేసిన ప్రతిరూపాయి అసెంబ్లీ ఆమోదంతోనే ఇవ్వడం జరిగింది. డబ్బులు ఇవ్వడం మాత్రమే ప్రభుత్వం చేసింది.. ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ తో ప్రభుత్వానికి సంబంధంలేదు. ఆ వ్యవహారమంతా సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలే చూసేలా ప్రభుత్వం ముందే వాటితో ఒప్పందం చేసుకోవడం జరిగింది. జగన్ ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఇంప్లిమెంటింగ్ అథారిటీ ని వదిలేసి, నిధులిచ్చిన గత ప్రభుత్వం తప్పుచేసిందని చెబుతోంది.
మొదటేమో వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు… తరువాత రూ.370కోట్లు చంద్రబాబు కాజేశాడ న్నారు… న్యాయస్థానాల్లో చంద్రబాబుకి డబ్బులు అందినట్టు ఆధారాలున్నాయా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోయారు. చివరకు ఇప్పుడు రూ.27కోట్లు అంటున్నా రు. ఆ సొమ్ముకూడా ఎక్కడిదయ్యా అంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు పొందడం కోసం కార్యకర్తలు చెల్లించిన సొమ్ము. దాదాపు 40 సంవత్సరాల నుంచి నడుస్తున్న పార్టీకి వచ్చిన విరాళాలు తప్పు అంటున్నారు.. మరి మాపార్టీ కంటే తరువాత పుట్టిన వైసీపీకి తెలుగుదేశం కంటే ఎక్కువ విరాళాలు వస్తున్నాయి. పార్టీకి విరాళాలు ఇవ్వా లనుకునేవారు ఇవ్వవచ్చని మేం మహనాడు లాంటి చోట్ల బహిరంగంగానే చెబుతాం. దానిలో దాచడానికి ఏముంటుంది?
జైల్లో చంద్రబాబుకు సంబంధించిన అన్ని వ్యవహారాలు సజ్జలే పర్యవేక్షిస్తున్నాడు
స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో ఎక్కడా..ఎలాంటి తప్పు జరగలేదని అవినీతికి ఆస్కారమే లేదని ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు. కేవలంరాజకీయ కుట్రలో భాగంగ చంద్రబాబుని ఏదోరకంగా ఇబ్బందిపెట్టాలి.. ఆయన ప్రాణాలకు ప్రమాదం కలిగించాలనే కుట్రపూరిత ఆలోచనల్లో భాగంగానే పాలకులు ఇలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పేరుకే జైల్లో ఉన్నారు కానీ.. కచ్చితంగా గమనిస్తే ప్రభుత్వ కస్టడీలోనే ఉన్నట్టు అర్థమవుతోంది.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డే చంద్రబాబుకి సంబంధించిన అన్ని విషయాలను పరిశీలిస్తున్నారు. చంద్రబాబుని జైలుకు పంపిన దగ్గరనుంచీ గమనిస్తే అటు జైలు అధికారులు.. ఇటు వైద్యులు.. ఇతర అధికారులు ఏం చేయాలో.. ఏం మాట్లాడాలో కూడా సజ్జలే నిర్ణయిస్తున్నాడు. వీలైనంత త్వరగా చంద్రబాబుకి తగిన భద్రతతో పాటు మెరుగైన వైద్యసేవలు అందించాలి” అని యనమల కోరారు.