– ముఖ్యమంత్రి హోదాను మరిచి మాట్లాడడం తగునా?
– వ్యక్తిత్వ హననానికి పాల్పడే నైతిక హక్కు మీకు లేదు
– ఎదుటి వారిని విమర్శించి మీకు మీరే పరువు దిగజార్చుకున్నారు
– సభ్య సమాజం తలదించుకునేలా జగన్ వ్యాఖ్యలు సిగ్గుచేటు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికి ఉంటే ముసలి నక్క అనే అనుచిత వ్యాఖ్యలతో దూషించేవాడివా? అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. తండ్రి సమానుడు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలతో కించపరిచేలా మాట్లాడడం ముఖ్యమంత్రి హోదాకు కళంకం అని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రాష్ట్రానికి తలమానికగా ఉండాల్సింది పోయి నడిరోడ్డుమీద సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడుతూ రాష్ట్రం పరువుతీస్తున్నారని జగన్ తీరుపై వర్ల మండిపడ్డారు.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభల్లో హోదా మరిచి మరిచిపోతున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సభల్లో ఆచి,తూచి మాట్లాడాలి. ఎందుకంటే సమాజం ముఖ్యమంత్రి మాటలను అనుకరిస్తారు, అనుసరిస్తారు.
ఎడాపెడా మాట్లాడదామంటే రాష్ట్రంలో కుదరదు. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవికి ఓ ప్రత్యేకస్థానం, హుందాతనం, గౌరవం ఉన్నాయి. ముఖ్యమంత్రి సభ్యత, సంస్కారం వదిలి మాట్లాడకూడదు. సమాజంలోని మహిళలు తలదించుకునేలా సీఎం మాట్లాడకూడదు. ప్రతిమాట ఆదర్శప్రాయంగా ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
సినిమాల్లో సీన్లు ఆధారంగా కేసులు పెడతారా జగన్?:
వెంకటగిరి సభలో జగన్ మాట్లాడుతూ బాలకృష్ణను ఉద్దేశించి అతనొక దౌర్భాగ్యపు బావమరిది అని వ్యాఖ్యలు చేశారు. తోటి కళాకారులతో హాస్యోక్తులు జరుగుతున్న సమయంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు రాజకీయాలను ముడిపెట్టి వ్యక్తిత్వహననానికి పాల్పడడం ముఖ్యమంత్రికి తగదు. సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం అనే సంగతి మీకు తెలియదా జగన్? మీరు కూడా బాలకృష్ణ అభిమానిగా ఉన్నారనే సంగతిని మర్చిపోయారా? సినిమాల్లో జరిగే సీన్లలోని నేరాలను కూడా పరిగణనలోకి తీసుకుని కేసులు పెట్టేలా జగన్ తీరు కనబడుతోంది.
పవన్ పై చేసిన వ్యాఖ్యలతో సమాజం తలదించుకుంటోంది:
ఓ రాజకీయపార్టీ అధ్యక్షులు, సినీపరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉన్న పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం, మహిళాలోకం తలదించుకునేలా ఉన్నాయి. లోబరచుకోవడం, పెళ్లిచేసుకోవడం, వాడుకుని వదిలేయడం వంటి వ్యాఖ్యలు మీరు చేయవచ్చా ముఖ్యమంత్రి?
పవన్ కళ్యాణ్ కుటుంబ వ్యక్తిగత విషయాలను బహిరంగ సభల్లో మాట్లాడి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం మీ పదవికి తగునా జగన్? పవన్ కళ్యాణ్ చట్టబద్దంగా ముందస్తులో పెళ్లిచేసుకున్న వాళ్లకు విడాకులు ఇచ్చి న్యాయబద్దంగా మరో వివాహం చేసుకున్నారు. చేసుకున్న భార్య పాస్ పోర్టు, ఆధార్ కార్డు వంటి రికార్డుల్లో పవన్ కళ్యాణ్ ను భర్తగా ఆమె అడ్రస్ మార్చుకున్నారు.
జగన్మోహన్ రెడ్డి మీ తాత రాజారెడ్డికి రెండు పెళ్లిళ్లు అనే సంగతిని ఎవరైనా రాష్ట్రంలో మాట్లాడుతున్నారా? పక్కవారి వ్యక్తిగత జీవితం గురించి మీకు ఎందుకు? రాష్ట్రంలోని ఇంటెలిజెన్స్ అధికారులు బ్రతికే ఉన్నారా? ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై పూర్తి వివరాలతో సరైన నివేదిక ఇవ్వాలి కదా.
బైబిల్ చదివే నీకు ఈ విషయాలు తెలియవా జగన్?:
ఎదుటివారి కంటిలో నలుసును ఎత్తిచూపే ముందు మన కంటిలో ఉన్న దూలాన్ని పరిశీలించుకోవాలని బైబిల్ బోధిస్తోంది. ప్రతిరోజూ బైబిల్ చదివే ముఖ్యమంత్రికి ఈ మాత్రం తెలియకపోతే ఎలా? మా పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి 20ఏళ్ల క్రిందట విద్యార్థి దశలో అరగ్లాసు బీరు తాగిన ఫోటోలు తెచ్చి నేడు వాటిని ఎత్తిచూపడం ఏంటో అర్థం కావడం లేదు. విద్యార్థి దశలో ఉండగా మీరు ఏమీ చేయలేదా జగన్? వైఎస్ రాజశేఖర్ రెడ్డి మిమ్మల్ని బెంగుళూరు వదిలి హైదరాబాద్ రావొద్దని ఎందుకు చెప్పారు?
రాజశేఖర్ రెడ్డి తన పరువుపోతుందనే కారణంతో జగన్ ను బెంగుళూరుకే పరిమితం చేసిన విషయం, దానికి సంబంధించిన వీడియో నేటికీ యూట్యూబ్ లో ఉంది. మా నాయకుడు లోకేష్ స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో పీజీ చదివారు. మీరు ఏ కాలేజీలో, ఏ డిగ్రీ చదివారో చెప్పే ధైర్యం ఉందా జగన్? మీ తండ్రి చనిపోయిన రోజు మీరు కలకత్తాలో ఎందుకు ఉన్నారని మేం ఎప్పుడైనా అడిగామా? పదోతరగతి క్వశ్చన్ పేపర్ విషయంలో మీ పాత్ర ఏంటో రాష్ట్రం మొత్తం తెలుసు. అయినా మేం ఎక్కడా దాన్ని ఎత్తి చూపడం లేదు. అది మాకు, మా పార్టీకి ఉన్న సంస్కారం.
మీ పరువును మీరే రోడ్డుపై పోగొట్టుకుంటున్నారు:
మీ తండ్రి వయస్సు ఉన్న వ్యక్తి చంద్రబాబును అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించడం తగునా ముఖ్యమంత్రి? మీ తండ్రి బ్రతికి ఉంటే ముసలినక్క అనే అనుచిత వ్యాఖ్యలతో అవమానించేవారా? ఎదుటి వ్యక్తుల వ్యక్తిత్వ హననానికి పాల్పడే నైతిక హక్కు మీకు లేదని గుర్తుపెట్టుకోవాలి. బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. మీరు ఎదుటివారిని కించపరిచానని చంకలు గుద్దుకోవద్దు జగన్…మీరే మీ గౌరవాన్ని నడిరోడ్డు మీద తీసుకున్నారని గుర్తుపెట్టుకోండి అని జగన్మోహన్ రెడ్డికి వర్ల రామయ్య హితవు పలికారు.