-కూటమికి 130 సీట్లు ఖాయం
-టీడీపీ నేత బుద్దా వెంకన్న
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు కూటమికే ఓట్లు వేశారు. 2019లో జగన్‌ను గెలిపించడానికి జనాలు ఎలా క్యూ కట్టారో ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపించడానికి క్యూ కట్టారని, 130 స్థానాలలో గెలుపు ఖాయమని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. ఎంసీపీ(మోదీ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్) మహా కూటమి సూపర్ సక్సెస్ అయిందన్నా రు.
2019లో 79 శాతం పోలైతే ఇప్పుడు 86 శాతం ఓట్లు పోలయ్యాయి. జగన్‌ను ఓడిరచడానికి బెంగళూరు, తెలంగాణ, కర్ణాటక నుంచి ఓటర్లు వచ్చారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రిగా అమరావతిలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారని స్పష్టం చేశారు. బొత్స సత్యనారాయణ, సతీమణి ఇద్దరూ ఓడిపోతున్నారు. ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటావా అని ప్రశ్నించారు. జగన్ మళ్లీ సీఎం అవుతారని మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. 151 సీట్లు గెలిపిస్తే జగన్ ప్రజలకు ఏం చేశాడని ప్రశ్నించారు.